For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu:ఆ ఇద్దరి డ్యాన్స్​కు మహేశ్​ బాబు ఫిదా.. ఊహించని సర్​ప్రైజ్ గిఫ్ట్​!

  |

  సూపర్​ స్టార్​ కృష్ణ నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన మహేశ్​ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్​ సంపాదించుకున్నాడు. హిట్​లు, ఫట్​లు అని ఆలోచించకుండా ప్రయోగాత్మక సినిమాలను ఎంకరేజ్​ చేస్తుంటాడు. ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చూసుకుంటూ పోయే హీరోగా ముద్ర వేసుకున్నాడు. అంతేకాకుండా అనేక మంది చిన్నారులకు హార్ట్​ ఆపరేషన్స్​ నిర్వహించి సరిలేరు తనకెవ్వరూ అని రియల్ సూపర్ స్టార్​ అనిపించుకున్నాడు. తాజాగా ఓ ఇద్దరు డ్యాన్స్ షో కంటెస్టెంట్స్​కు అదిరిపోయే బహుమతి ఇచ్చి నిజమైన రాజకుమారుడని మరోసారి నిరూపించాడు.

  పాన్​ ఇండియా స్థాయిలో..

  పాన్​ ఇండియా స్థాయిలో..

  ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయం అందుకున్న సూపర్​ స్టార్ మహేశ్ బాబు వరుస సనిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడు. మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో ఓ సినిమా, దర్శక ధీరుడు రాజమౌళితో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జక్కన్నతో తెరకెక్కించే మూవీని పాన్​ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.

  గారాల కూతురు సితారతోపాటు..

  గారాల కూతురు సితారతోపాటు..

  ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేశాడు. అది కూడా ఆయన గారాల కూతురు సితారతో కలిసి. ప్రముఖ టీవీ ఛానెల్​ జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్ షోకి మంచి స్పందన లభిస్తోంది. ఈ షోలోలని ఓ ఎపిసోడ్​లో సితారతో కలిసి మహేశ్ బాబు దర్శనమివ్వనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్​గా మారింది.

  డ్యాన్స్​కు మహేశ్​ బాబు ఫిదా..

  డ్యాన్స్​కు మహేశ్​ బాబు ఫిదా..

  అయితే ఈ షోలో పార్టిస్​పేట్​ చేసే ఇద్దరు కంటెస్టెంట్లకు మహేశ్​ బాబు అదిరిపోయే గిఫ్ట్​ ఇచ్చాడు. ఈ షోలో బాబు అండ్​ కుమార్​ చేసిన డ్యాన్స్​కు ఫిదా అయిన మహేశ్ బాబు వారికి ఒక ఆఫర్​ ఇచ్చాడు. ''మీకు హ్యాట్సాఫ్​. మీరు నటించలేదు. జీవించేశారు. నేను చేసే సినిమా గానీ, నేను తీసే సినిమాలో గానీ మీకు కచ్చితంగా అవకాశం ఇస్తాను'' అని తెలిపాడు.

  సితార సైతం..

  సితార సైతం..

  ఈ ఒక్క మాటతో స్టేజ్​ అంతా చప్పట్లో మారుమోగిపోయింది. తమకు అవకాశం ఇస్తా అన్న మహేశ్ బాబు కాళ్లపై బాబు అండ్​ కుమార్​ పడగా, వారిని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు మహేశ్ బాబు. అలాగే ఇందులో పాల్గొన్న సితార సైతం వారి డ్యాన్స్​ పెర్ఫామెన్స్​ను ''ఇట్ వాస్​ మైండ్​ బ్లోయింగ్'' అంటూ పొగిడింది.

  వచ్చే ఏడాది మార్చిలో..

  ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్​తో తెరకెక్కుతున్న చిత్రం చిత్రీకరణను ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్​లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే విడుదలపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తప్పకుండా అనుకున్న సమయానికి వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అధికారికంగా స్పష్టతనిచ్చారు.

  అత్యధిక బడ్జెట్​తో..

  అత్యధిక బడ్జెట్​తో..

  త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ వెంటనే రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు మహేశ్​ బాబు. ఆ ప్రాజెక్ట్ మహేశ్ బాబు కెరీర్​లోనే అత్యధిక బడ్జెట్​తో వెండితెరపైకి రానుంది. సుమారు రూ. 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో ప్రముఖ హీరో కనిపిస్తాడని టాక్ కూడా నడుస్తోంది.

  English summary
  Tollywood Super Star Mahesh Babu And His Daughter Sitara Entry In Zee Telugu Dance India Dance Show. And Gives An opportunity To Two Contestants Babu And Kumar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X