For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీవీల్లో పతివ్రత పాత్రలు, బయిట ఇలా రెచ్చిపోవడాలు, ఫేస్ బుక్ లో తిట్లు

  By Srikanya
  |

  ముంబై: టీవిల్లో పాత్రను బట్టి తెరపై ఒక రకంగా కనిపించాం, ఓకే బయిట కూడా అలాగే ఉండాలా..ఏం మాకు ఇష్టమైనట్లు గ్లామర్ ప్రదర్శన చేయకూడదా అంటోంది సోనారికా. అయితే ఆమె అభిమానులు మాత్రం నువ్వు చేసేది ఏమీ పద్దతిగా లేదమ్మాయి. నిన్ను మేము చాలా పవిత్రంగా, దేవతలా ఊహించకున్నాం, మా ఊహలు భగ్నం చేస్తావా అయ్ అంటున్నారు. సరే మీ ఇష్టం, నా ఇష్టం ఇది అంటూ సోనారికా మాత్రం ఎక్కడా తగ్గటం లేదు.

  మంచు విష్ణుతో వరుసగా రెండు సినిమాలు చేసిన సోనారికా భడోరియా.. అసలు టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టింది. అమ్మడు నటించిన మొదటి సీరియల్ 'తుమ్ దేనా సాథ్ మేరా' క్లిక్ కాకపోయినా.. ఈమె అందానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆ వెంటనే.. 'దేవోం కీ దేవ్.. మహాదేవ్' సీరియల్ లో పార్వతీ దేవిగా నటించే ఆఫర్ వచ్చింది. ఈ రోల్ తో పాటు సీరియల్ బాగా క్లిక్ అవడంతో.. సోనారిక సెటిల్ అయిపోయింది.

  ఆమె రోల్ తో పాటు సీరియల్ కూడా చాలా పెద్ద సంచలన హిట్ అవ్వడం తో ఆమె సాంప్రదాయ లుక్ చాలా పాపులర్ అయింది. ఎంతగా అంటే మహదేవ్ - పార్వతి శారీస్ అంటూ మొట్టమొదటి సారిగా సీరియల్ నటి మీద చీరలు కూడా దింపేశారు వ్యాపారులు. ఈ ఒక్క సీరియల్ తో ఆమె చాలానే సంపాదించింది అని టాక్ ఉంది.

  పార్వతిగా ఆమె ప్రేక్షకుల మదిలో ముద్రపడినట్టు ఉంది. ఆమె ఆ సీరియల్‌ నుంచి తప్పుకొని ఇప్పటికీ మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విహారయాత్రకు వెళ్లిన ఆమె కొన్ని ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్టు చేసింది. నీలి అలల తీరంలో సముద్ర ఒడ్డున ఆమె బికినీలో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దీనిపై కొందరు ఆమె అభిమానులు నొచ్చుకున్నారు. అయితేనేం ఇప్పుడు తాను ఓ బాలీవుడ్ చిత్రం కూడా చేస్తూ వెండితరపై నార్త్ లో కూడా మెరవటానికి రంగం సిద్దం చేసుకుంది.

  స్లైడ్ షోలో మరిన్న విశేషాలు..

  ఫేస్ బుక్ లో తిట్లు

  ఫేస్ బుక్ లో తిట్లు

  నువ్వేనా...ఇదేమిటి? శివుడి ఇల్లాలైన పార్వతీదేవిగా ఎంతో పవిత్రమైన పాత్రలో కనిపించి.. ఇప్పుడిలా కురచ దుస్తులు వేసుకోవడమేమిటని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె తీరును తప్పుబడుతూ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యారు. దీంతో సోనిరిక స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

   షేపింగ్ కాదు ఇది షేమింగ్

  షేపింగ్ కాదు ఇది షేమింగ్

  'నేను ఏ ప్రపంచంలో ఉన్నానో తెలియడం లేదు. పాశ్చాత్య దేశాల్లో బాడీషేమింగ్‌ (శరీరాకృతి గురించి విమర్శలు చేయడం)కు వ్యతిరేకంగా పోరాడుతుండగా ఇక్కడ బాడీ షేమింగ్ మాట పక్కనపెట్టండి. కనీసం బికినీ వేసుకున్నన్నా నేరంగా పరిగణిస్తున్నారు. నేను బికినీలో దిగిన కొన్ని ఫొటోలను పెట్టాను. వాటిపై వస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు, శాపనార్థాలు తట్టుకోలేక వాటిని డిలీట్‌ చేస్తున్నాను. వాటన్నింటినీ నేను విస్మరించవచ్చు. కానీ అంత ప్రతికూలతను భరించే పరిపక్వత నాకు రాలేదు. అందుకే ఫొటోలను తీసేశాను' అని ఆమె పేర్కొన్నారు.

