For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ షోపై పెరిగిన డౌట్స్: ఆ కంటెస్టెంట్ విషయంలో హౌస్‌మేట్స్ కావాలనే అలా చేశారా.!

  By Manoj
  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే షోకూ దక్కని రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్. ఉత్తరాది నుంచి వచ్చినప్పటికీ.. ఈ షోను మన ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అందుకే ఇది మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఈ మధ్యనే నాలుగో సీజన్‌ను సైతం మొదలెట్టారు నిర్వహకులు. ఎన్నో అంచనాల నడుమ మొదలైన ఈ సీజన్‌కు సైతం మంచి స్పందనే వస్తోంది. అదే సమయంలో షోపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సంఘటన బిగ్ బాస్ షోపై అనుమానాలను పెంచేసింది. ఆ వివరాలు మీకోసం.!

  ఆరంభం నుంచే అదుర్స్ అనేలా

  ఆరంభం నుంచే అదుర్స్ అనేలా

  బిగ్ బాస్ షో అంటేనే తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ షో ఎన్నో రికార్డులను కొల్లగొట్టడంతో పాటు వివాదాలకూ కేంద్ర బిందువులా మారడమే. అయితే, ఈ మధ్య మొదలైన నాలుగో సీజన్ మాత్రం వివాదాలు లేకుండానే ప్రసారం అవుతోంది. అదే సమయంలో ఆరంభం నుంచే అదుర్స్ అనేలా రేటింగ్ సాధిస్తూ నెంబర్ వన్ షోగా నిలుస్తోంది.

  పంథా మార్చుకున్న బిగ్ బాస్

  పంథా మార్చుకున్న బిగ్ బాస్

  ఒకే రకమైన టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాకులు, ఫైటింగ్‌లు ఇలా గత మూడు సీజన్లు మొత్తం ఒకే తరహాలో నడిచినట్లు కనిపించాయి. దీంతో షోపై విమర్శలు కూడా చెలరేగాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్నారో ఏమో కానీ, ఈ సారి మాత్రం షో విషయంలో నిర్వహకులు పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే బిగ్ బాస్ నిర్ణయాలన్నీ సరికొత్తగా ఉంటున్నాయి.

  ఫెయిల్ అయినా తగ్గని రెస్పాన్స్

  ఫెయిల్ అయినా తగ్గని రెస్పాన్స్

  నాలుగో సీజన్ ప్రారంభం నుంచే మంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. మధ్యలో కొంత చప్పగా సాగినప్పటికీ నిర్వహకులు తీసుకొస్తున్న కొత్త టాస్కులతో రేటింగ్ మాత్రం ఒకే విధంగా వస్తోంది. ఇక, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎలిమినేషన్లు ఇలా సీక్రెట్‌గా ఉంచాలనుకున్న కొన్ని అంశాలు ముందే లీకైనప్పటికీ.. అది రేటింగ్ మీద ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.

  ఆ విషయంలో షోపై విమర్శలు

  ఆ విషయంలో షోపై విమర్శలు

  బిగ్ బాస్ షో అంతా పక్కాగా ఉంటుందని నిర్వహకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఓటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రతి ఎపిసోడ్‌లో హోస్ట్‌తో వివరిస్తున్నారు. అయినప్పటికీ ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా షోపై విమర్శలు వస్తున్నాయి.

  Good Luck Sakhi Movie Also in OTT : Keerthy Suresh
  బిగ్ బాస్ షోపై పెరిగిన డౌట్స్

  బిగ్ బాస్ షోపై పెరిగిన డౌట్స్

  బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లొచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు ‘లోపల జరిగేది నిజమేనా..? డైరెక్షన్ ప్రకారమే షో నడుస్తుందా' అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాళ్లంతా ఇది రియాలిటీ షోనే అని కచ్చితంగా చెబుతున్నారు. అయితే, షోలో జరిగే కొన్ని పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అఖిల్ వ్యవహారంలో కూడా అలాగే జరగడంతో ప్రేక్షకుల్లో సందేహాలు పెరిగాయి.

  హౌస్‌మేట్స్ కావాలనే అలా చేశారా.!

  హౌస్‌మేట్స్ కావాలనే అలా చేశారా.!

  బుధవారం ఎపిసోడ్‌లో.. షో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారని తెలిసినా కొందరు కంటెస్టెంట్లు.. తమ స్నేహితులనే నామినేట్ చేశారు. అలాగే, అందరూ కలిసి ఈ వారం నామినేట్ అవని అఖిల్‌ను ఎంచుకున్నారు. దీంతో షో మొత్తం డైరెక్షన్‌ ప్రకారమే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  English summary
  Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X