ఆ వ్యక్తి గురించి అడిగితే బాగోదు... నిఖిల్‌తో రిలేషన్‌పై కావ్య షాకింగ్స్ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియాక్కల్.. బుల్లితెర నటి కావ్యశ్రీ గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఒకే సీరియల్‌లో పనిచేయడం, కలిసి ఈవెంట్స్‌కు హాజరు కావడం, వెకేషన్స్, పార్టీలతో ఈ జంట మోత మోగించింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ నిఖిల్- కావ్యలు విడిపోయారు. వీరి మధ్య దూరం పెరగడానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఒకరి ముందు మరొకరి పేరు వినడానికి కూడా వాళ్లు ఇష్టపడం లేదు. తాజాగా నిఖిల్‌తో రిలేషన్‌పై కావ్యశ్రీ హాట్ కామెంట్స్ చేశారు.
ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి ఆదరణ
స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెర సెలబ్రిటీలను తీసుకొచ్చి.. వారితో హోస్ట్ శ్రీముఖి చేసే అల్లరి జనానికి బాగా ఎక్కుతోంది. తాజాగా కార్తీక దీపాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం ఎపిసోడ్ ముస్తాబైంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ విడుదల చేసింది. ప్రోమో స్టార్టింగ్‌లోనే శ్రీముఖి వచ్చి.. నెక్ట్స్ కార్తీక పౌర్ణమికి నేను బావగారితో పాటు ఎపిసోడ్‌కి రావాలని కోరుకుంటున్నానని ఏమంటారు? అని ప్రేక్షకులను అడగ్గా.. దానికి గ్యాలరీలో కూర్చొన్న ప్రేక్షకులు యస్ అనే బోర్డ్ పైకెత్తారు.

పిల్లాడితో గొడవపడ్డ శ్రీముఖి
ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంతు వచ్చి.. ఈ పరివారం షోకి యాంకర్ ఒక్కటే మారడం లేదని తెలుసు.. ఆ ప్లేస్‌లో నేనుండాలని కోరుకుంటున్నాను.. దీనికి మీరేం అంటారని సిరి అడగ్గా శ్రీముఖి షాకైంది. ప్రేక్షకులు మాత్రం మరో ఆలోచన లేకుండా వెంటనే మాకు శ్రీముఖియే యాంకర్‌గా కావాలని సిరి హనుమంతుకు నో అనే బోర్డ్ ఎత్తేశారు. దాంతో సిరి షాకైంది.. ఇంతలో అందరూ నో అనే బోర్డ్స్ పట్టుకుంటే నువ్వు యస్ అన్నావా అంటూ ఓ బుడ్డోడు బోర్డ్ పట్టుకోవడంతో రాములమ్మ సీరియస్ అయ్యింది.
నాకు స్వయంవరం కావాలన్న రోహిణి
నన్ను మారాలి అన్నావా? నువ్వు రా అంటూ పిల్లాడితో గొడవకు దిగింది. ఆ వెంటనే యాదమ్మ రాజు వచ్చి అమ్మగారు వాడికి యస్‌కి, నోకి తేడా తెలియదని క్షమించి వదిలేయమని అంటాడు. అయితే సిరి హనుమంతు మాత్రం క్యూటీ అంటూ పిల్లాడి బుగ్గపై ముద్దు పెట్టడంతో అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణి వచ్చి ఓ ప్రేక్షక దేవుల్లారా? నాకు ఎప్పటి నుంచో ఓ తీరని కోరిక ఉంది.. పది మంది అబ్బాయిల్లో ఒకరిని నేనే ఎంచుకుని పెళ్లి చేసుకోవాలి? ఆ కోరిక తీరాలి? జరిగిద్దా? అని అడుగుతుంది. దానికి అందరూ యస్ అనే బోర్డ్ ఎత్తడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంది.
మీకూ నాలాంటి గతి పడుతుంది
చివరిగా కావ్యశ్రీ వచ్చి ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని వేడెక్కించింది. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ షోస్‌కి వెళ్లినా, అందరూ కలిసి అడుగుతున్న ఒకే ఒక్క క్వశ్చన్.. ఎప్పుడూ నన్ను అడగకూడదు. ఒకవేళ ఎవరైనా అడిగితే వాళ్లకి కూడా నాలాంటి సిచ్యూయేషన్ రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పింది. దాంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ వెంటనే శ్రీముఖి వచ్చి కావ్య కోరికకు యస్ అంటారా? నో అంటారా? అని అడగ్గా.. అందరూ పిండ్రాఫ్ సైలెన్స్ అవుతారు. దాంతో ఏం జరుగుతుంది? కావ్యకు ప్రేక్షకులు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు? అనేది ఉత్కంఠగా మారింది. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఆదివారం విత్ స్టార్ మా పరివారం చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











