అభిజీత్‌తో మాట్లాడొద్దు అన్నావ్.. నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావ్: అఖిల్‌కు మోనాల్ షాక్

బిగ్ బాస్ షోలో లవ్ ట్రాకులు నడుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగులో ఇప్పటి వరకూ ప్రసారం అయిన సీజన్లు అన్నింటిలోనూ ప్రేమ కహానీలు బాగా హైలైట్ అయ్యాయి. తాజాగా రన్ అవుతోన్న నాలుగో సీజన్‌లోనూ ఇవి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇందులో మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ జోడీ బాగా ఫోకస్ అవుతోంది. నిన్న మొన్నటి వరకూ కలిసి ఉన్న వీరిద్దరూ ఈ మధ్య దూరంగా ఉంటున్నారు. ఆట కూడా విడివిడిగా ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సార్థక్‌కు భారీ షాకిచ్చింది మోనాల్ గజ్జర్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

 వాళ్లిద్దరి మధ్యలోకి అఖిల్ ఎంటర్

వాళ్లిద్దరి మధ్యలోకి అఖిల్ ఎంటర్

నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్.. అభిజీత్‌తో చనువుగా ఉండేది. ఎక్కడ చూసినా వీళ్లిద్దరే కనిపిస్తూ ఉండేవారు. దీంతో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఈ జోడీ మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అభిజీత్‌కు దూరమై ఆమె అతడి వైపు వెళ్లిపోయింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు.

మోనాల్ కోసం ఏదైనా చేసేందుకు

మోనాల్ కోసం ఏదైనా చేసేందుకు

మోనాల్ గజ్జర్ విషయాన్ని అఖిల్ సార్థక్ బాగా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమె కోసం అర్జున్ రెడ్డి రేంజ్‌లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్‌లా ప్రవర్తించేవాడు. అంతేకాదు, ఆమెను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే ఎంట్రీ ఇచ్చి, వాళ్లతో గొడవలకు దిగేవాడు. ఒకానొక సందర్భంలో నామినేషన్ టాస్కులో మోనాల్ కోసం అభిజీత్‌తో పెద్ద యుద్దమే చేశాడు. దీంతో నాగార్జునతో చీవాట్లు తిన్నాడు.

ఆట మారడంతో దూరం పెరిగింది

ఆట మారడంతో దూరం పెరిగింది

నాలుగో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మూడు నాలుగు వారాలుగా మోనాల్ గజ్జర్ ఆటపై దృష్టి పెట్టింది. అందుకోసం అఖిల్‌ను సైతం లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే ప్రియుడిని ఓడించి మరీ హారికను కెప్టెన్‌గా చేసింది. ఆ తర్వాత ఈ విషయంలో గొడవలు కూడా జరిగాయి. దీంతో అఖిల్‌ను రెండుసార్లు నామినేట్ కూడా చేసింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య దూరం పెరిగింది.

ఆమెకు బాగా దగ్గరైన అఖిల్ సార్థక్

ఆమెకు బాగా దగ్గరైన అఖిల్ సార్థక్

మోనాల్ గజ్జర్ దూరం అవడంతో పాటు ఫినాలేకు చేరుకోవడంతో అఖిల్ సార్థక్ బాగా చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ, దేత్తడి హారికను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దీంతో పులిహోర రాజాగా పేరు సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్య హారికతో అతడు బాగా దగ్గరయ్యాడు. తరచూ ఆమెకు ముద్దులు కూడా పెడుతున్నాడు.

అఖిల్‌కు మోనాల్ గజ్జర్ బిగ్ షాక్

అఖిల్‌కు మోనాల్ గజ్జర్ బిగ్ షాక్

ఇటీవలి కాలంలో హారికతో క్లోజ్‌గా ఉంటోన్న అఖిల్ సార్థక్‌కు మోనాల్ గజ్జర్ బిగ్ షాక్ ఇచ్చింది. తాజా ఎపిసోడ్‌లో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. ‘మీరు ఎందుకు ఆమెతో క్లోజ్‌గా ఉంటున్నారు. కొంచెం అయితే కాదు.. చాలా దగ్గరగా ఉంటున్నారు. బాగా ఫ్లట్ చేస్తున్నారు. అప్పుడు నన్ను అభిజీత్‌తో మాట్లాడొద్దని ఇలా ఎందుకు చేస్తున్నారు' అని నేరుగా ప్రశ్నించింది.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
ఆ పర్సన్ నువ్వే.. నేను మారలేదు

ఆ పర్సన్ నువ్వే.. నేను మారలేదు

మోనాల్ మాటలకు షాకైన అఖిల్ సార్థక్.. ‘నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నా. నా కోసం నా లైఫ్‌లోకి వచ్చిందని అనుకున్న అమ్మాయే చాలా మారిపోయింది. అందుకే నేను వేరే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటున్నా. ఏంటి.. ఇప్పుడు ఆమెను సిస్టర్ అనాలా.? అభీ నీ గురించి చెడుగా మాట్లాడడని నిన్ను మాట్లాడొద్దని చెప్పా. నువ్వు నన్ను బ్యాడ్ చేయాలనుకోకు' అంటూ సీరియస్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X