twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నా కొడుకు ఆగర్బ శ్రీమంతుడు.. సౌందర్య చేసిన పనికి షాక్‌లో రుద్రాణి.. మరో ట్విస్టుతో..

    |

    అత్యంత ప్రేక్షకాదరణ, టాప్ రేటింగ్‌తో బుల్లితెర మీద కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌ మరో మలుపు తిరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చి.. తాడికొండ గ్రామంలో ఉంటూ రుద్రాణి వేధింపులకు గురవుతున్న కార్తీక్ కుటుబం ఆచూకిని సౌందర్య కనిపెట్టింది. రుద్రాణి అప్పు తీర్చమని జులుం చేస్తే.. కాళ్ల మీద పడబోయిన దీపను సౌందర్య ఆపింది. వేధిస్తున్న రుద్రాణిని సౌందర్య చెంపలపై వాయించింది. రుద్రాణికి దిమ్మతిరిగేలా క్లాస్ పీకింది. ఇంకా రుద్రాణి, సౌందర్య మధ్య 1271 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    సౌందర్య చెక్ చూసి రుద్రాణి నోరు వెళ్లబెట్టి

    సౌందర్య చెక్ చూసి రుద్రాణి నోరు వెళ్లబెట్టి

    అప్పు తీర్చలేకపోవడంతో నా కాళ్లు పట్టుకొనేందుకు ప్రయత్నించారు రుద్రాణి అంటే.. నా కొడుకు ఆ గర్భ శ్రీమంతుడు. కోట్ల రూపాయలు దానం చేసి ఇక్కడికి వచ్చాడు. వాడి ఒక్కరోజు సంపాదన నీవు సంవత్సరంపాటు కూడా సంపాదించలేవు. ఎవరనుకొంటున్నావే నీవు.. ఎంతే నీ బాకీ.. ఎన్ని లక్షల ఇరువై వేలు అని రుద్రాణి అంటే.. వెంటనే సౌందర్య చెక్ రాసి.. రుద్రాణి ముఖం మీద పడేసింది. పది లక్షల్లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? అని సౌందర్య హేళన చేసింది. పది లక్షలా అంటూ రుద్రాణి నోరు వెళ్లబెట్టింది. దాంతో సరిపోలేదా? హైదరాబాద్ వస్తే నా ఇల్లు చూసి వెళ్లు అంటూ సౌందర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

    నాన్నమ్మ హైదరాబాద్ వెళ్లిపోదాం అంటూ హిమ

    నాన్నమ్మ హైదరాబాద్ వెళ్లిపోదాం అంటూ హిమ

    అంతలోనే హిమను కిడ్నాప్ చేసిన కారు అక్కడికి వచ్చింది. పాప ఏడుపు ఆపడం లేదు. అందుకే తీసుకొచ్చాను అని రుద్రాణి మనిషి చెప్పాడు. హిమ వెంటనే కారు డోర్ తీసుకొని వచ్చి.. నానమ్మ ఏడ్చింది. నానమ్మ వెంటనే హైదరాబాద్ వెళ్లిపోదాం అంటూ సౌందర్యను కౌగిలించుకొన్నది. దాంతో కారులో కార్తీక్, దీప, సౌందర్య, హిమ బయలుదేరి వెళ్లిపోయారు. సౌందర్య ఇచ్చిన స్ట్రోక్‌కు రుద్రాణి తీవ్రమైన షాక్‌లో పడింది.

    శౌర్యకు ఆరోగ్యం బాగాలేదు అంటూ

    శౌర్యకు ఆరోగ్యం బాగాలేదు అంటూ

    హిమ కోసం భారతీ ఏడుస్తూ ఉంటే.. కార్తీక్, దీప, సౌందర్య అక్కడికి వచ్చారు. హిమను చూసి శౌర్య ఎలా వచ్చావు.. నాన్న, అమ్మ డబ్బు కట్టారా అంటూ శౌర్య ఏడుస్తుంటే.. సౌందర్య ఇంట్లోకి అడుగుపెట్టింది. నాన్నమ్మను చూసి కంగారు పడింది. శౌర్యకు ఆరోగ్యం బాగాలేదు అని హిమ అంటే.. కార్తీక్ మధ్యలో ఆపేస్తూ.. హిమ ఊరుకో అంటూ ఆపారు. దీప కూడా హిమను ఏమి చెప్పకుండా ఆపింది. ఇక ఆనంద్ గురించి హిమ చెప్పగానే సంతోషపడింది. కార్తీక్ గతంలో జరిగిన కథ విని.. బాబుకు మీరంతా దగ్గరైనటు ఉంది అంటూ సౌందర్య అంది.

    ఇన్ని కష్టాలు పడే అవసరం ఉందా?

    ఇన్ని కష్టాలు పడే అవసరం ఉందా?

