Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam దీప బతకాలంటే.. నేను చావాలి.. సౌందర్యకు మోనిత బంపర్ ఆఫర్
కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్న కార్తీక్, దీప ఇద్దరు తన తల్లిదండ్రులను కలిశారు. ప్రమాదంలో చనిపోయారని అనుకొన్న కార్తీక్, దీప రావడంతో భాగ్యం, ఆమె భర్త ఆనందపడిపోయారు. కూతురు, అల్లుడు వచ్చిన సంతోషంలో పాయసం చేసి ఆనందంలో మునిగిపోయారు. నీ పెళ్లి జరిగిన తర్వాత తొలి సంక్రాంతిని బాగా జరుపుకొన్నాం దీపకు భాగ్యం గుర్తు చేయగా.. అవును.. అది నా తొలి సంక్రాంతి.. ఇది నా చివరి సంక్రాంతి అని అనగానే తండ్రి షాక్ తిన్నాడు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటే.. అదే సంక్రాంతి చివరి రోజున వచ్చాం అని చెప్పబోయి.. చివరి సంక్రాంతి అని అన్నది అని కార్తీక్ కవరింగ్ ఇచ్చాడు. ఇంకా కార్తీకదీపం సీరియల్ 1564 ఎపిసోడ్‌లో ఏం జరిగిదంటే?
మోనిత ఇచ్చిన దీప మెడికల్ రిపోర్టులను వేరే డాక్టర్‌కు పంపించిన సౌందర్య అతడికి ఫోన్ చేసి పరిస్థితి ఏమిటి అని అడిగింది. అయితే పేషంట్ బతకడం కష్టం. బతకాలంటే.. ఒకటే మార్గం.. గుండె మార్పిడి అని చెప్పాడు. దాంతో కిడ్నీ అయితే ఒకటి ఇచ్చి కాపాడుకోవచ్చు. గుండె అంటే ఎవరిస్తారు చెప్పండి అంటూ డాక్టర్‌తో సౌందర్య ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మోనిత వచ్చి ఫోన్ లాగేసుకొంది. ఎవరికో ఫోన్ చేసి బాధపడేది ఎందుకు? నేను ఉన్నాను. దీప బతకాలంటే.. నేను చావాలి. దీపను బతికించడానికి నేను రెడీగా ఉన్నాను. నేను చనిపోయి దీపకు గుండె ఇస్తాను. కానీ ఒక షరతు అని మోనిత అంది.

అయితే చెప్పు ఇలాంటి ప్రపోజల్‌తో వచ్చావంటే.. ఏదో మతలబు ఉంటుందని అనుకొన్నాను. నీ ప్రపొజల్ ఏమిటో చెప్పు అని సౌందర్య అంటే.. చనిపోయే వారి చివరి కోరిక ఒకటి ఉంటుంది. నా చివరి కోరిక.. కార్తీక్‌ను పెళ్లి చేసుకొని ఒక్కరోజైనా భార్యగా ఉండాలన్నదే నా కోరిక అని మోనిత అనగానే.. సౌందర్య మెడపెట్టి ఇంటి నుంచి బయటకు నెట్టేయబోయింది. అయితే ఈ ఆఫర్ ఎక్కువ కాలం ఉండదు. రేపే నా నిర్ణయం మారవచ్చు. కాబట్టి త్వరగా నిర్ణయించుకోండి. ఆఫర్ ఎండ్స్ సూన్ అంటూ మోనిత వెళ్లిపోయింది.

దీప ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్న సౌందర్య నేరుగా కార్తీక్ వద్దకు వెళ్లింది. పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంది. కొంచెం అర్జెంట్ అంటూ డాక్టర్‌తో మాట్లాడుతుంటే.. ఏంట్రా.. ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావు అంటే.. ఎవరో పేషెంట్.. సీరియస్‌గా ఉంది అని కార్తీక్ చెప్పబోతే.. ఆపు నీ నాటకాలు.. అంటూ దీప రిపోర్టులు చేతిలో పెట్టగానే కార్తీక్ షాక్ తిన్నాడు. వెంటనే అది కాదు అంటూ ఏదో చెప్పబోయి.. మీకు ఈ రిపోర్టులు ఎవరిచ్చారు అని కార్తీక్ అడిగితే.. మోనిత అని.. మొత్తం విషయం చెప్పింది. అయితే మోనిత మళ్లీ నాటకాలు మొదలుపెట్టిందా? అని కార్తీక్ ఫైర్ అయ్యాడు. అయితే దీప విషయం నీకు తెలిసినట్టు బయటపెట్టకు అని తల్లికి కార్తీక్ చెప్పాడు.
అంతలోనే దీప, హిమ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే.. ఏంటి దీప.. ఇప్పుడు డ్యాన్సులు ఏమిటి అంటే.. డ్యాన్సులు చేస్తే తప్పేంటి? అని హిమ అడిగింది. అయితే వెంటనే మాట మార్చి.. అలిసిపోతుంది. అన్నం తినాలి కదా.. అలిసిపోతే అన్నం తినలేదు అని సౌందర్య అంది. అయితే సౌందర్య మాట తీరులో అనుమానం రావడంతో కార్తీక్‌ను నిలదీసింది. అయితే నీ విషయం అమ్మకు తెలియదు అని కార్తీక్ అబద్దం ఆడి ఆ మ్యాటర్ అంతటితో ఆపేశాడు.
అయితే తల్లి, తండ్రి గుసగుసలాడుకోవడం చూసి. మోనితకు హిమ నేరుగా ఫోన్ చేసింది. మా అమ్మ, నాన్నలు అనుమానంగా మాట్లాడుకొంటున్నారు. మీకు ఏమైనా తెలుసా? అని అడిగితే.. నీకు ఎందుకులే. చిన్న పిల్లవు. నీకు చెప్పకూడదు అంటూ మోనిత డ్రామాలు ఆడింది. కార్తీక్ ఇంట్లో చిచ్చు పెట్టడానికి నాకు ఒక మనిషి దొరికాడు అంటూ మోనిత సంబరపడిపోయింది.