‘వాళ్లకి అన్ని విప్పి చూపిస్తేనే ఆఫర్లు.. బిగ్‌బాస్‌తో నా జీవితం మారలేదు’

ఇండియన్ రియాలిటీ షోలలో టాప్ రేంజ్‌లో ఉన్న షో అంటే ఖచ్చితంగా వినిపించే పేరు బిగ్‌బాస్. నాలుగు గోడల మధ్య, ఓ 15 మంది మధ్యలో మనిషిని ఉంచి 105 రోజుల పాటు అతని బిహేవియర్ గమనిస్తూ, అతని ఎమోషన్స్‌ని క్యాప్చర్ చేయడమే బిగ్‌బాస్ కాన్సెప్ట్. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశంలోని ప్రధాన ప్రాంతీయ భాషలకు విస్తరించి ప్రజల ఆదరణను దక్కించుకుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారు నటులుగా, సెలబ్రెటీలుగా స్టార్‌డమ్ అనుభవిస్తున్నారు. అయితే బిగ్‌బాస్‌లో పాల్గొనడం వల్ల తనకు ఎలాంటి లాభం కలగలేదని, జీవితంలో ఏ మార్పు లేదని వాపోయారు బిగ్‌బాస్ కీర్తి భట్. ఈ వివరాల్లోకి వెళితే..

కార్తీక దీపంతో బ్రేక్
కర్ణాటకకు చెందిన కీర్తి భట్‌కు చిన్నప్పటి నుంచి నటన, సినిమాలంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే యాక్టింగ్‌, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్న ఆమె చదువు తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్‌కు సినీ పరిశ్రమ నుంచి కూడా ఆఫర్లు క్యూకట్టాయి. మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగువారిని పలకరించిన కీర్తి భట్ కెరీర్‌ను స్టార్ మాలో వచ్చిన కార్తీక దీపం మలుపు తిప్పింది. ఇందులో కార్తీక్ బాబు, దీపల కుమార్తె హిమ క్యారెక్టర్‌లో కీర్తి భట్ నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు.

Karthika Deepam Fame Keerthi Bhat made sensational comments on Bigg Boss Show

రోడ్డు ప్రమాదంలో కుటుంబం దూరం
సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆమె జీవితాన్ని ఓ రోడ్డు ప్రమాదం తలక్రిందులు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కీర్తి భట్ తన అన్నయ్య, వదిన, తల్లిదండ్రులను కోల్పోయింది. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. రెప్పపాటులో జరిగిన ఘటనతో అనాథగా మారిన కీర్తి ప్రస్తుతం ఓ పాపని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగు బిగ్‌బాస్‌లో అవకాశం దక్కింది. తన వ్యక్తిత్వం, మైండ్‌గేమ్‌తో దాదాపు 14 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది.

బాయ్‌ఫ్రెండ్‌తో అలా
కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిన కీర్తి భట్.. విజయ్ కార్తీక్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో అతనితో నిశ్చితార్ధం చేసుకుని తన జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలని అనుకుంది. అమ్మాయిలకు పిల్లలు పుట్టరంటే వారిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరని, కానీ విజయ్ మాత్రం తన అనారోగ్యం గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని కీర్తి భట్ తెలిపింది. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

బిగ్‌బాస్‌తో నో యూజ్
బిగ్‌బాస్‌‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న చాలా మందికి తెలుగు బుల్లితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయని కానీ తనను మాత్రం దూరం పెట్టారని కీర్తి భట్ వాపోయింది. బుల్లితెరపై అవకాశాలు రావాలంటే గ్లామర్ షో చేయాలని, పొట్టి బట్టలు వేసుకోవాలని చెప్పేవారని దానికి తాను నో చెప్పడంతోనే ఏ షోకు కూడా అవకాశం ఇవ్వరని కీర్తి భట్ పేర్కొంది. అంతేకాదు.. షోలలో చలాకీగా మాట్లాడలేనని ఇది కూడా తనకు అవకాశాలు దక్కకపోవడానికి కారణమేనని చెప్పింది. ఇక బిగ్‌బాస్ షో గురించి కీర్తిభట్ మాట్లాడుతూ.. ఆ షో కారణంగా తన జీవితానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని, బిగ్‌బాస్ వల్ల జనంలో పాపులారిటీ వచ్చిందని.. అంతేకానీ నా జీవితంలో పెనుమార్పులు సంభవించలేదని స్పష్టం చేసింది. టాప్ 5, టాప్ 10లో నిలిచిన వారికి మాత్రమే బుల్లితెరపై ఏదో ఒకటి చేస్తున్నారని.. ఎవ్వరూ ఖాళీగా లేరని కీర్తి భట్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బిగ్‌బాస్ షోపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X