For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ షోలో చిరంజీవికి షాక్: ఫూల్‌ను చేస్తారా అంటూ సుమపై ఫైర్.. ఆయన కెరీర్‌లోనే తొలిసారి ఇలా!

  |

  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన.. వరుసగా సినిమాలను చేస్తూ వచ్చారు. అయితే, మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న చిరు.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస చిత్రాలతో దూసుకెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే 'వాల్తేరు వీరయ్య'గా వచ్చి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో పాల్గొన్న చిరంజీవి.. యాంకర్ సుమపై సీరియస్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

   ‘వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి

  ‘వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి

  టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

  శృతి మించిన హీరోయిన్ హాట్ షో: బట్టలున్నా లేనట్లే.. మొత్తం కనిపించేలా!

  డబుల్ సెంచరీకి చేరువగానే

  డబుల్ సెంచరీకి చేరువగానే


  మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కలయికలో తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లతో టార్గెట్‌ను పూర్తి చేసింది. అంతేకాదు, మరికొద్ది రోజుల్లోనే రూ. 200 కోట్లు గ్రాస్ మార్కును కూడా చేరబోతుంది.

  ప్రమోషన్ కోసం సుమ షోలో

  ప్రమోషన్ కోసం సుమ షోలో


  ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీని దర్శకుడు బాబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ చాలా ప్లాన్లే చేసింది. ఇందులో భాగంగానే చాలా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు నిర్వహించింది. అలాగే, చిరంజీవి ఏకంగా సుమ హోస్ట్ చేస్తోన్న 'సుమ అడ్డా' షోలో కూడా పాల్గొన్నారు.

  హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!

  కెరీర్‌లోనే తొలిసారి కామెడీగా

  కెరీర్‌లోనే తొలిసారి కామెడీగా


  సుమ కనకాల హోస్ట్ చేస్తోన్న 'సుమ అడ్డా' షోలోకి గెస్టుగా వచ్చిన చిరంజీవి.. ఎంతో సందడి చేశారు. మరీ ముఖ్యంగా ఆయన కెరీర్‌లోనే ఎప్పుడూ చూడని విధంగా పంచులు, కౌంటర్లతో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న వాళ్లతో పాటు యాంకర్ సుమ కూడా నోట మాట లేకుండా కనిపించింది. ఇలా ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆయన వన్ మ్యాన్ షో చేసి ఔరా అనిపించారు.

  రాఘవేంద్రరావు.. చిరు షాక్

  రాఘవేంద్రరావు.. చిరు షాక్


  ఎంతో సందడిగా సాగిన సుమ అడ్డా షోలో భాగంగా యాంకర్ సుమ 'చిరంజీవి గారు మన ఎపిసోడ్‌కు వచ్చిన సందర్భంగా ఇంకో స్పెషల్ గెస్టు కూడా వస్తున్నారు. చిరంజీవి గారికి చాలా చాలా ఆప్తులు.. వెల్‌కం టూ సౌందర్యలహరి' అని రాఘవేంద్రరావు వస్తున్నట్లు చెప్పింది. కానీ, ఆయన స్థానంలో జబర్ధస్త్ గెడ్డం నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో చిరు షాక్ అయ్యారు.

  బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

  పిలిచి ఫూల్‌ను చేస్తారా అని

  పిలిచి ఫూల్‌ను చేస్తారా అని


  గెడ్డం నవీన్‌ను నిజంగానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అని భావించిన చిరంజీవి.. ఆయనను గౌరవించాలన్న ఉద్దేశంతో లేచి నిల్చున్నారు. కానీ, ఆ వెంటనే తేరుకుని కూర్చున్నారు. తర్వాత యాంకర్ సుమతో మెగాస్టార్ 'ఆయన వచ్చారని గౌరవంతో ధన్‌మని లేచాను. షోకు పిలిచి ఇంత ఫూల్‌ను చేస్తారనుకోలేదు' అంటూ ఫన్నీగానే సీరియస్ అయ్యారు.

  ఇంతకీ ఏం చేశావ్ అంటూ

  ఇంతకీ ఏం చేశావ్ అంటూ


  ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గెటప్‌లో జబర్ధస్త్ గెటప్ శ్రీను ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఐదారు నిమిషాల పాటు అతడు బాస్‌తో పాటు అక్కడున్న వాళ్లందరినీ తన కామెడీతో నవ్వించాడు. ఇదంతా బానే ఎంజాయ్ చేసిన చిరంజీవి చివర్లో 'శ్రీను ఇంతకీ నువ్వు ఎవరి పాత్రను చేశావో చెప్పు' అంటూ ఫన్నీగా పంచ్ వేశారు. దీంతో గెటప్ శ్రీను ఒక్కసారిగా షాకైపోయాడు.

  English summary
  Megastar Chiranjeevi Serious on Anchor Suma in Suma Adda Show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X