»   »  వాలంటైన్స్ డే రోజు.... చిరంజీవి సెల్ఫీ చూసారా (ఫోటోస్)

వాలంటైన్స్ డే రోజు.... చిరంజీవి సెల్ఫీ చూసారా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ద్వారా బెల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. 4వ సీజన్లో భాగంగా సోమవారం రాత్రి ప్రసారం అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' తొలి షోకు అనూహ్య స్పందన వచ్చింది. రేటింగ్ కూడా భారీగానే వచ్చినట్లు టాక్.

కాగా... చిరంజీవి హోస్ట్ చేస్తున్న ఈషోలో ఇకపై ప్రముఖ స్టార్స్ అందరూ సందడి చేయబోతున్నారు. చాలా మంది ఈ షోలో మెగాస్టార్ తో కలిసి పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా మార్చి మొదటి వారంలో ప్రసారం అయ్యే షోలో అలనాటి హీరోయిన్స్ రాధిక, సుహాసిని, సుమలత సందడి చేయబోతున్నారు.

తాజాగా ఈ షోకు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారితో దిగిన సెల్ఫీని మెగాస్టార్ షేర్ చేసారు. కాకతాళీయంగా ఈ రోజు వాలంటైన్స్ డే కూడా కావడంతో ఈ ఫోటోలు హాట్ టాపిక్ అయింది.

 వెండితెరపై

వెండితెరపై

రాధిక, సుహాసిని, సుమలత ఒకప్పుడు చిరంజీవితో కలిసి నటించిన హీరోయిన్లు. వెండితెరపై అప్పట్లో మెగాస్టార్ తో కలిసి ఎన్నో లవ్ యాంగిల్స్ చూపించారు. రియల్ లైఫ్ లో ఈ ముగ్గురు హీరోయిన్లు చిరంజీవి ఫ్యామిలీకి చాలా క్లోజ్.

చిరంజీవి హోస్ట్ చేస్తుండటంతో

చిరంజీవి హోస్ట్ చేస్తుండటంతో

చిరంజీవి హోస్ట్ చేస్తున్న ఈ షోలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందగానే.....రాధిక, సుహాసిని, సుమలత వెంటనే ఒకే చెప్పారు. చిరంజీవితో వారికి మంచి ఫ్రెండ్షిప్ ఉండటం వల్లే తమ పనులు పక్కన పెట్టి చిరంజీవి కోసం వచ్చారు.

 ఉమెన్స్ డే స్పెషల్

ఉమెన్స్ డే స్పెషల్

ఉమెన్స్ డే స్పెషల్ గా ప్రసారం అయ్యే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలోగానీ ఈ ముగ్గురు స్టార్స్ కనిపించనున్నారు.

పెద్దన్న

పెద్దన్న

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో బాలయ్య, పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు చిరంజీవి తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. బాలయ్య గురించి హ్యాపీగానే స్పందించిన మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే కాస్త కోపానికి గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

/news/chiranjeevi-about-balakrishna-pawan-kalyan-056627.html

 తెలుగువారు సెంటిమెంటల్ ఫూల్స్, నాగార్జున వల్లే వ్యాపారంలోకి దిగా: చిరంజీవి

తెలుగువారు సెంటిమెంటల్ ఫూల్స్, నాగార్జున వల్లే వ్యాపారంలోకి దిగా: చిరంజీవి


హైదరాబాద్: చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వామ్యంలోని 'మా టీవీ' ప్రస్తుతం స్టార్ నెట్వర్క్ చేతిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 'మాటీవీ'గా ఉన్న ఈ ఛానల్ ఇపుడు స్టార్ మాటీవీ అయిపోయింది. ఈ మేరకు కొత్తగా లోగో కూడా లాంచ్ చేసారు. ఈ సందర్బంగా మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
After making his debut as a TV host for MEK4 yesterday, Megastar Chiranjeevi will take on today’s show with his yesteryear heroines Raadhika, Sumalatha, and Suhasini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu