For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhee 13 Winner: ముందే లీకైన ఢీ షో విజేత పేరు.. ఊహించని కంటెస్టెంట్‌కు టైటిల్.. ఆ వీడియో రావడంతో!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, కొన్ని మాత్రమే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాయి. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'ఢీ' ఒకటి. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 13వ సీజన్‌ను జరుపుకుంటోంది. వచ్చే వారం నుంచి ఈ షో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. అయితే, అంతకంటే ముందే అంటే తాజాగా ఈ సీజన్ విన్నర్ పేరు లీకైపోయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  తెలుగులో హవాను చూపిస్తోన్న ఢీ

  తెలుగులో హవాను చూపిస్తోన్న ఢీ


  తెలుగు బుల్లితెరపై డ్యాన్స్ ఆధారంగా ఎన్నో రకాల షోలు వచ్చాయి. అయితే, అందులో 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను అందుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షో అనిపించుకుంటోంది. దీంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.

  బైసెక్సువల్‌గా మారబోతున్న సమంత: విడాకులు తర్వాత సంచలన ప్రకటన.. తెలుగులో ఎవరూ చేయని విధంగా!

  ఏకంగా పదమూడు... ఆ పేరు పెట్టి

  ఏకంగా పదమూడు... ఆ పేరు పెట్టి

  'ఢీ' షో ఇప్పటికే పన్నెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదమూడో దానిని కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. 'కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే ఈ సీజన్‌కు మరింత రెస్పాన్స్ వస్తోంది.

  పదమూడో సీజన్ ఇలా సాగుతోంది

  పదమూడో సీజన్ ఇలా సాగుతోంది


  'కింగ్ వర్సెస్ క్వీన్స్' సీజన్‌ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. కింగ్స్ టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. క్వీన్స్ జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు ఉన్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. వీళ్ల కామెడీతో షోకు టీఆర్పీ కూడా భారీగానే దక్కుతోంది.

  Akhanda ఈవెంట్‌కు బన్నీతో పాటు మరో స్పెషల్ గెస్ట్: ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టే

  ఫినాలేలోకి అడుగుపెట్టింది ఎవరు

  ఫినాలేలోకి అడుగుపెట్టింది ఎవరు

  పదమూడవ సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. గత వారమే ఈ సీజన్‌కు సంబంధించిన సెమీ ఫైనల్స్ కూడా పూర్తయ్యాయి. ఇందులో క్వీన్స్ టీమ్ తరపున నైనిక, కావ్యశ్రీ ఫినాలేకు చేరుకున్నారు. కింగ్స్ టీమ్ నుంచి సాయి, కార్తీక్ వచ్చారు. వీళ్లలో తుది దశకు ఒక కింగ్, ఒక క్వీన్ వస్తారు. వాళ్లలో ఒకరు ఢీ 13 విజేతగా నిలవబోతున్నారు.

  విన్నర్‌ను ప్రకటించేది ఐకాన్ స్టార్

  విన్నర్‌ను ప్రకటించేది ఐకాన్ స్టార్

  వచ్చే బుధవారం ఢీ పదమూడవ సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీని కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటనను గత ఎపిసోడ్ చివర్లో చేశారు. అలాగే, తాజాగా ఢీ సెట్స్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన ప్రోమోను షో నిర్వహకులు విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  ముందే లీకైన ఢీ 13 విజేత డీటేల్స్

  ముందే లీకైన ఢీ 13 విజేత డీటేల్స్


  ఫినాలేలో నైనిక, కావ్యశ్రీ, కార్తీక్, సాయిలు టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. వీళ్లలో విజేత ఎవరన్నది వచ్చే వారమో.. ఆ పైన వచ్చే వారమో తేలిపోనుంది. అయితే, తాజాగా ఈ సీజన్ విన్నర్ గురించిన వివరాలు బయటకు వచ్చేశాయి. ఇందులో కార్తీక మీద కావ్యశ్రీ గెలిచినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి.. ఊహించని విధంగా విన్నర్ అయిందట.

  ఆ వీడియో బయటకు రావడంతో

  ఆ వీడియో బయటకు రావడంతో


  ఢీ పదమూడవ సీజన్ 'కింగ్ వర్సెస్ క్వీన్స్' ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ రెండు రోజుల క్రితమే పూర్తైందట. అందులో అల్లు అర్జున్ విజేతను ప్రకటిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో కావ్యశ్రీనే గెలిచినట్లు కనిపిస్తోంది. ఇవే వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకుంది. దీంతో కావ్య గెలిచినట్లు కన్ఫార్మ్ అయిపోయింది.

  English summary
  Dhee is an Indian dance reality show. This Was telecasting in ETV. Contestant Kavyasri Won DHEE 13 Kings vs Queens Title
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X