twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ప్రియమణిని కడిగిపడేసిన మోనిత.. కార్తీక్‌ను ఓ రేంజ్‌లో బ్లాక్‌మెయిల్ చేస్తూ..

    |

    కార్తీకదీపం సీరియల్‌‌లో మోనిత వ్యవహారం సాగదీసినట్టు కొనసాగుతున్నది. కార్తీక్ కుటుంబంలో ఇప్పటికే పలు రకాల చిచ్చు పెట్టిన డాక్టర్ మోనిత మరో పథకాన్ని రచించింది. దీపావళీ పండుగ సమయంలో కార్తీక్‌ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. అయితే మోనిత ఆహ్వానాన్ని కార్తీక్ పూర్తిగా తోసిపుచ్చాడు. దాంతో తానే నీ ఇంటికి వస్తున్నానంటూ మోనిత బెదిరింపులకు పాల్పడింది. దాంతో కార్తీక్ కంగారు పడిపోయాడు. తాజా ఎపిసోడ్ 1200‌లో కార్తీక్, మోనిత మధ్య ఏం జరిగిందంటే...

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    ప్రియమణితో మోనిత

    ప్రియమణితో మోనిత

    దీపావళీ పండుగను పురస్కరించుకొని తన ఇంటిని మోనిత అందంగా ముస్తాబు చేసుకొన్నది. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కార్తీక్‌తో కలిసి ఎప్పుడు జరుపుకొంటానో అంటూ మోనిత తనలో తాను అనుకొన్నది. అంతలోనే ప్రియమణిని పిలిచి... తన కుమారుడు ఆనందరావును జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పింది. దాంతో అమ్మా బయటకు వెళ్తున్నారా? అని ప్రియమణి అడిగింది.. ఇక దీపనో.. నేనో కార్తీక్తో తేల్చుకొని వస్తాను అంటూ మోనిత చెప్పడంతో ప్రియమణి అదోలా చూసింది.

    విలన్‌లా ఎందుకు చూస్తున్నావు?

    విలన్‌లా ఎందుకు చూస్తున్నావు?

    ప్రియమణి అదోలా చూడటంతో ఏంటి నీవు ఎప్పుడు అదో మాదిరిగా చూస్తావు. నన్ను ఓ విలన్‌ను చూసినట్టు చూస్తావు అని మోనిత నిలదీసింది. దాంతో నేను అలా ఎందుకు చూస్తానమ్మా అంటూ ప్రియమణి సమాధానం ఇచ్చింది. దాంతో నీవు బతక నేర్చిన దానివి. నేను గొప్ప ప్రేమికురాలిని. ఆ విషయాన్ని కార్తీక్ అర్ధం చేసుకోవడం లేదు. ప్రపంచం కూడా అర్ధం చేసుకోవడం లేదు. నేను ఏం చేయాలి. 11 ఏళ్లు దీప దూరమైనప్పుడు కార్తీక్ నా ఇంటికి వచ్చి బాధను పంచుకొనే వాడు. నా భుజం మీద తలవాల్చి ఏడ్చేవాడు. కానీ ఇప్పుడు దీప నామస్మరణ చేస్తున్నాడు. కార్తీక్ చేసేది తప్పా? కాదా అంటే.. ప్రియమణి తప్పే అని సమాధానం చెప్పింది. దాంతో తప్పు కాదు.. తప్పున్నర తప్పు అంటూ మోనిత ఆవేశపడిపోయింది.

    కార్తీక్ అమాయకుడు.. మంచివాడు.. అంటూ..

    కార్తీక్ అమాయకుడు.. మంచివాడు.. అంటూ..

    కార్తీక్ అమాయకుడు. మంచివాడు. కానీ పెద్దోడా అనగానే.. ఆయన కరిగిపోతాడు. వంటలక్కతో కలిసిపోయాడు. కార్తీక్ ఏం చెప్పినా నమ్మేస్తాడు. ఆ మంచితనమే ఒక్కోసారి ప్లస్ అయింది. చాలా సార్లు మైనస్ అవుతున్నది. అలాంటి అమాయకత్వంతోనే దీప మాయలో పడ్డాడు. దీప మాయలో నుంచి బయటకు లాగుతా. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడు. వేరే ఫోన్‌ నంబర్‌తో చేయాల్సి వస్తుంది. ఇక తాడోపేడో తేల్చుకొంటాను. ఆదిత్యకు అసలు విషయం చెప్పి ఇంటిలో అగ్గిరాజేశాను. పండగకు విషెస్ లేవు. స్వీట్ బాక్స్ లేదు. దీప కోసమే బతుకుతున్నాడు. నేను ఏమై పోవాలి. అందరూ దీపాలు వెలిగిస్తే.. దీపావళీ రోజు దీపను ఆర్పేస్తాను అని మోనిత ఆవేశంగా చెప్పింది.

    ప్రియమణి కంగారు పడుతూ..

    ప్రియమణి కంగారు పడుతూ..


    మోనిత ఆవేశం చూసి ప్రియమణి కంగారు పడింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని ప్రియమణి అంటే.. సినిమా అంతా చూసి హీరో ఎవరని అడిగినట్టు ఉంది. కార్తీక్ వద్దకు వెళ్తాను. నీవు ఆనందరావు గారిని చూసుకో. నేను ఆనందరావు డాడీ కార్తీక్ సంగతి తేల్చుకొంటాను అంటూ కార్తీక్ వద్దకు బయలు దేరింది. కార్తీక్ ఇంటి వద్దకు చేరుకున్న మోనిత.. మళ్లీ వేరే నంబర్‌ నుంచి కాల్ చేసి డాక్టర్ కార్తీక్ గారేనే? అంటే ఎవరు మీరు అని కార్తీక్ సమాధానం ఇచ్చారు. అందుకు సమాధానంగా నేను డాక్టర్‌నే.. డాక్టర్ మోనిత కార్తీక్ అంటూ ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో షటప్ అంటూ గట్టిగా అరిచాడు.

     మోనిత నాటకాలాడుతున్నావా?

    మోనిత నాటకాలాడుతున్నావా?

    అయితే నీ వీధి చివర ఉన్నాను.. నీన్ను చూడాలని ఉంది అని మోనిత చెప్పింది. మోనిత నాటకలాడుతున్నావా? నేను రానంటే ఏం చేస్తావు అని కార్తీక్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దాంతో నీవు వస్తావా? లేదా నీ ఇంటికి నేను రావాలా అని బ్లాక్ మెయిల్ చేసింది. ఇక చేసేది ఏమీలేక.. నేను వెళ్తాను. అక్కడి వెళ్లి నాలుగు దులిపేసి వస్తాను అంటూ కార్తీక్ బయలు దేరాడు. అయితే దీప అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావు? అని అడిగింది. దాంతో ఎక్కడికి లేదు అంటే.. దీపావళీ రోజు పటాసులు పేలుస్తారు.. జోకులు కాదు. ఈ రోజు అంతటా దీపాలు వెలుగుతుంటే... నీ ముఖంలో చీకట్లు అంటూ దీప సెటైర్లు వేసింది.

     మోనిత రాకపోతే ఏం చేస్తావు అంటూ..

    మోనిత రాకపోతే ఏం చేస్తావు అంటూ..

    దీపకు ఏదో సర్దిచెప్పి మోనిత వద్దకు వెళ్లాడు. మోనితను చూస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నేను రాకపోతే నీవు వస్తానని చెబితే బయపడుతానని అనుకొంటున్నావా? అని కార్తీక్ అంటే.. హ్యాపీ దీపావళీ.. స్వీట్లు తీసుకురాలేదా? అని మోనిత అంటే.. షటప్ అని అన్నాడు. మా అమ్మ పెట్టమంటే సంతకం పెట్టాను అని కార్తీక్ అంటే.. పిల్లాడిని కనడం సంగతి ఏంటి అని మోనిత చెప్పింది. దాంతో షటప్ అని అరిచాడు. అయితే కార్తీక్ బెదరకపోవడంతో ఒక్క ఫోన్ చేస్తే నీ సంగతి ఏమిటో తెల్చిపడేస్తాను.. అంటూ ఫోన్ చేసి మై టీమ్ అంటూ కాల్ చేసింది. ఆ తర్వాత కొందరు బైక్‌లపై వచ్చి మీ ఫ్యాన్స్ అంటూ సెల్ఫీ దిగుతామని పట్టుబట్టారు. అయితే వారిని తిట్టి బయలుదేరారు. దాంతో హ్యాపీ దీపావళి అంటూ మోనిత అరిచింది.

    45వ వారం కార్తీక్ దీపం రేటింగ్

    45వ వారం కార్తీక్ దీపం రేటింగ్

    ఇదిలా ఉండగా, కార్తీకదీపం బుల్లితెరపై టాప్ రేటింగ్‌‌తో దూసుకెళ్తున్నది. 44వ వారంలో కార్తీకదీపం సీరియల్.. అర్బన్ ప్రాంతంలో 13.64 రేటింగ్ సొంతం చేసుకొగా, తాజాగా 45 వారంలో 14.13 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 44వ వారంలో 14.99 రేటింగ్ సొంతం చేసుకొగా.. 45 వారంలో 15.71 రేటింగ్‌ను సాధించింది.

    English summary
    Karthika Deepam November 18th Episode number 1200:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X