For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam May 21st Episode: నా భర్త దృష్టిలో పతితనే.. పవిత్రత రుజువు చేసుకోకుండానే మరణిస్తానా?

  |

  తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్‌లో అత్త సౌందర్య, కోడలు దీప మధ్య భావోద్వేగాలు ఓ రేంజ్‌లో బయటకు వచ్చాయి. ఒకరి కోసం మరొకరు తమ ఆవేదనను వ్యక్తం చేసుకొన్నారు. నీ కోసం మేమున్నామంటూ సౌందర్య చెప్పగానే.. ఇక ఎంతో కాలం బతకనని చెప్పి అత్తకు దీప షాకిచ్చింది. నీ అనారోగ్యం విషయం నీకూ తెలిసిందా అంటూ సౌందర్య కంగారుపడిపోయింది. దీప, సౌందర్య మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ల మీ కోసం..

  హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

   నిన్ను నిలదీయడానికే వచ్చా అంటూ సౌందర్య

  నిన్ను నిలదీయడానికే వచ్చా అంటూ సౌందర్య

  దీపతో సౌందర్య మాట్లాడుతూ.. మీ ఇద్దరి మధ్య దూరం తరిగిపోవాలని దూరంగా వెళ్లిపోయాం. నేను అటు వెళ్లగానే నీవు ఇక్కడి వచ్చాం. అసలు నీ ఉద్దేశం ఏమిటి?.. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. నిన్ను నిలదీయడానికి వచ్చాను. అసలు వాడు నచ్చడం లేదా? లేక మేము నచ్చడం లేదా? అంటూ అత్త సౌందర్య గట్టిగా క్లాస్ పీకింది. మీరు ఏం అడుగుతున్నారు అత్తయ్య అని దీప అంటే.. చెప్పిన మాట వినడం లేదని వాడు కొప్పడితే అలిగి ఇంట్లో నుంచి వచ్చేస్తావా? నువ్వింకా చిన్నపిల్లవే అని అనుకొంటున్నావా? ఏంటీ నీ ఉద్దేశం అంటూ సౌందర్య గట్టిగా మందలించింది.

   దేవుడి నిర్ణయం అంటూ దీప

  దేవుడి నిర్ణయం అంటూ దీప

  అత్త మాటలపై దీప స్పందిస్తూ.. . ఇది దేవుడి నిర్ణయం.. నీవు నిర్ణయం తీసుకోని దేవుడిపై నెట్టేస్తున్నావు. నీవు ఊరెళ్లిపోతే నేను అడిగితే వాడు వెతుక్కొంటూ వెళ్లి నిన్ను తీసుకొచ్చాడు. అందరం కలిసి ఉందామనుకొంటే.. ఉన్న నాలుగు రోజులు అపార్థాలు, కన్నీళ్లతోనే సరిపోయింది. అటు వాడు చెప్పింది వినలేక.. మేము సర్ది చెప్పలేక.. మీ ఇద్దరు నొచ్చుకొంటారని మేము వెళ్లిపోతే మీ ఇద్దరు తీసుకొన్న నిర్ణయం ఇదా అంటూ సౌందర్య ప్రశ్నించింది.

  కార్తీక్ నీకు అక్కర్లేదా?

  కార్తీక్ నీకు అక్కర్లేదా?

  దీప తీసుకొన్న నిర్ణయంపై సౌందర్య ప్రశ్నిస్తూ.. నీ నిర్ణయంలో అర్ధమేమిటి దీప.. వాడు ఎప్పటికి నీకు అక్కర్లేదా? అన్నారు. దాంతో నా జీవితంలో ఆఖరి క్షణం వరకు కార్తీక్ వద్దని చెప్పదు అంటూ దీప కన్నీరుపెట్టుకొన్నది. అయితే ఇంటి నుంచి ఎందుకు వచ్చావు అని అత్త ప్రశ్నిస్తే.. నాకు సెల్ఫ్ రెస్పక్ట్ కోసం ఇంటి నుంచి వచ్చాను. నేను పోయే వరకు పోదు అని దీప అంటే.. సెల్ఫ్ రెస్పక్ట్ నీ కాపురాన్ని నిలబెట్టదు అంటూ సౌందర్య గట్టిగా మందలించింది. అందుకే మా మధ్య దూరం తరగదు. మీరు మా మధ్య దూరం తరిగిపోవాలని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ సౌందర్య మందలించింది.

