Karthika Deepam 2 Weekly: సుమిత్ర - దశరథల్ని కలిపిన కార్తీక్.. శివన్నారాయణ ఇంట్లో పండుగ
Photo Courtesy: JioHotstar
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు 499 నుంచి 504వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
అక్టోబర్ 27వ తేదీ 499వఎపిసోడ్‌లో..
కార్తీక్‌ను తీసుకుని ఇంటికి వస్తాడు శివన్నారాయణ. ఈరోజు నువ్వు కొత్త తాతని చూస్తావని మనవడితో చెబుతాడు. దాంతో తాత ఏదో బాంబు పేల్చబోతున్నాడని కార్తీక్ టెన్షన్ పడతాడు. సుమిత్ర ఫోటో చూస్తూ బాధపడుతున్న దశరథని ఇకపై నీ భార్య గురించి వెతకాల్సిన అవసరం లేదని అంటాడు పెద్దాయన. ఆ మాటలతో జ్యోత్స్న, పారు, దశరథ, కార్తీక్ షాక్ అవుతారు. తప్పు చేసింది నేనే, సుమిత్రని అలాంటి మాటలు అనకుండా ఉండాల్సిందని, అవన్నీ అప్పుడు ఆలోచించాలని చెబుతాడు శివన్నారాయణ. నిన్నటి వరకు కొడుకుని ఓదార్చి, కోడలి గురించి ఊరంతా వెతికించిన తాతలో వచ్చిన మార్పు చూసి జ్యోత్స్నకి తేడా కొడుతుంది. తాతయ్య ఒక్కడే బయటికి వెళ్లాడు, వచ్చేటప్పుడు బావతో కలిసొచ్చాడని ఆమెకు అనుమానం వస్తుంది. ఆఫీస్‌కి వెళ్లకుండా రోడ్డుపై ఫ్రెండ్‌తో కబుర్లు చెబుతున్న అల్లుడి గురించి శ్రధర్ ఆలోచిస్తాడు. అతను ఇంటికి రాగానే తాను తీసిన ఫోటో చూపించి నిలదీయడంతో కాశీ వణికిపోతాడు. మావయ్యతో చాలా కఠినంగా మాట్లాడవని కార్తీక్ అనగా.. ఇదంతా సుమిత్ర మీదున్న ప్రేమను బయటికి తీసుకురావడానికేనని అంటాడు శివన్నారాయణ. రేపు వాడి పెళ్లి రోజు కాబట్టి దశరథ - సుమిత్రలను కలపడానికి ప్లాన్ ఉందని చెబుతాడు శివన్నారాయణ.
అక్టోబర్ 28వ తేదీ 500వ ఎపిసోడ్‌లో..
దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ అత్త- మావయ్యలని కలపడానికి తాతయ్య ప్లాన్ చేస్తున్నాడని అంటాడు. మరోవైపు.. రోజు రోజుకు నువ్వు ఈ ఫ్యామిలీకి దూరమైపోతున్నావని జ్యోత్స్నని హెచ్చరిస్తుంది. మీ అమ్మని వెతికి మీ నాన్న, తాతల దగ్గర మంచి మార్కులు కొట్టేయమని సలహా ఇస్తుంది. మమ్మీ ఎక్కడుందో బావకి తెలుసని, తాత కూడా కొత్తగా మాట్లాడుతున్నాడని జ్యోత్స్న చెబుతుంది. లేట్ చేస్తే కార్తీక్ సీఈవో అవుతాడని, దీప ఈ ఇంటికి దేవత అవుతుందని .. మా అమ్మ ఎక్కడున్నా వెతికి మీ ముందు నిలబెడతానని చెబుతుంది జ్యోత్స్న. ఉదయాన్నే దశరథ ఒంటరిగా బయల్దేరడంతో కార్తీక్‌ని తోడుగా పంపిస్తాడు శివన్నారాయణ. నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లు ఎందుకు అబద్ధం ఆడావని కాశీని నిలదీస్తాడు శ్రీధర్. ఈ ఇంట్లో వాళ్లు నాకు జాబ్ లేకపోతే ఒకలా, జాబ్ వస్తే మరోలా నన్ను చూస్తున్నారని చెబుతాడు కాశీ. ఎవరికీ నిజం చెప్పొద్దని శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు కాశీ. అది చూసిన స్వప్న షాక్ అవుతుంది. సుమిత్ర కనిపించకపోవడంతో దీప ఇంటికి పోలీసులతో వెళ్తుంది జ్యోత్స్న.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 29వ తేదీ 501వ ఎపిసోడ్‌లో..
