థియేటర్‌లో 320 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోనూ మహావతార్ నరసింహా సరికొత్త చరిత్ర
మహావతార్ నరసింహా.. ఈ మధ్యకాలంలో థియేటర్‌లన్నీ దేవాలయాలుగా మారిపోతూ.. పిల్లలు, పెద్దలు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. యానిమేషన్ మూవీగా ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన మహావతార్ నరసింహా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో పాటు ఈ జోనర్‌లో మరిన్ని సినిమాలు వచ్చేందుకు బాటలు వేసింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇక్కడా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వివరాల్లోకి వెళితే..
మహావతార్ నరసింహా బడ్జెట్?
కన్నడలో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ చిత్రాన్ని కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీఎఫ్ఎక్స్, యానిమినేషన్, మ్యూజిక్, ప్రచార కార్యక్రమాల కారణంగా టెక్నికల్‌గా ఈ సినిమాకు బాగానే ఖర్చయ్యింది. ఈ యానిమేటెడ్ చిత్రానికి దాదాపు 15 కోట్ల పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. శిల్పా దవన్, కుషల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించగా అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ ఎడిటింగ్, జయపూర్ణ దాస్ రచన సహకారం అందించారు. సామ్ సీఎస్ స్వరాలు సమకూర్చిన మహావతార్ నరసింహ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
యానిమేటెడ్ చిత్రం అయినప్పటికీ టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలతో ఈ సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజైంది. మహావతార్ నరసింహ చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 రూపాయల కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
మహావతార్ నరసింహా కలెక్షన్స్
మహావతార్ నరసింహా తొలివారం ఇండియా వైడ్‌గా 32.62 కోట్ల రూపాయలు, రెండో వారం 54.86 కోట్ల రూపాయలు, మూడో వారంలో 53.77 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 23.24 కోట్ల రూపాయలు, ఐదో వారంలో 12.75 కోట్ల రూపాయలు, ఆరో వారంలో 5.12 కోట్ల రూపాయలతో కలిపి ఇండియాలో 251 కోట్ల రూపాయలు నెట్, 295 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా బాగా ఎక్కడంతో అక్కడా కలెక్షన్ష వర్షం కురిసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేసరికి మహావతార్ నర్సింహా సినిమా వరల్డ్ వైడ్‌గా 320 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్చపరిచింది.
మహావతార్ నరసింహా ఓటీటీ రికార్డ్
సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మహావతార్ నరసింహా చిత్రం.. థియేటర్‌లలో విడుదలైన దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 29 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ ఊహించినట్లుగానే థియేటర్‌లో మాదిరిగానే ఓటీటీలోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న చిత్రాల్లో మహావతార్ నరసింహా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. చిత్ర ఈ చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











