For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam..పెళ్లి చేసుకొంటావా? జైలుకు వెళ్తావా? మోనితకు దీప దిమ్మతిరిగే షాక్

  |

  కార్తీక్ వల్ల తాను గర్బవతిని అయ్యానని మోనిత ఫిర్యాదుపై ఏసీపీ రోషిణి తనదైన శైలిలో దర్యాప్తు చేపట్టింది. ఎదుటి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారిలోని తప్పొప్పులను పసిగట్టేందుకు రంగంలోకి దిగింది. మోనితకు తెలియకుండా ఇంటి పని మనిషి ప్రియమణి తన స్టేషన్ పిలిపించుకొని విచారించింది. అయితే తన ఇంటిలో ప్రియమణి లేకపోవడంతో కంగారు పడిపోయింది. అదే సమయంలో షాకింగ్‌గా భాగ్యం, దీప ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆందోళనకు గురైంది. తాజా ఎపిసోడ్ 1092లో ఏమి జరిగిందంటే..

  Photos Courtesy: ZeeTelugu and Zee5 , ఫొటోస్ కర్టసీ : జీ తెలుగు అండ్ జీ5

  మోనిత ఇంట్లోకి దీప, భాగ్యం

  మోనిత ఇంట్లోకి దీప, భాగ్యం

  ప్రియమణి కనిపించలేదనే విషయంతో కంగారు పడిపోతున్న మోనితకు నేరుగా భాగ్యం తన ఇంటిలోకి రావడం చూసి గెట్ అవుట్ అని అరిచింది. దాంతో మెట్లు కిందికి దిగిపోయింది. ఆ తర్వాత భాగ్యంపై విసుక్కొనే లోపే గ్రాండ్‌గా వీర లెవెల్లో దీపతో భాగ్యం ఎంట్రీ ఇచ్చింది. ఫవర్ వాజ్‌ను విసురుగా తన్నుతూ దీప ఎంట్రీని చూసిన మోనిత బిత్తరపోయింది. ప్రియమణి కాల్ చేసిందా? నా రహస్యాలన్ని బయటపెట్టిందా? అంటూ అనుమాన పడిపోయింది.

  ఉప్పు పాతరేస్తా అంటూ

  ఉప్పు పాతరేస్తా అంటూ

  దీప అండ చూసుకొని మోనితపై భాగ్యం రెచ్చిపోయింది. గెట్ అవుట్ అంటే గెట్ బయట ఉండాలా? నీవే ఊరు బయట ఉంటావు. ఇన్నాళ్లు నీ నాటకాలు చూస్తూ ఊరుకొన్నాం. ఇక నుంచి తేడా వస్తే ఉప్పు పాతరేస్తాం అంటూ భాగ్యం వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఏ ఎగిరిపడింది చాలూ.. ఆపు అంటూ మోనిత అరిచింది. ఎందుకు వచ్చావని మోనిత ప్రశ్నిస్తే... నీకు ఏం తెలుసు? పెళ్లైన మొగాడిని బుట్టలో వేసుకోవడం తెలుసా? అంటూ భాగ్యం తనదైన శైలిలో స్పందించింది.

  దీపకు షాకిచ్చిన మోనిత

  దీపకు షాకిచ్చిన మోనిత

  మోనిత మాటలకు బ్రేక్ వేస్తూ.. పోలీస్ కంప్లయింట్ ఇచ్చావా అంటూ దీప ప్రశ్నించింది. దీప ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీరు అందరూ నాకు అన్యాయం చేస్తుంటే.. చూస్తు ఊరుకొంటానా అని ఎదురు ప్రశ్న వేసింది. మా ఇంటి పరువు వీధిలో పడేద్దామానా? అంటే.. యస్.. నాకు న్యాయం జరగకపోతే.. వీధిలోనే నాటకం మొదలుపెడుతా? అంటూ మోనిత సమాధానం ఇస్తే.. ఏ న్యాయం కావాలి? అంటే.. కార్తీక్ విషయంలో జరిగిన నాకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు చట్టానికి అప్పగించాను అని మోనిత ఘాటుగా స్పందించింది.

   నిన్ను చట్టానికి అప్పగిస్తా

  నిన్ను చట్టానికి అప్పగిస్తా

  మోనిత చట్టానికి అప్పగించాను అంటే.. నేను కూడా నిన్ను చట్టానికి అప్పగించేందుకు వచ్చాను. నీ కడుపు సంగతి 25వ తేదీన తేల్చాడం కాస్త పక్కన పెడుదాం. నీకు దుర్గ గుర్తున్నాడా? కొంతకాలం మా వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు అంటూ ఫ్యాష్ బ్యాక్ చెప్పింది. దాంతో మోనితకు చెమటలు పట్టాయి.. చూశావా.. దుర్గ పేరు చెప్పగానే చెమటలు పట్టేశాయి అంటూ మరింత దీప రెచ్చగొట్టింది.

  దుర్గ, అంజికి నీ రహస్యాలన్నీ తెలుసు

  దుర్గ, అంజికి నీ రహస్యాలన్నీ తెలుసు

  మోనిత.. దుర్గకు నీ కుట్రలు, రహస్యాలు అన్నీ తెలుసు. ఇక అంజి కూడా గుర్తుండి ఉంటాడు. మా డ్రైవర్‌గా పనిచేశాడు అనగానే కంగారు పడిపోయింది. దాంతో ఎందుకు కంగారు పడిపోతున్నావు. అంజికి కూడా నీ రహస్యాలు అన్నీ తెలుసు. వారిద్దరూ నాకు తోడబుట్టిన వాళ్లతో సమానం. చిటికేస్తే ఇక్కడ వాలిపోతారు. దాంతో నీకు పిక్చర్ అర్ధమైందనుకొంటా. వారిద్దరిని ఏసీపీ ముందు హాజరుపరిచాక అసలు విషయం మాట్లాడుకొందాం అంటూ వార్నింగ్ ఇచ్చింది.

  25న పెళ్లా? జైలా? అంటూ దీప

  25న పెళ్లా? జైలా? అంటూ దీప

  మోనితకు మరింత షాకిస్తూ.. 25 తేదీన మార్క్ పెట్టుకొని నన్ను, మా ఆయనను, కుటుంబాన్ని ఆడించడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదే 25 తేదీకి నీకు పెళ్లి కావాలా? జైలు కావాలా? అంటూ దీప ప్రశ్నించింది. పెళ్లా? జైళా అంటూ భాగ్యం సెటైర్‌గా ఆటపట్టించింది. దీప ఊహించని షాక్ ఇవ్వడంతో మోనిత సందిగ్ధంలో పడిపోయింది. దీప వేసిన ఎత్తుకు పై ఎత్తు ఏమి వేయాలనే ఆలోచనలో ఉండిపోయింది.

  English summary
  ACP Roshini starts enquiry of Monita complaint in Karthika Deepam 15th July's Episode. Latest episode of 1092 goes once again with emotional content. Deepa, Soundarya talks about present situation abou Monita. Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X