Karthika Deepam 2 Weekly: తల్లిదండ్రులపై జ్యోత్స్న కుట్ర.. కాశీ ఎవరో తెలుసుకున్న కార్తీక్

Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు 469నుంచి 474 ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Karthika deepam 2 Serial Weekly Episodes September 22nd to September 27th Here is Highlights

సెప్టెంబర్ 22వ తేదీ 469వఎపిసోడ్ లో..
దీపా కు క్షమాపణలు చెబుతానని సుమిత్ర అందరిని ఇంటికి రమ్మంటుంది. మన రెండు కుటుంబాలు దగ్గర కావాలంటే నేను తప్పకుండా దీపాకు క్షమాపణలు చెబుతానని అంటుంది. అందుకు కాంచనను కూడా భోజనానికి పిలుస్తుంది. దాంతో అందరూ ఎంతో సంతోషంతో సరేనని అంటారు. ఇక శ్రీధర్ కూడా వస్తానని చెబుతాడు. అయితే జరిగినదానికి సుమిత్ర అక్కడే క్షమాపణలు అడగకుండా ఇంటికి భోజనానికి ఎందుకు పిలిచిందని అందరూ షాక్‌లో ఉంటారు. ఎక్కడైతే తన తాళిని తెంచానో అక్కడే దీపాకు క్షమాపణలు చెబుతానని సుమిత్ర అందరికీ క్లారిటీ ఇస్తుంది. సుమిత్ర ఇంటికి వెళ్లడానికి కార్తీక్ బాబు, కాంచన, దీప, అనసూయ అందరూ సిద్ధమవుతుండగా శ్రీధర్ కూడా వస్తాడు. ఈ రెండు కుటుంబాలే కాదు నేను కూడా ఈ కుటుంబంలో కలవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో కాంచన ఒప్పుకుంటుంది. దాంతో అందరూ కలిసి శివ నారాయణ ఇంటికి వెళ్తారు.

సెప్టెంబర్ 23వ తేదీ 470వ ఎపిసోడ్‌లో..
రెండు కుటుంబాలు ఇంటికి వెళ్లగానే దీపకు సుమిత్ర షాక్ ఇస్తుంది. దశరథ్‌ను కావాలనే తుపాకీతో కాల్చావనే అనే నిజాన్ని అందరి ముందు ఒప్పుకోవాలని సుమిత్ర ఒత్తిడి తెస్తుంది. దాంతో చేయని తప్పుని నీ మీద ఎందుకు వేసుకుంటావని కార్తీక్ మండిపడతాడు. భర్త ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా దీప క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అవుతుంది. రెండు కుటుంబాలు ఒక్కటవుతాయంటే ఏమైనా చేస్తానని అనుకుంటుంది. కానీ కార్తీక్ మాత్రం అస్సలు ఒప్పుకోడు.. అయితే సుమిత్ర మాత్రం తప్పు దీపానే చేసింది కాబట్టే క్షమాపణలకు ఒప్పుకుందని అంటుంది. దీపా తప్పు ఒప్పుకుంటేనే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని, అప్పుడే ఆమెను క్షమిస్తానని చెబుతుంది సుమిత్ర. దీపను క్షమిస్తేనే నా భర్త నాతో మాట్లాడుతానని అన్నాడని అసలు నిజం చెబుతుంది.

సెప్టెంబర్ 24వ తేదీ 471వ ఎపిసోడ్‌లో..
దీపా గన్ లో నుంచి బుల్లెట్ రావడం చూశావా? అంటూ సుమిత్రతో గొడవకు దిగుతాడు. దాంతో జ్యోత్స్న జోక్యం చేసుకుని దీపనే తప్పు చేసింది. ఆ రోజు ఇంట్లో వాళ్లందరూ ఎంత ఆపినా నన్ను షూట్ చేయబోయిందని.. అది మిస్ ఫైర్ అయ్యి మా నాన్నకి బుల్లెట్ తగిలిందని చెబుతుంది. అసలు తప్పులన్నీ మీవైపు పెట్టుకొని నిందలు దీపపైన వేస్తున్నారా? అని కార్తీక్ బాబు ఫైర్ అవుతాడు. కానీ సుమిత్ర స్పందిస్తూ అవునురా మేము తప్పు చేశాం కాబట్టే క్షమాపణలు కోరామని, జ్యోత్స్న చెంప పగలగొట్టానని చెబుతుంది. చేయని తప్పును ఒప్పుకునే ప్రసక్తే లేదని కార్తీక్ బాబు తేల్చిచెబుతాడు. దశరథ కూడా కార్తీక్‌కే సపోర్ట్ చేయడంతో సుమిత్ర రగిలిపోతుంది. దీప తప్పులు ఒప్పుకుంటనే నేను క్షమిస్తాను, రెండు కుటుంబాలు ఒక్కటి అవుతాయని లేదంటే మీరంతా వెళ్లిపోండని తేల్చి చెబుతుంది సుమిత్ర. ఆ మాటలతో కాంచనను, దీపను తీసుకుని కార్తీక్ వెళ్లిపోతాడు. సుమిత్ర మాటలతో దీప వెక్కివెక్కి ఏడుస్తుండగా కార్తీక్ ఆమెను ఓదారుస్తాడు. ఇంతలో శ్రీధర్ కోపంతో ఊగిపోతూ వస్తాడు. రెండు కుటుంబాలు కలిసే అవకాశాన్ని నాశనం చేశావని దీపపై మండిపడతాడు. దాంతో తప్పు చేయకుండా చేయని నేరం తన మీద వేసుకుంటే దీపను సుమిత్ర అత్త క్షమిస్తుందని, కానీ పారు, జ్యోత్స్నలు దీనిని అవకాశం తీసుకుని దీపను జైలుకు పంపుతారని హెచ్చరిస్తాడు కార్తీక్ బాబు.

Karthika deepam 2 Serial Weekly Episodes September 22nd to September 27th Here is Highlights

సెప్టెంబర్ 25వ వ తేదీ 472వ ఎపిసోడ్‌లో..
దీపను అందరిముందు ఇరికించే ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో కొత్త కుట్ర చేస్తుంది జ్యోత్స్న. దశరథ్, సుమిత్ర, శివ నారాయణల ముందు పంచాయతీ పెట్టి పెద్ద గొడవ చేస్తుంది. దీప చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఎందుకు భయపడింది? దీప తప్పును ఒప్పుకోక పోగా అమ్మ సుమిత్ర జీవితాన్ని ఇరకాటంలో పెట్టిందని మండిపడుతుంది. తిరిగి ఈ రెండు కుటుంబాలను కలవకుండా చేసిందని జ్యోత్స్న చెబుతుంది. దాంతో దశరథ్ తన కూతురిపై మండిపడతాడు. చేయని తప్పును ఎలా దీప ఒప్పుకుంటుంది. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటావా? అని జ్యోత్స్నను ప్రశ్నిస్తాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో చెబుతూ.. దీప చేతిలోకి ఆ గన్ ఎలా వచ్చింది? నువ్వు గన్ ఎందుకు బయటికి తీశావ్? దీప నిన్ను చంపేంత తప్పు నువ్వు ఏం చేశావంటూ వరుసగా ప్రశ్నలు సంధించడంతో జ్యోత్స్న ఉక్కిరిబిక్కిరి అవుతుంది. నీ అంత మూర్ఖుడు లేడు నాన్న అని తండ్రిపై నోరు జారుతుంది. దాంతో రగిలిపోయిన సుమిత్ర.. జ్యోత్స్న లాగిపెట్టి కొడుతుంది.

సెప్టెంబర్ 26వ తేదీ 473వ ఎపిసోడ్‌లో..
శౌర్య స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తుండగా కార్తీక్‌కి జ్యోత్స్న ఫోన్ చేసి నాకు చెక్ పంపిస్తున్నావా? క్యాష్ పంపిస్తున్నావా? అని అడుగుతుంది. నీకు నేను ఎందుకని పంపించాలి అని కార్తీక్ ప్రశ్నించగా.. నువ్వు మా ఇంటికి రాకపోతే మన మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 10 కోట్లు కట్టాలని చెబుతుంది జ్యోత్స్న. మేం మీ ఇంటికి రావడం లేదని ఎవరు చెప్పారు.. కాసేపట్లో వస్తున్నామని ఆన్సర్ ఇస్తాడు కార్తీక్. దీపను తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టబోతుండగా శివన్నారాయణ భార్యాభర్తలని అడ్డుకుని తిరిగి వెళ్లిపోమ్మని చెబుతాడు. మీ ఇద్దరి వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని బాధడతాడు. ఎంత చెబుతున్నా కార్తీక్ - దీపలు వినిపించుకోరు. లోపలికి వెళ్లిన వెంటనే ముందు మీ నాన్న కోపం తగ్గించమని దీపకు కార్తీక్ చెబుతాడు. ఇంట్లో జరిగిన గొడవ, కూతురు తనను అవమానించడంతో దశరథ్ కుమిలిపోతుంటాడు. ఇంతలో దీప వెళ్లి కాఫీ ఇవ్వడంతో ఆనందిస్తాడు. సుమిత్ర అమ్మగారిని క్షమించి వదిలేయమని దశరథ్‌కు చెబుతుంది దీప.

సెప్టెంబర్ 27వ తేదీ 474వ ఎపిసోడ్‌లో..
దశరథ్ - దీప మాటలను విన్న సుమిత్ర బాధపడుతూ కిందకి వచ్చేస్తుంది. ఆమె వెనకాలే జ్యోత్స్న కూడా వెళ్లి.. మీ ఇద్దరి మధ్య చిచ్చుపెడుతున్న ఆ దీపను క్షమించి వదిలేస్తావా అని మండిపడుతుంది. దీపను జీవితంలో క్షమించనని, కానీ ఇప్పుడు మీ నాన్నతో ఆమె అన్న మాటల్లో ఎలాంటి తేడా లేదని చెబుతుంది. దీపను ఇరికించడం కుదరకపోవడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. జాబ్ లేకపోవడంతో అత్తారింట్లో కాశీకి అవమానాలు ఎదురవుతుంటాయి. దాంతో అల్లుడిగారి మర్యాదల్లో ఎలాంటి తేడాలు లేకుండా చూడమని కావేరిపై కోప్పడతాడు శ్రీధర్. నీ మనవడికి జాబ్ ఇప్పించాలని అనుకుంటున్నానని పారుతో కాశీ గురించి చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు చాలా సంతోషిస్తుంది. వాడు నీ సొంత తమ్ముడు.. కాస్త గౌరవించడం నేర్చుకోమ్మని చెబుతుంది పారు. ఇంతలో ఆ మాటలు విన్న కార్తీక్.. కాశీ నీ సొంత తమ్ముడా అని జ్యోత్స్నను అడుగుతాడు. ఆమె ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X