For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam episode 1108: మాట విన్నాడో సరే.. లేదంటే తూటాకు ప్రాణాలు బలి.. ఉన్మాదిలా మోనిత

  |

  కార్తీకదీపం సీరియల్‌‌లో మోనిత పెళ్లి విషయంలో కారు డ్రైవర్ అంజి పాత్ర కీలకంగా మారడంతో అతడి చుట్టే కథ తిరుగుతున్నది. సూర్యాపేటలో అంజి ఉన్నారని తెలుసుకొన్న దీప, మోనిత అతడి వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే కార్తీక్‌కు ఈ విషయం చెప్పకుండా దీప అబద్దం చెప్పి సూర్యాపేటకు బయలు దేరింది. అయితే భాగ్యం ఫోన్ కాల్‌తో దీప అబద్దం ఆడిందనే విషయం కార్తీక్‌కు తెలిసిపోయింది. అయితే దీప ఒంటరిగా ఏం చేస్తుందనే విషయం కార్తీక్‌ను కంగారు పెట్టింది. సూర్యాపేటకు వెళ్లే దారిలో మోనిత కారు చెడిపోవడంతో దీప, ఆమె ఇద్దరు కలుసుకొనే సీన్ క్రియేట్ అయింది. ఇంకా 1108 ఏపిసోడ్‌లో ఏం జరిగిందంటే....

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  పిస్టల్ తీసిన మోనిత

  పిస్టల్ తీసిన మోనిత

  సూర్యాపేటకు బయలుదేరిన డాక్టర్ మోనిత ఆనందంలో కనిపించింది. కారును డ్రైవ్ చేసుకొంటూ మనసులోనే మాట్లాడుకొంటూ.. చేజారి పోయాడనుకొన్న అంజిగాడు దొరికాడు. వాడిని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. కార్తీక్ మూడు మూళ్లు వేయగానే.. దీపతో సహా ఎవరూ ఏమీ చేయలేరు. ఒకవేళ అంజిగాడు తోక జాడించారంటే..ఇది ఉందిగా అంటూ పిస్టల్ తీసింది. వాడు నామాట విన్నాడంటే ఉంటాడు. లేకపోతే తూటా దెబ్బ తగిలిపోతాడు అంటూ ఆనందంలో మునిగిపోయింది. ఆ తర్వాత జల్సా సినిమా పాట పెట్టుకొని హుషారుగా కారు డ్రైవ్ చేస్తూ సూర్యాపేట దిశవైపు సాగిపోయింది.

  అంజి కోసం వెళ్తున్నానని.. దీప

  అంజి కోసం వెళ్తున్నానని.. దీప

  సూర్యాపేటకు వెళ్తుండగా.. కారు డ్రైవర్ దీపతో మాట్లాడుతూ... ఏంటి అక్కా అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నావు అంటూ అడిగితే.. నీవు ఉన్నావుగా తమ్ముడు అంటూ సమాధానం ఇచ్చింది. అంత అర్జెంట్ పని ఏముటుందని అడిగితే.. నీవు, వారణాసి మాదిరిగా నాకు ఓ తమ్ముడు ఉన్నాడు. వాడు సూర్యాపేట 8 రెస్టారెంట్‌లో ఉన్నాడు. వాడిని కలువాల్సి ఉంది అంటూ దీప సమాధానం చెప్పింది. కాల్ చేస్తే వారణాసి, నాలాగా ఇంటికి వచ్చేవాళ్లం కానీ.. ఏదో ముఖ్యమైన పని ఉండి ఉంటుంది. ఇక ఏమీ వివరాలు అడుగను అంటూ కారు డ్రైవర్ అని అన్నాడు.

  భాగ్యం కాల్‌తో కార్తీక్‌కు అసలు విషయం

  భాగ్యం కాల్‌తో కార్తీక్‌కు అసలు విషయం

  ఇక పీడకల పడటంతో దీపతో మాట్లాడేందుకు పిన్ని భాగ్యం కాల్ కలిపింది. ఫోన్ మరిచిపోయిందేమిటి అంటూ ఫోన్ ఎత్తగానే.. దీపకు ఓసారి ఫోన్ ఇస్తావా అని అడిగింది. దాంతో అయితే పిన్ని ఇంటికి వెళ్తానని ఎక్కడికి వెళ్లింది అంటూ కార్తీక్ ఆలోచనలో కార్తీక్ పడ్డారు. అయితే దీప ఇంట్లో లేదని చెబితే కంగారు పడిపోతుందని భావించిన కార్తీక్.. ఆమె నిద్రపోతుంది. ఉదయాన్నే కాల్ చేయిస్తాను అని చెప్పి కార్తీక్ ఆలోచనల్లో పడ్డారు. నా కోసం దీప ఎందుకు ఇంత సాహసం చేస్తుంది అంటూ కంగారు పడిపోయాడు. అలాగే మోనిత ఇంటికి దీప వెళ్లి ఉంటుందా? వెళ్తే ఉన్మాదిలా మారిన మోనిత వల్ల దీపకు ఏదైనా అపాయం జరగవచ్చు అంటూ కార్తీక్ అక్కడికి బయలుదేరాడు. లక్ష్మణ్‌ను ఇంట్లో కాపలాగా ఉంచి కార్తీక్ బయలుదేరి వెళ్లాడు.