    కార్తీక్ దీప ఉంటున్న ఇల్లును చూస్తూ ఆవేదనకు గురైంది. ఆ తర్వాత ఇల్లంతా కలియదిరిగింది. దీపను పిలిచి.. ఏంటి ఇలాంటి ఇంటిలో ఉంటున్నారా? అన్న వదులుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం? ఇన్ని కష్టాలు పడే అవసరం ఉందా? అని సౌందర్య నిలదీసింది. దాంతో అత్తమ్య.. కార్తీక్‌ను ఏమీ అనకండి దీప అంటే.. వీటికి ఏం తక్కువలేదు అంటూ సౌందర్య చెప్పింది. దీప మెడలో నగలు లేకపోవడం చూసి.. ఏంటి కార్తీక్ ఇలా చేస్తావా? అంటూ సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది.

    పెద్దోడ ఇంటికి వెళ్లిపోదాం అంటూ సౌందర్య

    పెద్దోడ ఇంటికి వెళ్లిపోదాం అంటూ సౌందర్య

    కార్తీక్‌ను చూసి.. పెద్దోడ.. మన ఇంటికి వెళ్లిపోదాం అంటూ సౌందర్య అంటే.. కార్తీక్ బాధగా నేను రాలేను మమ్మీ అంటూ సమాధానం చెప్పారు. దాంతో భారతీ ముఖం సౌందర్య చూసింది. ఆ తర్వాత రావా.. ఇక్కడికి వచ్చి ఏం సాధించావు. దీపను బాధపెడుతున్నావు.. అభంశుభం తెలియని పిల్లలను బాధపెడుతున్నావు. అక్కడ మేము.. ఇక్కడ మీరు బాధపెడుతున్నావు. దీప.. నీవైనా చెప్పాలి కదా.. నీ పతిధర్మాన్ని నీవు నెరవేరుస్తున్నావు. కానీ తల్లిధర్మం గురించి ఆలోచించవా? ప్రతీ రోజు అన్నం తింటూ చేతిలో ముద్ద చూసి కన్నీళ్లుపెట్టుకొంటున్నాం. ఆ విషయం మీకు తెలుసా?

    మౌనంగా ఉండకుండా ఏదైనా మాట్లాడు అంటూ

    మౌనంగా ఉండకుండా ఏదైనా మాట్లాడు అంటూ

    కార్తీక్‌తో సౌందర్య మాట్లాడుతూ.. మీరు వెళ్లిపోయిన తర్వాత మీ మీద బెంగతో మీ నాన్న ఆరోగ్యం క్షీణించింది. మీ కోసం మేము ఎంత క్షోభకు గురయ్యామో తెలుసా? ఇన్ని రోజుల్లో మీ గురించి చెబుతూ ఓ ఉత్తరం కూడా రాయకుండా ఎందుకు ఉన్నావు.. నీవు ఏం తప్పు చేశావు.. ఎందుకు తలదించుకొంటున్నావు. నీవు గొప్ప డాక్టర్‌వి. గ్రేట్ కార్డియాలజిస్టువి. నా పెద్ద కొడుకు అని గర్వంగా చెప్పుకొంటాను. అలా మౌనంగా ఉండక.. ఏదైనా మాట్లాడురా అంటూ సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది.

    నా కొడుకువే కదా అంటూ సౌందర్య

    నా కొడుకువే కదా అంటూ సౌందర్య

    అయినా కార్తీక్‌ మౌనంగా తలదించుకోవడంతో.. తల ఎత్తి నా ముఖం చూడు అంటూ సౌందర్య ఆవేదన చెందింది. అయితే నేను రాలేను అంటూ కార్తీక్ అన్నాడు. నీవు ఏం తప్పు చేశావు.. చిన్న తప్పు ఏదో జరిగింది అంటే.. అది చిన్న తప్పు కాదు.. ఓ ప్రాణం పోయింది అని కార్తీక్ కంటతడి పెట్టుకొన్నాడు. దాంతో నీవు ఎన్నో ఆపరేషన్లు చేశావు.

    నీవు ఓ గొప్ప డాక్టర్‌వి అని సౌందర్య అంటే.. నేను ఒకప్పుడు డాక్టరని.. ఇప్పుడు కాదు అంటూ కార్తీక్ సమాధానం చెప్పాడు. దాంతో డాక్టర్‌ కాకముందు నా కొడుకువే కదా.. నిన్న కాక మొన్న కలిసిన బాబు ఎంత పెంచుకొన్నారే.. ఎవరో ఏంటో తెలియని బాబుపై అంత మమకారం ఉంటే.. నిన్ను కన్న నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా అంటూ సౌందర్య కన్నీరుమున్నీరైంది.

    English summary
    Karthika Deepam February 8th Episode number 1271
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X