For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెహబూబ్‌కు మెగా మూవీలో ఛాన్స్: చిరంజీవి చొరవతో క్యారెక్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్

  |

  మెహబూబ్ దిల్‌సే... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. యాక్టింగ్, డ్యాన్స్ మీదున్న ఆసక్తితో వీడియోలను చేస్తూ ఎంతగానో ఫేమస్ అయ్యాడతను. ఈ క్రమంలోనే కొన్ని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ వల్లే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టాడు. ఆ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా.. గుర్తింపు మాత్రం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి చొరవతో మెహబూబ్ ఓ సినిమా ఛాన్స్ కూడా పట్టేశాడని సమాచారం. ఆ వివరాలు మీకోసం.!

  సోషల్ మీడియా నుంచి బిగ్ బాస్‌లోకి

  సోషల్ మీడియా నుంచి బిగ్ బాస్‌లోకి

  సోషల్ మీడియాలో వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు గుంటూరు కుర్రాడు మెహబూబ్. స్టైలిష్ సాంగ్‌తో షోలోకి ప్రవేశించిన అతడు.. దీని వల్ల ఎంతగానో పాపులారిటీని అందుకున్నాడు. అంతేకాదు, లోపలికి వచ్చినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పలు గొడవల్లోనూ భాగమై హాట్ టాపిక్ అయ్యాడు.

  ఆట అదిరింది.. మధ్యలోనే ఎలిమినేట్

  ఆట అదిరింది.. మధ్యలోనే ఎలిమినేట్

  బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు మంచిగా ఆడే వారిలో మెహబూబ్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతలా అతడు ప్రతి టాస్కులోనూ అదరగొట్టేసేవాడు. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్స్‌లో ఉన్నా ప్రేక్షకుల మద్దతుతో తప్పించుకోగలిగాడు. కానీ, హౌస్‌లో జరిగిన కొన్ని గొడవల వల్ల చెడ్డపేరుతో ఊహించని విధంగా సీజన్ మధ్యలోనే షో నుంచి బయటకు వచ్చేశాడు.

  ఫ్రెండ్‌షిప్‌ కోసం సపోర్ట్.. చీటింగ్ చేస్తూ

  ఫ్రెండ్‌షిప్‌ కోసం సపోర్ట్.. చీటింగ్ చేస్తూ

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెహబూబ్.. సయ్యద్ సోహెల్ రియాన్‌కు బాగా సపోర్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతడి కోసం ప్రచారం కూడా నిర్వహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలే వీక్‌లో జరిగిన రీయూనియన్ పార్టీలో సోహెల్‌కు ‘మూడో స్థానంలో ఉన్నావు.. డబ్బులు తీసుకో' అన్నట్లుగా సైగలు చేశాడన్న వీడియోతో చెడ్డపేరును మూటగట్టుకున్నాడు.

  ఫినాలే స్టేజ్‌పై చెక్ ఇచ్చిన చిరంజీవి

  ఫినాలే స్టేజ్‌పై చెక్ ఇచ్చిన చిరంజీవి

  గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవి.. మెహబూబ్‌ను ఉద్దేశించి ‘మెహబూబ్‌ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది.. సినిమాల్లోకి రావాలని నా చిన్నప్పుడు ఎలా తపన చెందానో నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టే ఉంది. యు ఆర్ ఎ డైనిమిక్ బాయ్.. అద్భుతమైన కొరియోగ్రఫీ' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, రూ. 10 లక్షల చెక్ కూడా ఇచ్చారు.

  సినిమా ఛాన్స్ పట్టేసిన మెహబూబ్

  సినిమా ఛాన్స్ పట్టేసిన మెహబూబ్

  బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్‌ను రెండింతలు చేసుకున్నాడు మెహబూబ్. ఫినాలే ఎపిసోడ్‌లో చిరంజీవి చేసిన కామెంట్లతో అతడు మరింత హైలైట్ అయ్యాడు. దీంతో ఈ యంగ్ సెన్సేషన్‌కు ఆఫర్లు వెల్లువెత్తేలానే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాల దర్శక నిర్మాతలు అతడితో ఇప్పటికే సంప్రదింపులు జరిపారట. ఈ క్రమంలోనే చిరంజీవి మూవీలో ఛాన్స్ పట్టేశాడని టాక్.

  చిరంజీవి చొరవతో ఆ సినిమాలో ఛాన్స్

  చిరంజీవి చొరవతో ఆ సినిమాలో ఛాన్స్

  మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మెహబూబ్ చిన్న పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన మెగా హీరో... దర్శకుడితో చెప్పి ఓ స్పెషల్ రోల్ క్రియేట్ చేయించారని తెలిసింది. దీంతో మెహబూబ్.. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

  English summary
  Mehaboob Dil Se (Bigg Boss Telugu 4) Wiki, Age, Height, Girlfriend, Net Worth Mehaboob Dil se is a famous Youtuber who started with a career with Dance videos. He got popularity with his dance videos and short comedy skits. Table Of Contents
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X