For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలాంటోన్ని చెప్పుతో కొడతానన్న రకుల్, రక్తం వచ్చేలా మంచు లక్ష్మి గిల్లుడు!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్... మంచు లక్ష్మికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సమయం దొరికితే చాలు ఇద్దరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటారట. ఈ మధ్య వీరి ఫ్రెండ్షిప్ మీద రకరకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి తను హోస్ట్ చేస్తున్న 'నెం.1 యారి' టాక్ షోకు ఆహ్వానించి వారి నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు.

  మీరు ఇద్దరు మాత్రమే ఉన్నపుడు దేని గురించి మాట్లాడుకుంటారు అని రానా ప్రశ్నించగా మంచు లక్ష్మి ఎలాంటి మొహమాటం లేకుండా..... మేమే కలిస్తే వచ్చే ఫస్ట్ టాపిక్ 'బాయ్స్', సెకండ్ టాపిక్ 'ఫుడ్' అని చెప్పడం గమనార్హం

  రకుల్‌కు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు

  రకుల్‌కు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు

  రకుల్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. కానీ ఈ విషయం ఎవరూ నమ్మరు. నో బాయ్ ఫ్రెండ్, నో డేటింగ్. ఎవరినైనా చూసుకోమని చెబుతున్నా వినడం లేదు. ఎందుకో తెలియదు కానీ ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఏదైనా టైమ్‌కు కలవాలి అనుకుంటే తప్పకుండా కలుస్తాం... అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

  నువ్వు ఇలా చేస్తే రకుల్‌కు బాయ్ ఫ్రెండ్ ఎలా దొరుకుతాడు?

  నువ్వు ఇలా చేస్తే రకుల్‌కు బాయ్ ఫ్రెండ్ ఎలా దొరుకుతాడు?

  రకుల్ షూటింగులు లేకుండా ఖాళీగా ఉన్నపుడు.... నువ్వు కబుర్లు చెప్పుకోవడానికి పిలిస్తే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఎలా దొరుకుతాడు..... అంటూ రానా వారిద్దరినీ ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా రకుల్ ‘బాయ్ ఫ్రెండ్ దొరక్కపోవడం నా కర్మ' అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

  అబ్బాయిల కంటే లక్ష్మి నన్ను హ్యాపీగా ఉంచుతుంది

  అబ్బాయిల కంటే లక్ష్మి నన్ను హ్యాపీగా ఉంచుతుంది

  ఈ సందర్భంగా రానా అడిగిన ఓ ప్రశ్నకు రకుల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అబ్బాల తోడు దొరకలేదని నేను బాధపడటం లేదు, లక్ష్మితో కలిసి టైమ్ స్పెండ్ చేయడం నచ్చుతుంది. ఆమె నన్ను చాలా హ్యాపీగా ఉంచుతుంది అన్నారు.

  ఇద్దరినీ రక్తం వచ్చేలా గిల్లుతాను

  ఇద్దరినీ రక్తం వచ్చేలా గిల్లుతాను

  మనోజ్, విష్ణులను చిన్నప్పుడెప్పుడైనా కొట్టావా? చిన్నపుడే కాదు... ఇప్పుడు కూడా కొడతాను. నా గోళ్లు పెంచుకునేది వాళ్ల కోసమే.. విష్ణు చాలా పొడవుగా ఉంటాడు కాబట్టి కొట్టలేను. నన్ను కొట్టడానికి వస్తే గోళ్లతో గిల్లుతాను. వాళ్ల చేతులు చూస్తే చాలా గాట్లు ఉంటాయి. రక్తం వచ్చేలా గిల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

  విష్ణు వల్ల ఇంట్లో నుంచి పారిపోయాను

  విష్ణు వల్ల ఇంట్లో నుంచి పారిపోయాను

  విష్ణు, మనోజ్ నన్ను చాలా ఏడిపించేవారు. నన్ను బక్కక్క అని పిలిచేవారు. విష్ణు ప్రతి దానికి గొడవే. స్కూల్‌లో టీచర్ విష్ణు ఫేవరెట్ పెన్సిల్ నాకు ఇస్తే దాంతో హోం వర్క్ చేశాను. అపుడు పైన ఉండే లెడ్ కరిగిపోయింది. అపుడు మా అమ్మను, అమ్మను చాలా ఏడిపించాడు. ఆ దెబ్బకు నేను ఇంట్లో నుంచి హాస్టల్ పారిపోయాను. మనోజ్ అయితే నా పర్సులో డబ్బులు కొట్టేసేవాడు... అని మంచు లక్ష్మి గుర్తు చేసుకున్నారు.

  నచ్చినా ప్రపోజ్ చేసే గట్స్ లేవు: రకుల్

  నచ్చినా ప్రపోజ్ చేసే గట్స్ లేవు: రకుల్

  నాకు ఎవరైనా అబ్బాయి నచ్చినా ప్రపోజ్ చేసే గట్స్ లేవు. నా చేయి నేను కిరుక్కుంటాను. అబ్బయిల్లో హైట్, సెన్పాఫ్ హ్యూమర్, పొగరు లేకుండా మర్యాదగా మాట్లాడేవాడై ఉండాలి. ఆరొగెన్స్ ఉంటే నేనే చెప్పుతీసి కొడతా అని రకుల్ వ్యాఖ్యానించారు. మంచు లక్ష్మి కల్పించుకుని ‘వద్దే... అలా అనకే... నువ్విలా అంటే వచ్చే వాడు కూడా రాడు ఈ పిల్ల దేనితో కొడుతుందో అని' అని వ్యాఖ్యానించడం గమనార్హం.

   ఎవరు క్యూట్? ఎవరు హాట్?

  ఎవరు క్యూట్? ఎవరు హాట్?

  రానా అడిగిన ప్రశ్నలకు మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ... క్యూట్-సమంత, స్మార్ట్- రానా, హాట్-బన్నీ, జీనియస్ -రాజమౌళి సర్, స్ట్రైట్ ఫార్వర్డ్-మోహన్ బాబుగారు... అని సమాధానం ఇవ్వగా... స్మార్ట్- నాగ్ సర్, ఇన్నోసెంట్ -చైతన్య, హాండ్సమ్- విజయ్, ప్లేయర్- రానా అంటూ రకుల్ రిప్లై ఇచ్చింది.

  English summary
  Telugu actress Lakshmi Manchu and Rakul Preet Singh, who are known to be great friends, are appeared on the second season of Baahubali actor Rana Daggubati-hosted hit TV show No 1 Yaari.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X