గుడిలో దశరథను, కార్తీక్‌ను చూసిన సుమిత్ర షాకై పక్కనే దాక్కొంటుంది. దశరథ, సుమిత్రల పేరు మీద అర్చన చేయించమని కార్తీక్ చెప్పగా.. ఇప్పుడే ఒకరు అదే పేర్లతో అర్చన చేయించారని చెబుతారు పంతులు గారు. ఆ మాటలతో దశరథ.. సుమిత్ర ఇక్కడికి వచ్చిందని సంతోషిస్తాడు. మనిషిని పోలిన మనుషులు ఉన్నట్లే.. పేరును పోలిన పేర్లు ఉంటాయని చెబుతాడు కార్తీక్. దీప ఇంటికి పోలీసులతో వచ్చిన జ్యోత్స్న.. మర్యాదగా మా మమ్మీ ఎక్కడుందో చెబుతావా లేదా అని నిలదీస్తుంది. ఈ దీపే మా అమ్మని కిడ్నాప్ చేసుంటుందని పోలీసులతో దీపను అరెస్ట్ చేయిస్తుంది. నువ్వు మా నాన్న కాళ్లు ఎందుకు పట్టుకున్నావని కాశీని స్వప్న నిలదీస్తుంది. నేను మావయ్య గారి ఆశీర్వాదం తీసుకున్నానని అబద్ధం చెప్పి తెచ్చుకుంటాడు కాశీ. గుడిలో సుమిత్ర- దశరథలు మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్రను దూరం పెట్టి తప్పు చేశానని, తనకి ఏమైనా అయితే నేను బతకనని చెబుతాడు. వారిద్దరి మాటల్ని చాటుగా విన్న సుమిత్ర బాధపడుతుంది.
అక్టోబర్ 30వ తేదీ 502వ ఎపిసోడ్‌లో..
కార్తీక్, దశరథ మాటల్ని సుమిత్ర చాటుగా వింటుంది. ఇంతలో అత్తని చూసిన కార్తీక్.. వాటర్ బాటిల్ తీసుకుని వస్తానని దశరథతో చెప్పి బయటికి వెళ్తాడు. ఇప్పటికైనా మావయ్య దగ్గరికి వెళ్దామని చెబుతాడు. ఆయన నా ముందు తలదించుకుంటే నేను చూడలేనని సుమిత్ర వెళ్లిపోబోతుండగా దశరథ వచ్చి ఆపుతాడు. నన్ను క్షమించి తిరిగి ఇంటికి వచ్చేయ్ అని అడుగుతాడు. దాంతో భర్తను హత్తుకున్న సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. దీపే నిన్ను ఇక్కడికి తీసుకొస్తానని చెప్పింది.. ఆమె ఎక్కడ అని సుమిత్రను అడుగుతాడు కార్తీక్. నేను వచ్చానని... దీప నన్ను తీసుకురాలేదని చెబుతుంది సుమిత్ర. దాంతో టెన్షన్ పడ్డ కార్తీక్... దీపకి ఫోన్ చేస్తాడు. ఫోన్ జ్యోత్స్న ఎత్తి దీప, కాంచనలు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని చెబుతుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. మర్యాదగా మా అమ్మని, భార్యని ఇంట్లో వదిలి వారికి సారీ చెప్పమని వార్నింగ్ ఇస్తాడు. సుమిత్ర ఎక్కడుందో చెప్పకపోవడంతో దీప, కాంచనల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి.. సెల్‌లో వేసి చితకబాదమని పోలీసులకు చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో శివన్నారాయణ, పారిజాతం కోపంతో ఊగిపోతూ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమవుతారు.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 31వ తేదీ 503వ ఎపిసోడ్‌లో..
