For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Most Wanted: నేరస్తుడిని పట్టించిన ఫేమస్ టీవీ షో.. థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు

  |

  సాధారణంగా బుల్లితెరపై వచ్చే షోలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలన్న లక్ష్యంతోనే వస్తుంటాయి. అందుకు తగ్గట్లుగానే నిర్వహకులు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని చూస్తుంటారు. అయితే, మరికొన్ని కార్యక్రమాలు మాత్రం వినూత్నంగా రూపొందుతుంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని రియాలిటీ షోలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. అలాంటి ఓ కార్యక్రమమే ఇప్పుడు ఏకంగా ఓ రేప్ అండ్ మర్డర్ కేసులో నేరస్తుడిని పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  15ఏళ్ల అమ్మాయిపై హత్యాచారం

  15ఏళ్ల అమ్మాయిపై హత్యాచారం

  కేరళకు చెందిన రాజేష్ (38) అనే వ్యక్తి.. 2013 వట్టపరా అనే ప్రాంతంలో నివాసం ఉంటోన్న ఓ 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ తర్వాత ఆమెను హత్త చేసి బంగారు నగలును దోచుకుని వెళ్లిపోయాడు. ఇది జరిగిన వారానికే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో అప్పుడే కేరళలోని సెషన్స్ కోర్టు అతడికి మరణ శిక్షను విధించింది.

  నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

  మరణ శిక్ష.. 25 ఏళ్లకు తగ్గించగా

  మరణ శిక్ష.. 25 ఏళ్లకు తగ్గించగా


  మరణ శిక్ష పడిన రాజేష్‌ను తిరువనంతపురంలోని పూజాపురలోని సెంట్రల్ జైలులో ఉంచారు. అక్కడ దాదాపు ఏడేళ్ల పాటు శిక్షను అనుభవించిన తర్వాత సెప్టెంబరు 17, 2020న కేరళ హైకోర్టు అతడికి విధించిన మరణ శిక్షను మారుస్తూ.. పెరోల్ లేకుండా 25 ఏళ్ల జైలు శిక్షగా మార్చింది. కానీ, అతడు జైలులో దొంగతనం, గొడవల పాల్పడ్డం వల్ల మరో రెండేళ్ల శిక్ష కూడా పడింది.

  కరోనా వల్ల మార్పు... పారిపోయి

  కరోనా వల్ల మార్పు... పారిపోయి

  కోర్టు విధించిన శిక్ష ప్రకారం జైలులో ఉంటోన్న రాజేష్‌ను కరోనా సమయంలో పూజాపురలోని సెంట్రల్ జైలు నుంచి ఓపెన్ జైలుకు మార్చారు. ఈ విషయాన్ని అక్కడ అధికారి వెల్లడించారు. 'కరోనా సమయంలో జైలులో రద్దీ కారణంగా మంచి ప్రవర్తన ఉన్న కొందరిని ఓపెన్ జైలుకు మార్చాం' అన్నారు. అలా మారిన వెంటనే రాజేష్ మరో వ్యక్తితో కలిసి తప్పించుకున్నాడు.

  Balakrishna Bollywood Entry: బాలీవుడ్‌లోకి బాలయ్య.. స్టార్ డైరెక్టర్ దిమ్మతిరిగే ప్లాన్

  పేరు మార్చుకుని... పెళ్లి కూడా

  పేరు మార్చుకుని... పెళ్లి కూడా

  ఓపెన్ జైలుకు మార్చిన తర్వాత నిందితుడు రాజేష్ అక్కడి నుంచి తప్పించుకుని కర్నాటక రాష్ట్రానికి పారిపోయాడు. అంతేకాదు, పేరు మార్చుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఉడిపిలోని ఓ ఎస్టేసులో రబ్బర్ ట్యాపర్‌గా పని చేస్తున్నాడు. ఎంత వెతికినా పోలీసులకు అతడి జాడ మాత్రం చిక్కలేదు. దీంతో సదరు నేరస్తుడు దర్జాగా తన కొత్త జీవితాన్ని సాగిస్తున్నాడు.

  మోస్ట్ వాంటెడ్ షోలో ప్రసారం

  మోస్ట్ వాంటెడ్ షోలో ప్రసారం

  కేరళలో మాతృభూమి అనే ఛానెల్‌లో 'మోస్ట్ వాంటెడ్' షో ప్రసారం అవుతోంది. ఇందులో భయానకమైన నేరాలు, మిస్టరీగా మారిన కేసులు, ఎప్పటికీ పట్టుబడని నేరస్థులు లేదా పట్టుబడిన తర్వాత తప్పించుకోగలిగిన వాళ్ల స్టోరీలను ప్రసారం చేస్తుంటారు. అలా రాజేష్ కథను కూడా ఇందులో ఇటీవలే చూపించారు. అందులో నేరస్తుడు ఫొటోగ్రాఫ్‌ను కూడా ప్రసారం చేశారు.

  Bigg Boss Elimination: 7వ వారం షాకింగ్ ఓటింగ్.. డేంజర్‌లో ఊహించని కంటెస్టెంట్లు.. టాప్‌లో మాత్రం!

  గుర్తించిన వ్యక్తి.. కంచికి చేరింది

  గుర్తించిన వ్యక్తి.. కంచికి చేరింది

  'మోస్ట్ వాంటెడ్ షోలో' వచ్చిన కథనాన్ని కొల్లూరుకు చెందిన ఓ వ్యక్తి.. జయాన్‌ (రాజేష్ కొత్త పేరు) గురించిన అసలు నిజాన్ని తెలుసుకున్నాడు. ఆ వెంటనే తన పోలీస్ మిత్రుడు ఎమ్‌సీ జోస్‌కు సమాచారం అందించాడు. దీంతో అతడు వచ్చి ఉడిపిలోని అధికారులను అప్రమత్తం చేసి.. తిరువనంతపురం పోలీసులు ఇచ్చిన సమాచారంతో రాజేష్‌ను అరెస్ట్ చేశారు.

  ఆ షోకు థ్యాంక్స్ చెప్పిన పోలీస్

  ఆ షోకు థ్యాంక్స్ చెప్పిన పోలీస్


  జైలు నుంచి తప్పించుకుని కొత్త జీవితాన్ని గడుపుతున్న నిందితుడిని టీవీ షో వల్ల పట్టుకోవడంతో ఇప్పడీ వార్త దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. దీంతో ఓ పోలీస్ అధికారి 'ఇది దాదాపుగా క్లోజ్ అయిన కేసు. అతడిని పట్టుకోవడానికి టీవీ షో మాకు చాలా ఉపయోగపడింది. నేరస్తుడి గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తికి కూడా రివార్డు అందజేస్తాము' అని మీడియాతో చెప్పుకొచ్చారు.

  English summary
  Kerala TV Channel Mathrubhumi Aired about Rape Case in Most Wanted Show. This Episode helps The State Police for caught the Culprit.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X