For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam May 22nd Episode: నా కోడల్ని బతికించండి.. హిమ, శౌర్యను కంటతడి పెట్టించిన సౌందర్య!

  |

  తన తల్లితోపాటే శ్రీరాంనగర్ బస్తీలో ఉండిపోతే.. విలాసాలకు తావు ఉండదంటూ హిమ, శౌర్య మాట్లాడిన తీరుపై నానమ్మ సౌందర్య ఎమోషనల్ అయ్యారు. మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతామా అంటూ ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. నా కొడుకును అపార్థం చేసుకోవద్దంటూ సౌందర్య పిల్లలకు చెప్పింది. కొడుకు కార్తీక్ బాబు, కోడలు దీప గురించి మంచి మాటలు చెబుతూ..

  నా కొడుకును ఎందుకు అపార్థం

  నా కొడుకును ఎందుకు అపార్థం

  మీ నాన్న గురించి ఏమనుకొంటున్నారు? మిమల్ని ఇక్కడ వదిలేసి పోవడానికేనా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎందుకే నా కొడుకును అపార్థం చేసుకొంటున్నారు అని సౌందర్య అంటే.. అదేమీ లేదు నానమ్మ... నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంటూ శౌర్య, హిమ క్లారిటీ ఇచ్చారు. అమ్మ ఇక్కడే ఉంటారని, అమ్మతోపాటే మేము ఇక్కడే ఉండాల్సి వస్తుందని మేము అన్నాం. అంతేగానీ మాకు మరో ఉద్దేశం లేదు.. సారీ అంటూ నానమ్మ సౌందర్యకు వివరించారు.

   మీ నాన్నే బోలెడంత సంపాదించారు..

  మీ నాన్నే బోలెడంత సంపాదించారు..

  ఇది మీ ఇల్లు కాదు. అదే మీ ఇల్లు.. మీరు, మీకు పుట్టబోయే బిడ్డలు కూర్చొన్న.. తరగని ఆస్తి మనకు ఉంది. మీ నాన్నే బోలెడంత సంపాదించారు. ఆ ఆస్తి అంతా మీతోపాటు మీ అమ్మకు చెందుతుంది. నేను, మీ తాతయ్య సంపాదించిన ఆస్తి అంతా మీ ఇద్దరికి, దీపుకు చెందుతుంది. ఆస్తి కోసం గొడవపడే వాళ్లు మన కుటుంబంలో లేరు. అంతా ఒకే కుటుంబం. మీరు ఎలాంటి అపార్థాలు, అపోహలు పెట్టుకోవద్దు. మిమ్మల్ని, మీ అమ్మను మీ నాన్న వదిలేసి వెళ్తాడని అనుకోవద్దు అంటూ హిమ, శౌర్యకు సౌందర్య క్లారిటీ ఇచ్చింది.

   మీ నాన్న మచ్చలేని చంద్రుడు

  మీ నాన్న మచ్చలేని చంద్రుడు

  మీ అమ్మతో మీ నాన్న ఎలా ఉంటున్నాడు? ప్రేమతో మాట్లాడుతున్నాడా అంటూ సౌందర్య ఆరా తీసింది. అయితే అమ్మతో నాన్న సరిగా మాట్లాడటం లేదు. మాతో మాట్లాడినట్టుగా కూడా మాట్లాడటం లేదు అని శౌర్య అంటే.. శ్రావ్య పిన్ని, బాబాయ్ మాట్లాడుకొనే విధంగా మాట్లాడుకోవడం లేదు. ఎందుకు నానమ్మ అంటూ హిమ ప్రశ్నించింది. వాళ్ల మధ్య చిన్న కాలుష్యం ఉందని డాక్టర్ బాబు చెప్పిన కథ గుర్తు చేసింది. మీ నాన్న మచ్చ లేని చంద్రుడు. దేవతలు అనుగ్రహించి కాలుష్యాన్ని విడగొడితే.. మీ అమ్మ, నాన్న ఏకం అవుతారు. వారి మధ్య ఉండే కాలుష్యం తొలిగిపోతుంది అని సౌందర్య వివరించింది.

  నిలువెత్తు సంస్కారానికి ...

  నిలువెత్తు సంస్కారానికి ...

  మీ నాన్న చాలా మంచివాడు. నేను బిడ్డ కావాలంటే.. నేనే బిడ్డగా పుడుతానంటూ దేవుడిలాంటి బిడ్డ నా కడుపులో పుట్టాడు. మీ నాన్న మనుషుల్ని ప్రేమిస్తాడు. పేదలంటే జాలి చూపిస్తాడు. అనాథలను ఆదుకొంటాడు. రోగుల పట్ల దయగా ఉంటాడు. నిలువెత్తు సంస్కారంతో ఎంతో ఎత్తులో కనిపిస్తాడు నా కొడుకు. మీ అమ్మను దేవతలాగా, మీ తాతను దేవుడిలా చూస్తాడు. మీ అమ్మ కూడా అంతే.. భూదేవి అంత సహనంతో ఉంటుంది. అత్తను, మామను తల్లిదండ్రులుగా చూసుకొంటుంది. మరిదిని కొడుకులా చూసుకొంటుంది. అందుకే మాకు మీ అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మ అంటే మీ నాన్నకు ఇష్టం అది మీకు తెలియదు అంటూ సౌందర్య తెలిపింది.

  మా ఆస్తి అంతా అమ్మీ మీ అమ్మ కోసం..

  మా ఆస్తి అంతా అమ్మీ మీ అమ్మ కోసం..

  మీ అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. మీ అమ్మ అంటే నాకు మొదట్లో కోపం ఉండేది. కానీ నా వల్ల మీ అమ్మ బాధపడలేదు. ఓర్పుగా సర్దుకుపోయింది. ఆ ఓర్పే నాలో మార్పు తెచ్చింది. మీ అమ్మేంటో అర్ధమైంది. మీ అమ్మకు నేను అమ్మనయ్యాను అంటూ సౌందర్య చెప్పగానే హిమ, శౌర్య భావోద్వేగానికి గురయ్యారు. దాంతో మీ కోసం మా ఆస్తి అంతా అమ్మి.. మీ అమ్మ అంటూ అసలు విషయం చెప్పబోయి సౌందర్య ఆగిపోయింది. దాంతో ఏదో చెప్పబోయారంటూ అడిగితే ఆ ప్రశ్నను దాటవేసింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
   కోటి దేవుళ్లకు మొక్కుతూ...

  కోటి దేవుళ్లకు మొక్కుతూ...

  నా కోడల్ని బతికించండి. పతితలాగే చనిపోతానని బాధపడుతున్న నా కోడలి నిందను చెరిపేయండి. వాళ్లిద్దరి మధ్య ఉన్న కాలుష్యాన్ని రూపుమాపి ఆ జంటను పచ్చగా ఉండేలా చూడండి. వాళ్లను నిండుగా ఆశీర్వదించండి అంటూ సౌందర్య ఆవేదన చెందుతూ తన మనసులోనే కోటి దేవుళ్లకు మొక్కుకున్నది. ఈ సందర్భంగా ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు హిమ, శౌర్య మీద పడటంతో వారు ఎమోషనల్ అయ్యారు.

  English summary
  Karthika Deepam May 22nd Episode: Soundarya emotional with Shourya, Hima
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X