For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam కారు డ్రైవర్ కాళ్లపై పడి ఏడుపు.. మోనిత కపట నాటకం బయటపెట్టిన అంజి

  |

  కారు డ్రైవర్ అంజి కోసం వేట మొదలుపెట్టిన దీప, మోనిత ఎట్టకేలకు సూర్యాపేటలోని 8 రెస్టారెంట్‌కు చేరుకొన్నారు. ఆ రెస్టారెంట్‌లో బస చేసిన అంజిని బంధించి వరంగల్ హైవేలోని తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాలని మోనిత ప్లాన్ చేసింది. ఆ క్రమంలోనే ఆ రెస్టారెంట్ ముందు మోనిత దిగిపోయింది. అయితే మోనితను బోల్తా కట్టించడానికి తాను విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీప విజయవాడకు వెళ్లి పోయిందని నిర్ధారించుకొన్న తర్వాత మోనిత 8 రెస్టారెంట్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత కారులో బ్యాక్ వచ్చి.. ఆ వెనుకనే మోనితను దీప అనుసరించింది. కార్తీకదీపం సీరియల్‌లోని 1109 ఎపిసోడ్‌లో జరిగిన హైడ్రామా ఏమిటంటే..

  Chirajeevi మనవరాలు క్యూట్ ఫోటోలు.. మెగాస్టార్ కౌగిలిలో అలాప్రేమగా!

  అంజి కాళ్లపై పడిన మోనిత

  అంజి కాళ్లపై పడిన మోనిత

  రెస్టారెంట్‌లోకి వెళ్లిన మోనిత రిసెప్షన్‌లోకి వెళ్లి అంజి గురించి వాకబు చేసింది. రూమ్ నంబర్ చెప్పడంతో తలుపుకొట్టింది. 2 గంటలు అవుతుందంటే మంచి నిద్రలో ఉంటాడని అనుకొంటుండగానే తలుపు తీసిన అంజి.. మోనితను చూసి షాక్ అయ్యాడు. మోనితను చూసి నిన్ను అంటూ కోపంతో ఊగిపోయాడు. దాంతో ఊహించని విధంగా అంజి కాళ్లపై పడి నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడింది. నేను చాలా తప్పులు, నేరాలు చేశాను. ఇప్పుడు నేను ఆ మోనితను కాను. వచ్చే 25 తారీఖు నా పెళ్లి. ఆ పెళ్లికి తీసుకెళ్లడానికి వచ్చాను అంటూ కాళ్లపై పడి ఏడుపు మొదలుపెట్టంది.

  Vadinamma : పెను విధ్వంసం ప్లాన్ చేసిన పార్వతి.. అన్యాయం చేస్తారా అంటూ!

  నీ చావు కోసం ఎదురు చూస్తున్నా అంటూ అంజి

  నీ చావు కోసం ఎదురు చూస్తున్నా అంటూ అంజి

  కాళ్లపై పడిన మోనిత లేపి.. నీ పెళ్లా? దానికి నన్ను పిలువడానికి వచ్చావా? నీ చావుకు కోసం ఎదురు చూస్తుంటే పెళ్లి అని నా వద్దకు వచ్చావా? ఏంటీ ఈ నాటకం. జుట్టు అందలేదని కాళ్లు పట్టుకొంటున్నావా? అని అంజి నిలదీశాడు. దాంతో లేదు.. నేను నిజంగా మారిపోయాను అంటూ మోనిత ఏదో చెప్పబోగా.. నీవు మారవంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది ఆ డాక్టర్ బాబుయేనా అంటూ ప్రశ్నించాడు. దాంతో నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా డాక్టర్. నా గురించి అన్ని తెలిసే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు అంటూ మోనిత దీనంగా చెప్పింది.

  Karthika Deepam అంజికి తలకు పిస్టల్ గురిపెట్టిన మోనిత.. తుపాకి పేలడంతో టెన్షన్‌లో దీప

  వెన్నుపోటు పొడిచే దానివి..

  వెన్నుపోటు పొడిచే దానివి..

  అయితే మోనిత మాటలను నమ్మలేని అంజి.. ముందుకు వచ్చిన వాడిని వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తావు. నిన్ను ఎలా నమ్మాలి. అయినా నాకు ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అంటే.. నేను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొంటున్నాను. దీప, కార్తీక్‌ను విడదీసినందుకు దీప కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాను. కార్తీక్, దీపను కలిపాను. హిమను చంపించింది నేనే అని కార్తీక్‌కు చెప్పాను. నీ మాదిరిగానే కార్తీక్‌కు కోపం వచ్చింది. నేను పెళ్లి చేసుకొంటున్నానని తెలిసి బుద్దిగా ఉండమని చెప్పాడు. రేపటి పెళ్లికి దీప, కార్తీక్‌లే పెళ్లి పెద్దలు అంటూ అమాయకంగా మోనిత చెప్పింది.