   తిడితేనేం, చూస్తున్నారుగా

  తిడితేనేం, చూస్తున్నారుగా

  సంప్రదాయ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. రియల్ లైఫ్‌లో మాత్రం బాగా హాట్‌గా కనిపించేందుకే ఆసక్తి చూపుతోంది. మహాదేవ్ సీరియల్‌లో పట్టుచీర - కట్టుబొట్టుతో కనిపించే ఈ భామ ప్రస్తుతం వెకేషన్‌లో బీచ్‌ల చుట్టూ తిరుగుతోంది. తన ఒంపు సొంపులను ఫోటోల్ని తీయించుకుని.. వాటిని ఎంచక్కా ఆన్‌లైన్‌లో పెట్టేస్తుంది. అమ్మడి అందాలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

   ట్రైలర్ లాగ అందాలు చూపాల్సిందే

  ట్రైలర్ లాగ అందాలు చూపాల్సిందే

  హీరోయిన్లు.. ముఖ్యంగా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో పాతుకుపోవడానికి ఉన్నది ఒకటే దారి. ట్యాలెంట్ ఉన్నా సరే.. కుర్ర భామలు అందాలు ఆరబోస్తే.. డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంట్రీ ఇచ్చే సుందరాగులు బాగానే వంట బట్టించుకుంటున్నారు. అందుకే అవకాశం రాగానే విచ్చలవిడిగా వయ్యారాలు ఒలకబోసేస్తున్నారు. సినిమాకు ముందు టీజర్ లాగ..సోషల్ మీడియాలో ఈ రెచ్చిపోయిన ఫొటోలు పెట్టి ఎట్రాక్ట్ చేస్తున్నారు

   గ్లామర్ ప్రదర్శనకేనా

  గ్లామర్ ప్రదర్శనకేనా

  జాదూగాడు అంటూ నాగశౌర్యకు హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి సోనారికా భడోరియా రూట్ ఒకవైపే ఉంది. కనీసం నటన అనే రెండోవైపు చూపించేందుకు పెద్దగా ట్రై చేయడం లేదనే విమర్శలు ఉన్నా.. అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. దీనికి కారణం అమ్మడి అందాల ఆరబోతే. స్పీడున్నోడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన కూడా ఇదే రూట్ ఫాలో అయింది. రీసెంట్ గా విడుదలైన ఈడో రకం ఆడో రకం మూవీలో మంచు విష్ణుకు జంటగా నటించింది సోనారిక.

   దెముడుకు దణ్ణం పెట్టే షాట్ కూడా క్లీవేజే

  దెముడుకు దణ్ణం పెట్టే షాట్ కూడా క్లీవేజే

  మంచు విష్ణుతో చేసిన ఈడో రకం ఆడో రకంలో అయితే.. సోనారిక విశ్వరూపం చూపించేసింది. అది కూడా అందాల ఆరబోతలోనే కావడం విశేషం. మూవీ మొత్తం మీద అమ్మడు కనిపించే ఏ సీన్ లో అయినా సరే.. క్లీవేజ్ షో కంపల్సరీ. ఆఖరికి దేవుడికి దండం పెట్టుకునే సీన్ లో కూడా ఎద అందాలను ఒలకబోస్తూనే ఉంది. అదీ ఆ రేంజిలో అందాలు ఒలకపోయాలని ఫిక్స్ అయ్యిందన్నమాట పాప.

   అంతా ఇప్పుడే చూపిస్తే ...

  అంతా ఇప్పుడే చూపిస్తే ...

  మరి ఇలా గ్లామర్ ప్రదర్శనే..నేటి సినిమా ట్రెండ్, ఫ్యాషన్ అనుకుందో.. లేక వచ్చిన ఛాన్స్ వదలకూడదని అనుకుందో కానీ.. విచ్చలవిడిగా క్లీవేజ్ షో చేసేసింది. అందాల ఆరబోత ఓకే కానీ.. మరీ ఇంత ఎక్కువగా చూపించేస్తే.. తర్వాత చూపించడానికి ఇంకేముంటుంది అనే క్వశ్చన్ రెయిజ్ అవుతోంది. జర జాగ్రత్త సోనారికా. అంటున్నారు సీనియర్స్.

