Lokah Day 16 Collections: మోహన్‌లాల్ రికార్డ్ బ్రేక్.. దుల్కర్ మూవీ సరికొత్త చరిత్ర, లోక మూవీకి ఎన్ని కోట్లంటే

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా నిర్మించిన చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్, నేచురల్ పవర్స్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు లీడ్ రోల్ పోషించగా.. షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్‌లు అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఆగస్ట్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో లోక చాప్టర్ 1: చంద్ర మూవీ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 16వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

Lokah Chapter 1 Chandra Day 16 Box Office Collections Worldwide Dulquer Salman s movie surpassed Thudarum at the overseas

లోక చాప్టర్ 1 చంద్ర 15 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 9 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 8 కోట్ల రూపాయలు, పదవ రోజున 11 రూపాయలు, పదకొండో రోజున 11 రూపాయలు, పన్నెండవ రోజున 6.50 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 6 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 5 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 4 కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇండియాలో 15 రోజుల వరకు 106 కోట్ల రూపాయల నెట్, 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

అటు ఓవర్సీస్‌లోనూ లోక చాప్టర్ 1 చంద్ర సినిమా భారీ వసూళ్లతో రికార్డు సాధించింది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ తదితర దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తద్వారా ఓవర్సీస్‌లో 100 కోట్ల వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. 143 కోట్ల వసూళ్లతో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల ఎల్ 2: ఎంపురాన్ మూవీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి ప్లేస్‌తో తుడరం స్థానం దక్కించుకుంది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి లోక చాప్టర్ 1: చంద్ర మూవీకి 15 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు , ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.30 కోట్ల రూపాయలు, ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.10 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, 8వ రోజున 1.20 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున కోటి రూపాయలు, పదో రోజున 1.50 కోట్లు, పదకొండో రోజున 1.30 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 50 లక్షల రూపాయలు, పదమూడో రోజున 50 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 50 లక్షల రూపాయలు, పదిహేనవ రోజున 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 82 కోట్ల రూపాయలు, తమిళంలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 14 కోట్ల రూపాయలు, కన్నడంలో 7 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 7.50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

లోక చాప్టర్ 1 పదహారవ రోజు రోజు కలెక్షన్స్
వీకెండ్, వర్కింగ్ డేస్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద లోక చాప్టర్ 1: చంద్ర మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం మిరాయ్, కిష్కింధపురి సహా పలు చిన్నాపెద్దా సినిమాలు రిలీజైన దుల్కర్ సల్మాన్ మూవీ నిలబడింది. 16వ రోజున మలయాళం వెర్షన్‌లో 43 శాతం, తెలుగు వెర్షన్‌లో 20 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. 15వ రోజున మలయాళంలో 3.50 కోట్ల రూపాయలు, తమిళంలో 30 లక్షల రూపాయలు, తెలుగులో 30 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో 16 రోజుల వరకు లోక చాప్టర్ 1: చంద్ర చిత్రం వరల్డ్ వైడ్‌గా 225 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 250 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్‌‌ కావడంతో మరోసారి దుల్కర్ సల్మాన్ మూవీ దుమ్ముదులిపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X