For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam serial June 15th Episode: పళ్లు రాలగొడుతా,అది ఆటబొమ్మ కాదు, కార్తీక్‌పై సౌందర్య ఫైర్

  |

  తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం టాప్ రేటింగును సొంతం చేసుకొంటున్న కార్తీక దీపం సీరియల్‌లో రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. తాను ప్రెగ్నెంట్‌ను, అందుకు కారణం కార్తీక్ అంటూ మోనిత పేల్చిన బాంబు తర్వాత.. దీప, కార్తీక్ మధ్య, అలాగే తల్లి సౌందర్య, కార్తీక్ మధ్య ఎమోషనల్ సంఘటనలు చోటు చేసుకొన్నాయి. కుటుంబ పరిస్థితులు మరింత ఉద్వేగంగ మారాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రసారమైన 1066 ఎపిసోడ్‌లో జరిగిన కొన్ని ముఖ్యాంశాలు మీ కోసం..

  తప్పు చేశా.. సరిద్దిద్దు కొంటా.. కార్తీక్

  తప్పు చేశా.. సరిద్దిద్దు కొంటా.. కార్తీక్

  దీప ఇంటిలో ఉంటున్న పిల్లల బట్టలు తీసుకెళ్లడానికి వచ్చిన కార్తీక్‌తో మరదలు శ్రావ్య మాట్లాడుతూ.. టిఫిన్ చేస్తారా బావగారు.. నేను మీ అక్క ఇంట్లో.. అదే మా ఇంటిలో చేస్తాను. నేను మీ అక్క, పిల్లలు కలిసి చేస్తాం అంటూ సమాధానం ఇచ్చారు. మీ అక్క, నేను, పిల్లలు అంతా కలిసి టిఫిన్ చేస్తాం. వినడానికి ఎంత హాయిగా ఉంది. ఎంత వినసొంపుగా, సంసారపక్షంగా ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. నా కుటుంబం అనే ఫీలింగ్ ఎంత కాలానికి జరిగింది. నేను తప్పు చేశాను. దానిని సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాను అంటూ కార్తీక్ సమాధానం చెప్పారు.

  పాపం దీప అభాగ్యురాలు

  పాపం దీప అభాగ్యురాలు

  కార్తీక్ మాటలకు అడ్డుపడుతూ.. ఆ తప్పును ఎలా సరిదిద్దుకొంటావు. చాలా బాధగా ఉంది కార్తీక్. నీ గురించి కాదు.. దీప గురించి, దాని పిల్లల గురించి.. పాపం అభాగ్యురాలు. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉంది. బాధలకు బ్రాండ్ అంబాసిండర్. ఏడుపు హక్కులకు పేటెంట్ దానికే రాసి ఉన్నాయి. దాని పిల్లలకు అవే హక్కులు రాసి ఇచ్చావు. బాల్యంలో అమ్మ, నాన్నల ఒడిలో పెరగాల్సిన వాళ్లు. కానీ వారు కష్టాల్లో పెరిగారు. పిల్లి పిలల్ని మార్చినట్టు వాళ్లను ఎన్ని చోట్లకు తిప్పింది అంటూ సౌందర్య ఆవేదన వ్యక్తం చేశారు.

  మళ్లీ ఇలాంటి ప్రళయం సృష్టించావు

  మళ్లీ ఇలాంటి ప్రళయం సృష్టించావు

  ఇంకా కార్తీక్‌తో తన ఆవేదనను పంచుకొంటూ.. అమ్మా, నాన్న ఎందుకు మాట్లాడుకోరో తెలియదు. అమ్మ మీద కోపం ఎందుకో అర్ధం కాదు. పసిపిల్లలు అమ్మా, నాన్న అని పిలువడానికి ఎన్ని అగచాట్లు పడ్డారో తెలియదు. అమ్మా, నాన్న కలిసిరానే సమయానికి ఈ ప్రళయం సృష్టించావు. అదీ మళ్లీ అక్కడ.. నీవు ఎక్కడ.. పిల్లలు ఎక్కడో తెలియదు. షెటిల్ సర్వీస్ మాదిరిగా మారింది. హిమ, శౌర్య మోనితను చూసి.. ఆమె మమ్మీ అవుతుందా? ఆమె భర్త ఎవరు అంటే ఏం చెబుతావు? మాట్లాడురా.. సమాధానం ఏం చెబుతావు అని కార్తీక్‌ను సౌందర్య ప్రశ్నించింది.

  అలాంటి పరిస్థితి రానివ్వను అంటూ కార్తీక్

  అలాంటి పరిస్థితి రానివ్వను అంటూ కార్తీక్

  సౌందర్య మాటలకు కార్తీక్ స్పందిస్తూ.. పరిస్థితి అంతవరకు రానివ్వను అంటూ సమాధానం చెప్పాడు. దాంతో కోపంతో ఊగిపోయిన సౌందర్య పళ్లు రాలగొడతాను. ఏం మాట్లాడుతున్నావు రా.. మోనిత ఆటబొమ్మ కాదురా. ఆడపిల్ల. ఆడబిడ్డ ఓ మొగాడిగా గర్భం దాల్చడం అంటే చిన్న విషయంగా అనిపించిందా? అని సౌందర్య గట్టిగా నిలదీసింది. మోనిత పొగరుబోతుదే కావొచ్చు. పరాయి భర్త మీద మోజు పడొచ్చు. కానీ దాని దృష్టి అంతా నీ మీదే. నా ఆశ, కోరిక, గమ్యం అన్నీ నీవే అని సౌందర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మోనిత ప్రమాదకారి అంటే వినలేదు..

  మోనిత ప్రమాదకారి అంటే వినలేదు..

  నిన్ను తప్ప పరాయి మొగాడి మీద కన్ను పడలేదని 16 ఏళ్లుగా నాకు స్పష్టంగా తెలుసు. నీవే ప్రాణంగా బతికింది. కానీ ప్రమాదకారి.. నా మాట వినకురా.. దానితో స్నేహం వద్దురా అంటే వినలేదు. ఇప్పుడు ప్రమాదంలో పడ్డావు. అందరినీ ప్రమాదంలో పడేశావు. ఇంత జరిగాక నేను నా పిల్లలు, నా భార్య అంటున్నావు. మోనిత ఊరుకొంటుందా? రచ్చ రచ్చ చేస్తుంది.

  నన్ను ఏం చేస్తావు అంటూ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. ఆ ప్రస్తావన తీసుకురాకు. నేను ప్రస్తావన తీసుకురాను. అది పెట్టే బేడా సర్దుకొని ఇంటికి వస్తే నన్ను ఏం చేయమంటావు? అంటుండగానే.. కార్తీక్‌ ఫోన్ మోగింది. మోనిత కాల్ చేయడంతో కట్ చేసి.. నేను వెళ్లొస్తాను. ఆ ఇంటికి.. అదే మా ఇంటికి అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

  English summary
  Karthika Deepam 15th June's Episode of 1066 goes with emotional content. After Monita's pregnancy revelations, situation become horrible in karthik's home. In this emotional situtaion, Soundarya serious over Karthik in latest episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X