For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమదైన శైలి టాలెంట్లతో చాలా కాలంగా సందడి చేస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటుడు ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన అతడు.. ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ముక్కు అవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ అతడు పెళ్లాడబోయేది ఎవరిని? ఆ సంగతులు మీ అందరి కోసం!

   అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఫేమస్

  అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఫేమస్

  మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించాడు ముక్కు అవినాష్. హీరోల వాయిస్‌లు, బాడీ లాంగ్వేజ్‌లను అనుకరిస్తూ అలా స్టేజ్ షోలు, ఈవెంట్లలో దూసుకుపోతోన్న సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అలా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే అందులోకి ప్రవేశించిన అవినాష్.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందాడు. దీంతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా పొంది.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ కమెడియన్.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతూనే ఉన్నాడు.

  లైఫ్ ఇచ్చిన షోకు గుడ్‌బై.. బిగ్ బాస్‌లోకి

  లైఫ్ ఇచ్చిన షోకు గుడ్‌బై.. బిగ్ బాస్‌లోకి

  ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే.. ముక్కు అవినాష్‌కు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ వైపు వాటిని చేసుకుంటూనే.. షోలో కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో చిన్న పెద్ద హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దీనికి కారణం బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే. జోకర్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. ఆరంభంలోనే మెప్పించాడు. ఫలితంగా ఆరంభంలోనే మంచి గుర్తింపును, పేరును సంపాదించుకున్నాడీ కమెడియన్.

  అందులో నిరాశే ఎదురైంది.. పేరు మాత్రం

  అందులో నిరాశే ఎదురైంది.. పేరు మాత్రం

  జబర్ధస్త్ షో ద్వారా దక్కిన పాపులారిటీకి తోడు మంచి వ్యవహార శైలి ఉండడంతో ముక్కు అవినాష్ బిగ్ బాస్ షోలోకి వెళ్లిన సమయంలోనే అతడిని టైటిల్ ఫేవరెట్‌గా భావించారంతా. అందుకు అనుగుణంగానే అతడు చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. దీంతో ఈ యంగ్ కమెడియన్ టైటిల్ గెలవడం ఖాయం అన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో షో సగానికి చేరుకున్న తర్వాత గొడవల్లో భాగం అవుతూ.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొవడంతో పాటు ఎలిమినేట్ అయ్యాడు. కానీ, బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరును దక్కించుకున్నాడు.

   అందులో రచ్చ చేస్తోన్న ముక్కు అవినాష్

  అందులో రచ్చ చేస్తోన్న ముక్కు అవినాష్

  బిగ్ బాస్ షోలో విజయం సాధించకున్నా.. దాని పుణ్యమా అని ముక్కు అవినాష్ వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఈవెంట్లలో భాగం అయిన అతడు.. చాలా సినిమాల్లోనూ నటించాడు. అలాగే స్టార్ మాలో ప్రారంభమైన ‘కామెడీ స్టార్స్' అనే షోలోనూ భాగం అయ్యాడు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. చమ్మక్ చంద్ర, సద్దాం హుస్సేన్, హరి తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అవినాష్‌ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు.

  పెళ్లిపై కామెంట్స్.. ఎప్పుడూ అదే మాటతో

  పెళ్లిపై కామెంట్స్.. ఎప్పుడూ అదే మాటతో

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో ముక్కు అవినాష్ పెళ్లి అంశం తెగ హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం అతడు తరచూ తన వివాహం గురించే చర్చలు జరుపుతూ ఉండేవాడు. అదే సమయంలో ఆరియానా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించేవాడు. అంతేకాదు, షోలోకి వచ్చిన వాళ్ల అమ్మతో తన పెళ్లి చేయమని కోరాడు. దీంతో అవినాష్ పెళ్లి వార్త హైలైట్ అయిపోయింది. ఇక, బిగ్ బాస్ షో తర్వాత తరచూ ముక్కు అవినాష్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ యంగ్ కమెడియన్ వివాహం ఈ ఏడాదే జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

  నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్

  నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్

  తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తూ హవాను చూపిస్తోన్న జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబాలు కలుసుకున్నాయి.. తర్వాత మేము కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలా మంది చాలా సార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఓ పోస్టును కూడా పెట్టాడతను.

  Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
  అవినాష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు?

  అవినాష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు?

  ముక్కు అవినాష్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ ఈ విషయం చెప్పడంతో.. అందరూ అసలు అతడు చేసుకోబోయే అమ్మాయి ఎవరన్న దానిపై చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ అమ్మాయి పేరు అనూజ వాకిటి. అవినాష్ సమాజిక వర్గానికి చెందిన అమ్మాయే. ఈమె కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తుందట. ఇక, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది. ఈ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  English summary
  Jabardasth fame Self-made comedian Mukku Avinash Recently Engaged with Anuja vakiti. He Shared This News on Social Media with Engagement Photos.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X