   మొదటి రెండూ డిజాస్టర్స్

  మొదటి రెండూ డిజాస్టర్స్

  తెలుగులో ఈ కుర్రభామ నటించిన మొదట రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫట్ మన్నాయి. జాదూగాడు అంటూ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు.. అరంగేట్రంలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత స్పీడున్నోడు అంటూ మరో చిత్రంతో వచ్చినా.. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా షాక్ ఇచ్చాడు. దీంతో ఇక అమ్మడి కెరీర్ అటకెక్కేసినట్లే అనుకుంటున్న టైంలో మంచు విష్ణు సరసన ఈడో రకం ఆడో రకంలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమా మాత్రం హిట్టైంది కానీ ఆఫర్స్ మాత్రం తెచ్చి పెట్టలేదు.

   బీచ్ బొమ్మలకు తెగ డిమాండ్

  బీచ్ బొమ్మలకు తెగ డిమాండ్

  మహాదేవ్ సీరియల్ లో పట్టుచీర - కట్టుబొట్టుతో అంత సాంప్రదాయంగా కనిపించే సోనారిక.. రియల్ లైఫ్ లో మాత్రం బాగా హాట్ గా కనిపించడానికే ఇష్టపడుతుంది. ఆ మధ్యన వెకేషన్ లో ఉన్న ఈ సుందరాంగి.. బీచ్ లలో షికార్లు కొట్టింది. తన ఒంపు సొంపులను ఫోటోలు తీసుకుని తీయించుకుని.. వాటిని ఆన్ లైన్ లో పెట్టేయడానికి ఏ మాత్రం సందేహించ లేదు సోనారిక.

  చీర కట్టిన పాత్రలే చేసింది

  చీర కట్టిన పాత్రలే చేసింది

  అమ్మడు నటించిన మొదటి సీరియల్ 'తుమ్ దేనా సాథ్ మేరా' క్లిక్ కాకపోయినా.. ఈమె అందానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆ వెంటనే.. 'దేవోం కీ దేవ్.. మహాదేవ్' సీరియల్ లో పార్వతీ దేవిగా నటించే ఆఫర్ వచ్చింది. ఈ రోల్ తో పాటు సీరియల్ బాగా క్లిక్ అవడంతో.. సోనారిక సెటిల్ అయిపోయింది. ఈ సీరియల్ ఎఫెక్ట్ తో సోనారికా భడోరియాకు అన్నీ శారీ టైపు పాత్రలే వచ్చాయి.

   బాడీ షేపులతో షాక్ ఇస్తోంది

  బాడీ షేపులతో షాక్ ఇస్తోంది

  టీవీ తెరపై పవిత్రంగా కనిపించే ఈ భామను ఇంత హాట్ గా చూసేసరికి జనాలకు మతి పోతోంది. ఏమైనా అటు పద్ధతైన పాత్రలకు ఇటు బికినీవేర్ కు తగినట్లుగా బాడీ షేపులు ఉండడం.. సోనారిక స్పెషాలిటీ కదూ అంటూ మురిసిపోతున్నారు. మీడియా సైతం ఈ భామకు మంచి పబ్లిసిటీనే ఇచ్చింది. అయితే ఆ పబ్లిసిటీ తనకు పాత్రలు తెచ్చి పెట్టడానికి మాత్రం పనికిరావటం లేదంటోంది.

   ఆ మాత్రం హాట్ లేకపోతే ఎలా ..

  ఆ మాత్రం హాట్ లేకపోతే ఎలా ..

  రీసెంట్ గా ఈడోరకం ఆడోరకం సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ రీసెంట్ గా జాలీ ట్రిప్ లో బికిని ఫోజులతో సెగలు పుట్టిస్తుంది. సోనారికానే ఇలా రెచ్చిపోయింది అన్న డౌట్ కలగక మారదు. అయితే తనను కేవలం హోమ్లీ పాత్రల్లో చూపిస్తున్నారని.. ఆ ఇమేజ్ ను మార్చుకుని తనలోని ఉన్న ఈ యాంగిల్ ను కూడా వాడుకోమని హింట్ ఇస్తుంది సోనారికా. అందుకే బికిని స్టిల్స్ తో చూపరులను ఎట్రాక్ట్ చేస్తుంది.

  English summary
  Small screen actress Sonarika Bhadoria, who is quite popular because of her toned body and gorgeous looks, is all set to make her Bollywood debut with 'Saansein.' The actress who was last seen sharing screen space with Mohit Raina in Life OK's popular showe Devon Ka Dev...Mahadev, has been off the small screen for three years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X