  కొడుకు, కోడలికి మధ్య నలిగిపోవాల్సిన

  కొడుకు, కోడలికి మధ్య నలిగిపోవాల్సిన

  నా జీవితం విషయంలో మీరు ఎలాంటి కంగారు పడొద్దనే విధంగా దీప మాట్లాడుతూ.. ఇక ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని నిర్ణయించుకొన్నాను. కొడుకు, కోడలికి మధ్య నలిగిపోవాల్సిన అవసరం లేదు. పిల్లల కోసం డాక్టర్ బాబు నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఉన్నంతకాలం నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నా జీవితం గురించి అంతా ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటూ దీప అనగానే.. ఏం తెలుస్తుంది అంటూ సౌందర్య కంగారుపడిపోయింది.

  నీలాంటి పుణ్య స్త్రీ దీవిస్తే

  నీలాంటి పుణ్య స్త్రీ దీవిస్తే

  దాంతో నీలాంటి పుణ్య స్త్రీ దీవిస్తే.. నా దీవెన ఫలిస్తుంది. దేవత లాంటి మీరు నన్ను.. నిండు నూరేళ్లు ఆయుష్షు ఉండాలని దీవించండి అంటూ అత్త కాళ్లపై పడింది. నేను ఎంతోకాలం బతకనని తెలిసిపోయింది అత్తయ్య అంటూ దీప భోరున విలపించింది. నీతో చెప్పనని చెప్పి వాడే చెప్పేవాడా? నాకు ముందే తెలుసు.. శ్రీరామనవమి రోజు నీవు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కార్తీక్ నాకు అంతా చెప్పాడు అంటూ సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది.

  కోట్లు వెదజల్లైనా రక్షించుకొంటాం..

  కోట్లు వెదజల్లైనా రక్షించుకొంటాం..

  దీపకు సౌందర్య క్లాస్ పీకుతూ.. నీ జీవితం గురించి మాకు పట్టింపు లేదనుకొంటున్నావా? ఊరు దాటితే వెంటపడి లాక్కొచ్చాం. అలా నిన్ను దూరం చేసుకొంటామని ఎందుకు అనుకొంటున్నావు. కోట్లు వెదజల్లైనా నిన్ను బతికించుకొంటాం. నా కొడుకు గురించి నీకు తెలియదు. నిన్ను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వాడిని అపార్థం చేసుకొంటూ నీవు దూరం చేసుకొంటున్నావు. నిన్ను చేసుకొని వాడు డాక్టర్ బాబు అయ్యాడేమో.. కానీ నిన్ను రక్షించుకోవడానికి వాడు డాక్టర్ అయ్యాడనిపిస్తుంది. ఏ వ్యాధి కబలిస్తుందో తెలుసుకొన్నవాడు.. ఏ వైద్యం నిన్ను కాపాడుతుందో తెలుసుకోలేడా? నీ ప్రాణాలు నిలబెట్టడానికి మంచి వైద్యం అందిస్తాడు. నీవు దిగులుపడకు అంటూ సౌందర్య తనకు ధైర్యం చెప్పింది.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  నా పిల్లల భవిష్యత్తు ఏమిటి?

  నా పిల్లల భవిష్యత్తు ఏమిటి?

  అత్త సౌందర్యతో దీప మాట్లాడుతూ... నాకు ఏదైనా నా పిల్లలు ఏమౌపోతారు అత్తయ్యా అంటూ దీప రోదించింది. దాంతో నీకు ఏమైనా పిచ్చిపట్టిందా? నీకు ఏమి కాదు అంటూ సౌందర్య సర్దిచెప్పింది. అయితే ఆయన నాకు వైద్యం చేయిస్తారు. కానీ నేను బతకాలి కదా.. ఒకవేళ నేను పోతే.. నా భర్త దృష్టిలో బతికినంత కాలం పతితగానే బతికాను. నా పవిత్రత రుజువు చేసుకోకుండానే చనిపోతానా అంటూ సౌందర్య భోరుమన్నది. నా భర్త దృష్టిలో బతికనంత కాలం పతితగానే బతికాను అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది.

  English summary
  Karthika Deepam May 21st Episode: Aunt Soundarya took the Emotional class to Deepa
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X