Just In
- 39 min ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 1 hr ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 1 hr ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
- 2 hrs ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
Don't Miss!
- News
ఏపీ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు ... సంక్రాంతి సమయంలో బస్సుల వివాదం .. తెరపడిందిలా !!
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Sports
India vs Australia: భారీ షాక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్, జబర్ధస్త్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: శ్రీముఖి, గెటప్ శ్రీను వల్లే అలా చేశానంటూ ఆవేదన!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో జబర్ధస్త్‌ది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ కామెడీ షో.. టెలివిజన్ రంగంలో తనదైన ముద్రను వేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు మజాను పంచుతూనే ఉంది. అంతేకాదు, ఇండస్ట్రీకి ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేసింది. అలా వచ్చిన ఫేమస్ అయిన వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలం పాటు కామెడీ షోలో నవ్వించిన అతడు.. రియాలిటీ షోలో సందడి చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్, జబర్ధస్త్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

టాలెంట్‌ను గుర్తించి.. టీమ్ లీడర్‌ను చేసి
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు ముక్కు అవినాష్. ఈ క్రమంలోనే హీరోలను ఇమిటేట్ చేస్తూ సత్తా చాటేవాడు. ఇలా బజర్ధస్త్ టీమ్ దృష్టిలో పడ్డాడు. అప్పుడు అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు.. అవకాశం కల్పించారు. ఆ తర్వాత అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకోవడంతో అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చిందీ జబర్ధస్త్ యూనిట్.

జోకర్‌గా ఎంట్రీ... బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ
జబర్ధస్త్‌లోని బెస్ట్ కమెడియన్లలో ఒకడిగా వెలుగొందుతోన్న సమయంలో అవినాష్‌కు బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి ఆఫర్ వచ్చింది. ఇటీవలే ప్రసారం అయిన నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వాలని వాళ్లు అతడిని కోరారు. దీంతో షో ప్రారంభం అయిన రెండో వారంలో జోకర్ గెటప్‌తో అవినాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ రచ్చ రచ్చ చేసేశాడు.

లవ్ ట్రాకుతో మరింత ఫేమస్ అయ్యాడు
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచే తనదైన మార్క్ చూపించడానికి అవినాష్ ఎంతగానో ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అందరినీ ఆట పట్టిస్తూ, కామెడీని పంచుతూ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు. అదే సమయంలో ఆరియానా గ్లోరీతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. దీన్ని నిర్వహకులు కూడా హైలైట్ చేయడం మొదలుపెట్టారు.

అనూహ్యంగా బయటకు... చిరు కితాబు
వాస్తవానికి అవినాష్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతడు కచ్చితంగా ఫినాలేలో ఉంటాడని అంతా అనుకున్నారు. ఒకానొక సమయంలో టైటిల్ ఫేవరెట్ అని కూడా అన్నారు. కానీ, ఊహించని విధంగా 13వ వారంలోనే షో నుంచి బయటకు వచ్చేశాడు. ఇక, గత ఆదివారం జరిగిన ఫినాలేలో చీఫ్ గెస్ట్ చిరంజీవి.. అవినాష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్, జబర్ధస్త్‌పై సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ షో జరుగుతోన్న సమయంలో జబర్ధస్త్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అవినాష్. అయితే, అప్పుడు అదంతా సింపతీ గేమ్‌లో భాగంగానే మాట్లాడుతున్నాడని అంతా అనుకున్నారు. ఈ కారణంగానే అతడికి ఓట్లు కూడా వేయలేదు చాలా మంది. ఇక, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్, జబర్ధస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడీ టాలెంటెడ్ కమెడియన్.

శ్రీముఖి, గెటప్ శ్రీను వల్లే అలా చేశానని
అందులో మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ వాళ్లు నాకు పదే పదే ఫోన్లు చేశారు. షోకు రమ్మని కోరారు. దీనికి నేను ఒప్పుకున్నా. అయితే, వైల్డ్ కార్డ్ అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ అలానే లోపలికి పంపారు. ఇక, ఈ షోలోకి రావడానికి జబర్ధస్త్ వాళ్లకు రూ. 10 లక్షలు కట్టాను. శ్రీముఖి, గెటప్ శ్రీను, చెమ్మక్ చంద్ర నా బాధను తెలుసుకుని బదులిచ్చారు' అని ఆవేదన వ్యక్తం చేశాడు.