»   »  చిరు కుమ్ముడు.. మీలో ఎవరు కోటీశ్వరుడు.. 50 లక్షల నుండి జారిపడ్డ సోమిరెడ్డి!

చిరు కుమ్ముడు.. మీలో ఎవరు కోటీశ్వరుడు.. 50 లక్షల నుండి జారిపడ్డ సోమిరెడ్డి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్. ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా టెలివిజన్ యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. తొలి ఎపిసోడ్‌లోనే టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. బుల్లితెరపై చాలా ఈజ్‌తో ఆకట్టుకొన్నారు. జాతీయ స్థాయిలో గొప్ప కార్యక్రమంగా ఇప్పటికే ముద్ర వేసుకొన్న కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రొగ్రాం తెలుగు వెర్షన్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వారంలో నాలుగు రోజులు ప్రతీ ఇంటికి చిరంజీవి మరింత చేరువకానున్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రసారం కానున్నది.

 సగటు వ్యక్తి కలలను నెరవేర్చే జీవిగా చిరంజీవి

సగటు వ్యక్తి కలలను నెరవేర్చే జీవిగా చిరంజీవి


సగటు వ్యక్తి ఆశలను నెరవేర్చే జీవిగా చిరంజీవి బుల్లితెరపై కనిపించడం అభిమానులకు కొత్త వరమని చెప్పవచ్చు. తొలి ఎపిసోడ్‌లో తొలి కంటెస్టెంట్ సోమిరెడ్డితో వ్యవహరించిన తీరు బాగా ఆకట్టుకొన్నది. ఈ కార్యక్రమంలో తొలుత కొంత తడబాటు కనిపించినా మెగాస్టార్ వెంటనే సరిదిద్దుకొని ప్రొగ్రాంలో భాగమయ్యారు. ఆటలో భాగంగా భావోద్వేగానికి లోనవుతూ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రాంలో తనదైన ముద్ర వేసుకొన్నారు.

 చిరంజీవి మీరు భేష్.. బిగ్ బీ ప్రశంస

చిరంజీవి మీరు భేష్.. బిగ్ బీ ప్రశంస


‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తనకు అత్యుత్తమ ప్రశంస బిగ్ బీ అమితాబ్ నుంచి వచ్చిందని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగా చేశావు అని అమితాబ్ చెప్పడం చాలా సంతోషమేసిందని ఆయన అన్నారు. అమితాబ్ ప్రశంస తనకు సర్టిఫికెట్ లాంటిది అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన సిద్ధార్థ్ బసు కూడా బాగా చేశావని చెప్పడం గర్వంగా ఉందని తెలిపారు.

 తొలి ఎపిసోడ్‌లోనే రికార్డు

తొలి ఎపిసోడ్‌లోనే రికార్డు


చిరంజీవి ప్రారంభించిన తొలి ఎపిసోడ్‌లోనే మొదటి కంటెస్టెంట్ సోమిరెడ్డి బ్రహ్మండమైన ప్రతిభను ప్రదర్శించారు. ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా 14 ప్రశ్నలకు చకచకా సమాధానం చెప్పారు. కోటి రూపాయలు ఇచ్చే 15వ ప్రశ్న వరకు దూసుకుపోయాడు. సోమిరెడ్డి దూకుడును కట్టడి చేసేందుకు చిరంజీవి చాలా మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే చివరి ప్రశ్నకు సమాధానం తప్పుగా చెప్పిన సోమిరెడ్డి రూ.50 లక్షల నుంచి రూ.3.20 లక్షలకు పడిపోయాడు.

 నాగార్జున స్థానంలో చిరంజీవి

నాగార్జున స్థానంలో చిరంజీవి


కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి తెలుగు వెర్షన్‌గా వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి రెండు భాగాలకు కింగ్ నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా నాగార్జున తనదైన శైలిలో ఆకట్టుకొన్నారు. తాజాగా నాగార్జున స్థానంలో అత్యంత ప్రజాదరణ ఉన్న చిరంజీవికి అవకాశం ఇచ్చారు.

 2000లో బిగ్ బీ హోస్ట్‌గా కేబీసీ గేమ్ షో

2000లో బిగ్ బీ హోస్ట్‌గా కేబీసీ గేమ్ షో


తొలిసారి 2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ షోను అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ప్రారంభించారు. ప్రారంభమైన మొదటి రోజు నుంచే విశేష ఆదరణ చూరగొన్నది. తొలుత దీని ప్రైజ్ మనీ కోటి రూపాయలు. ఆ తర్వాత 2001లో ఈ ప్రైజ్ మనీని రెండు కోట్లకు పెంచారు. నాలుగో సీజన్ నుంచి ప్రైజ్ మనీని రెండు కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచారు.

English summary
Megastar Chiranjeevi is in new role on Television. He is become host of Meelo Evaru Kotishwarudu. His first episode gets good response from audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu