Just In
- 2 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 27 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 11 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
Don't Miss!
- News
అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్‌కు కోలుకోలేని షాకిచ్చిన మోనాల్: అందులో అభిజీతే నెంబర్ వన్ అంటూ కామెంట్
బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్. కొన్ని సినిమాల్లో నటించినా దక్కని గుర్తింపు, ఈ రియాలిటీ షో వల్ల అందుకుంది. దీనికి కారణం హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఆమెను ఆటలో కొనసాగించడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయింది మోనాల్. బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. అభిజీత్‌కు జై కొట్టి అఖిల్‌కు భారీ షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ట్రైయాంగిల్ లవ్‌తో ఫుల్ పాపులర్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. హౌస్‌లోకి అడుగు పెట్టిన సమయం నుంచే అభిజీత్‌లో ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చింది. కొద్ది రోజులకు అతడితో పాటు అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో ఒకేసారి ఇద్దరితో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. తద్వారా ట్రైయాంగిల్ లవ్‌తో విపరీతంగా ఫేమస్ అయింది.

అఖిల్‌తో క్లోజ్.. ముద్దులు, హగ్గులు
రోజులు గడిచిన కొద్దీ మోనాల్ గజ్జర్.. అభిజీత్‌కు పూర్తిగా దూరమైపోయింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌కు మరింత దగ్గరైంది. సరిగ్గా అదే విషయాన్ని హోస్ట్ నాగార్జున ఓ రోజు ప్రస్తావించగా.. తన మనసులో A ఉన్నాడని చెప్పిందామె. దీంతో అఖిల్‌తో ప్రేమలో ఉందని అంతా ఫిక్సైపోయారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హగ్గులు, ముద్దులతో మరింతగా రెచ్చిపోయారు.

సొంతంగా ఆడింది.. దూరం జరిగింది
బిగ్ బాస్ షో తుది దశకు చేరుకున్న సమయంలో మోనాల్ గజ్జర్.. ఆటపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అఖిల్‌ను సైతం ఎదురించి ఆడుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో అతడిని ఓడించి మరీ హారికను కెప్టెన్ చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అఖిల్‌ను నామినేట్ చేసింది. దీంతో ఇద్దరూ మరింత దూరమయ్యారు.

ఫినాలేకు ముందు షో నుంచి ఔట్
గేమ్ కోసం అఖిల్ సార్థక్‌ను సైతం దూరం పెట్టిన మోనాల్.. చివర్లో మంచి ఆటతీరు కనబరిచింది. అయినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి బయటకు వచ్చేసింది. ఫినాలేకు ఒక వారం ముందే ఎలిమినేట్ అవడంతో ఆమె పెద్దగా బాధ పడలేదు. తన క్లోజ్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ టైటిల్ ఫైట్‌లో ఉండడం ఆమె సంతోషంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది.

అఖిల్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక, ఆమె పాల్గొంటోన్న ప్రతి ఇంటర్వ్యూలోనూ అఖిల్ సార్థక్‌తో ఉన్న ప్రేమ బంధం గురించి ప్రశ్నలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ చిట్ చాట్‌లో ఆమె అభిజీత్‌కు ఓటేసి ప్రియుడికి షాకిచ్చింది.

అందులో అభిజీతే నెంబర్ వన్ అంటూ
తాజా ఇంటర్వ్యూలో యాంకర్.. ఈ సీజన్‌లో బెస్ట్ ఫిజిక్ ఎవరికి ఉందని అడగగా.. అఖిల్ అని బదులిచ్చింది మోనాల్. ఆ తర్వాత హౌస్‌లో జెన్యూన్ పర్సన్ ఎవరు అన్న ప్రశ్నకు సోహెల్ అని సమాధానం చెప్పింది. ఇక, చివర్లో నాలుగో సీజన్‌లో హ్యాండమ్ పర్సన్ ఎవరు అని అడిగితే టక్కున అభిజీత్ పేరు చెప్పిందామె. దీంతో అఖిల్ సార్థక్‌కు మరోసారి భారీ షాకిచ్చినట్లైంది.