  హంతకుడిని కలువాల్సి వస్తుందని దీప..

  హంతకుడిని కలువాల్సి వస్తుందని దీప..

  కారులో సూర్యాపేటకు వెళ్తూ దీప అనేక ఆలోచనల్లో మునిగిపోయింది. నా భర్తను కాపాడుకోవడానికి ఓ హంతకుడిని సాయం అడుగాల్సి వచ్చింది. అది కూడా భర్త ప్రియురాలిని చంపిన వాడిని కలువాల్సి వస్తున్నది. ఇప్పుడు అంజి సాయం అవసరం. మోనిత దారుణాలను బయటపెట్టాలంటే అంజి సాయం చాలా అవసరం. అంజి ద్వారా నిజం బయటపడాలి. అప్పుడు కార్తీక్, రోషిణి మేడమ్ నమ్మాలి. అప్పుడే పెళ్లి ఆగిపోతుంది అని దీప తనలో తాను అనుకొంటూ ఆవేదనకు లోనైనట్టు కనిపించింది.

  మోనిత ఇంటికి కార్తీక్

  మోనిత ఇంటికి కార్తీక్

  ఇక దీప ఎక్కడికి వెళ్లిందనే ఆందోళనతో మోనిత ఇంటికి కార్తీక్ వెళ్లాడు. అయితే ప్రియమణి ఉండటంతో మోనిత గురించి అడిగాడు. అయితే మోనిత కారు తీసుకొని బయటకు వెళ్లింది. రేపు ఉదయం వస్తానని చెప్పింది అనగానే... కార్తీక్‌కు దీప చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. తెల్లవారేలోపు ఇంటికి వచ్చేస్తాను దీప చెప్పిన విషయాలతో కార్తీక్‌లో అనుమానం పెరిగింది. దీప ఎక్కడికి వెళ్లిందంటూ కంగారు పడిపోయాడు. దీప ఫోన్ కావాలనే వదిలి వెళ్లిందా? ఎక్కడికి వెళ్లిందంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయాడు.

  అంజి.. నీ ప్రాణాలు గాలిలోనే అంటూ మోనిత

  అంజి.. నీ ప్రాణాలు గాలిలోనే అంటూ మోనిత


  ఇక కారు నడుపుకొంటూ మోనిత తనలో తాను మాట్లాడుకొంటూ.. ఒరేయ్ అంజిగా నిన్ను ట్రంప్‌ కార్డుగా వాడుకోవాలని రోషిణి చూస్తున్నది. నా మాట వింటే సరే.. ప్రాణం మీద తీపి ఉంటే బతికి ఉంటావు. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నువ్వు చస్తే నాపెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాసుకో.. నీ మృత్యువు వస్తున్నది అంటూ కారు నడుపుకొంటూ జోష్‌గా మోనిత కనిపించింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  రిజిస్టర్ ఆఫీస్‌లో అలా పెళ్లి అంటూ మోనిత

  రిజిస్టర్ ఆఫీస్‌లో అలా పెళ్లి అంటూ మోనిత

  నా కలల్ని కల్లలు చేస్తానని దీప ప్లాన్ చేసింది. కానీ ఇంకొన్ని గంటల్లో కలలను సాకారం చేసుకోబోతున్నానని దీపకు తెలియదు. వాడు నా చేతికి చిక్కాడంటే సరే.. లేదంటే వాడిని బంధించి నా ఫామ్‌హౌజ్‌లో పడేస్తాను. ఆ తర్వాత షాపింగ్ చేస్తాను. ఆ తర్వాత కార్తీక్ రాకపోతే.. అంజిగాడిని లాక్కొచ్చినట్టు కార్తీక్‌ను కూడా రిజిస్టర్ ఆఫీస్‌కు లాక్కెళ్లి రిజిస్టర్ ఆఫీస్‌లో అంటూ ఏదో అనుకొంటుండగా.. కారు ఆగిపోయింది. కారు స్టార్ట్ కాకపోవడంతో రిపేర్ చేస్తూ కనిపించింది.

  English summary
  Karthika Deepam August 3rd July's Episode preview. Latest episode of 1108 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, ACP Roshini grills Karthik over Monita pregnancy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X