మీరు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? శివన్నారాయణ కూతురు... నా కూతురి కోడల్ని అని శివన్నారాయణ చెప్పడంతో ఎస్ఐకి ముచ్చెమటలు పడతాయి. జరిగిన దానికి మీరు నా కూతురికి క్షమాపణలు చెప్పకుంటే నేను ఐజీకి ఫోన్ చేస్తానని శివన్నారాయణ బెదిరించడంతో కాంచనకు ఎస్ఐ క్షమాపణలు చెబుతాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిన పనిలేదని నా కోడలు సేఫ్‌గా ఉందని శివన్నారాయణ చెప్పడంతో ఎక్కడ ఉందని అడుగుతుంది జ్యోత్స్న. అందరూ శివన్నారాయణ ఇంటికి బయల్దేరుతుండగా కాంచనకు శ్రీధర్ ఫోన్ చేయడంతో మేం పోలీస్ స్టేషన్‌లో ఉన్నామని చెబుతుంది. సుమిత్ర కనిపించడం లేదని నా భార్య మీదే కంప్లయంట్ ఇస్తావా? నీకు చరమగీతం పాడాల్సిందేనని జ్యోత్స్నపై శ్రీధర్ రగిలిపోతాడు. ఇంటికొచ్చాక జ్యోత్స్న పెద్ద గొడవ చేస్తుంది. ఇంతలో శ్రీధర్ వచ్చి సుమిత్రను దీప, కాంచనలు కిడ్నాప్ చేశారని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని నిలదీస్తాడు. కాసేపటికి సుమిత్ర - దశరథలని తీసుకుని కార్తీక్ ఇంటికి రావడంతో శివన్నారాయణ ఇంట్లో సందడి నెలకొంటుంది. కార్తీక్‌ను అందరూ పొగుడుతుంటే జ్యోత్స్న తట్టుకోలేక కోపంగా వెళ్లిపోతుంది.
నవంబర్ 1వ తేదీ 504వ ఎపిసోడ్‌లో..
పోలీస్ స్టేషన్‌లో నన్ను నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదని పారిజాతంపై మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు రోజురోజుకు శత్రువులా మారిపోతున్నావని మంచిగా ఉన్నట్లు నటించమని జ్యోత్స్నని తీసుకుని కిందకి వెళ్తుంది పారిజాతం. సుమిత్ర అత్తయ్య కనిపించిందని, అందరూ శివన్నారాయణ గారి ఇంట్లోనే ఉన్నారని .. మనం కూడా వెళ్దామని స్వప్న అడగటంతో కావేరి వద్దు అంటుంది. నేను ఆ కుటుంబానికి ఎంతో రుణపడిపోయానని, నేను నాలాగే ఉంటానని అంటుంది కావేరి. నువ్వు కనిపించకపోయేసరికి నీ కూతురు ఎంతో బాధపడిందని అంటుంది పారు. మరి గుమ్మం దగ్గరే అత్తను పట్టుకుని ఎందుకు ఏడవలేదని కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నా భార్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినందుకు క్షమాపణలు చెప్పమని జ్యోత్స్నపై కోప్పడతాడు శ్రీధర్. కార్తీక్, దీప లేకపోతే ఈ ఇంటి దీపం ఆరిపోయేదని శివన్నారాయణ అంటాడు. ఆ వెంటనే సుమిత్ర - దశరథల పెళ్లి రోజు వేడుకల్ని కార్తీక్ ఘనంగా జరిపిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











