Lokah Day 10 Collections: 150 కోట్లు ఔట్.. లోక వసూళ్ల విధ్వంసం, ఆల్‌టైం రికార్డ్ దిశగా దుల్కర్ మూవీ
కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు లీడ్ రోల్స్‌లో నటించిన సూపర్ ఉమెన్ మూవీ లోక చాప్టర్ 1: చంద్ర. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించారు. లోక చాప్టర్ 1: చంద్రలో షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన లోకభారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో లోక చాప్టర్ 1: చంద్ర మూవీ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 10వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..
లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 9 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 9 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 8 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇండియాలో 9 రోజుల వరకు 73 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లోనూ లోక చాప్టర్ 1 చంద్ర సినిమా భారత్‌తో సమానంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో కళ్యాణి ప్రియదర్శన్ మూవీకి 72 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి ఈ సినిమాకు తొమ్మిది రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 145 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు , ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.30 కోట్ల రూపాయలు, ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.10 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, 8వ రోజున 1.20 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున కోటి రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 60 కోట్ల రూపాయలు, తమిళంలో 7.50 కోట్ల రూపాయలు, తెలుగులో 12 కోట్ల రూపాయలు, కన్నడంలో 5 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
లోక చాప్టర్ 1 పదవ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో లోక చాప్టర్ 1: చంద్ర తన ప్రభంజనాన్ని కొనసాగించింది. విడుదలైన పది రోజులు కావొస్తున్నా వరల్డ్ వైడ్‌గా రోజుకు 10 కోట్ల రూపాయలు తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతోంది. చిన్న సినిమాగా విడుదలై దుల్కర్ సల్మాన్‌కు నిర్మాతగా భారీ లాభాలను తెచ్చిపెడుతోంది ఈ సినిమా.10వ రోజు లోక చాప్టర్ 1: చంద్ర వసూళ్లను పరిశీలిస్తే.. శనివారం మలయాళంలో 89 శాతం, తెలుగులో 56 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 10వ రోజున మలయాళంలో 8 కోట్ల రూపాయలు, తమిళంలో కోటి రూపాయలు, తెలుగులో కోటి 50 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో 10 రోజుల వరకు లోక చాప్టర్ 1: చంద్ర వరల్డ్ వైడ్‌గా 154 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.


Click it and Unblock the Notifications