  నన్ను చంపించాలని వచ్చావా?

  నన్ను చంపించాలని వచ్చావా?

  మోనిత చెప్పిన మాటలు విన్న తర్వాత కథ బాగుంది అని అంజి కామెంట్ చేశాడు. మళ్లీ నా వద్దకు ఎందుకు వచ్చావు. నన్ను ఏ నేరం కింద అరెస్ట్ చేయడానికి వచ్చావు. ఏ రౌడీలను పెట్టి చంపించాలని వచ్చావు అంటూ అంజి నిలదీశాడు. నా మాటలు నమ్ము అంజి. నాకు కార్తీక్, దీపతోపాటు నాకు తోడబుట్టిన తమ్ముడు కూడా ఉన్నాడని, అతడూ వస్తాడని చెప్పాను. నా పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి అని మోనిత చెబితే.. చప్పట్లు కొడుతూ ఎంత కథ అల్లినావు అంటూ అంజి అనుమానంగా చూశాడు.

  Ananya Panday మరింత హాట్‌గా.. బికినీలో క్లీవేజ్‌ షో.. లైగర్‌లో విజయ్ దేవరకొండతో ఇక రచ్చే!

  కపటనాటకాన్ని బట్టబయలు చేసిన అంజి

  కపటనాటకాన్ని బట్టబయలు చేసిన అంజి

  మోనిత కపట నాటకం ఆడుతుందని గ్రహించిన అంజి.. పాము పాములా కాకుండా వానపాములా మారిందంటే నమ్మాలి.. ఏమిటి మీ కొత్త డ్రామా.. మళ్లీ ఏం చేయించాలని అనుకొంటున్నావు చెప్పు. అసలు ఏం చేసి వచ్చావు.. ఎందుకు వచ్చి వచ్చావంటూ.. నా వల్ల ఏదో ప్రమాదం ఉందని వచ్చి ఉంటావు. ఇన్ని పాపాలు చేసిన నిన్ను కార్తీక్ బాబు ఎలా క్షమిస్తాడు. మళ్లీ దీపకు ఎలాంటి అపకారం తలపెట్టేందుకు కుట్ర చేశావు అని నిలదీశాడు.

  అరేయ్ రాస్కేల్ అసలు రూపం ప్రదర్శించిన మోనిత

  అరేయ్ రాస్కేల్ అసలు రూపం ప్రదర్శించిన మోనిత


  ఇక అంజి తన కపట నాటకాన్ని నమ్మలేడని గ్రహించిన మోనిత అసలు రూపం చూపింది. ఆపురా రాస్కెల్ అంటూ కోపంతో ఊగిపోయింది. ఎవతీరా దీప.. దీప నీ అక్కనా? చెల్లినా? నీకు ఏమి అవుతుంది. అదేదో పై నుంచి ఊడి పడిన్టు.. నీకు ఏమిచ్చింది? దీపపై ఏం విశ్వాసంరా కుక్కకు ఉన్నట్టు.. నేను నీకు ఎంత ఇచ్చానురా?? ఎప్పుడు దీపమ్మ దీపమ్మ అంటారేమిటారా? దీనమ్మ జీవితం అంటూ అంజిపై విరుచుకుపడింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  దీప ఆచూకీ కోసం కార్తీక్ ఆరాటం..

  దీప ఆచూకీ కోసం కార్తీక్ ఆరాటం..

  ఇదిలా ఉండగా, దీప ఆచూకీ తెలియక ఆందోళనపడిపోతున్న కార్తీక్ తన సోదరుడు ఆదిత్య కలిసి వెతుకులాట ప్రారంభించారు. మోనితకు కాల్ చేస్తే రీచ్ కాకపోవడంతో కార్తీక్ మనసులో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దాంతో వదిన, మోనిత ఒకే దగ్గర ఉండి ఉంటారు అంటూ అదిత్య అంటే.. అలాంటిది జరగకూడదు అంటూ కార్తీక్ తెగ హైరానా పడిపోయాడు. దాంతో వదిన రేపు ఉదయం వరకు రాలేకపోతే ఏసీపీకి కంప్లయింట్ ఇవ్వమని అని ఆదిత్య అంటే.. పరిస్థితి అంతవరకు రావొద్దు అంటూ కార్తీక్ టెన్షన్‌కు గురయ్యాడు. దీప క్షేపంగా తిరిగి రావాలి? ఫోన్ తీసుకువెళ్లవచ్చు కదా.. నన్నైనా వెంటపెట్టుకొని వెళ్ల వచ్చు కదా అంటూ కార్తీక్ కోపంతో ఊగిపోయాడు.

  English summary
  Karthika Deepam August 4th August's Episode preview. Latest episode of 1109 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, High drama between Monita and Deepa while Suryapet Journey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X