Don't Miss!
- News
"ఆర్ఆర్ఆర్" కు అవార్డుల పంట.. అరుదైన అకాడమీ అవార్డు దక్కించుకున్న రాజమౌళి సినిమా!!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Bigg Boss Winner: బిగ్ బాస్ విన్నర్ గా సింగర్ రేవంత్.. కూతురికి గిఫ్ట్ గా ట్రోఫీ!
ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా దేశంలోనే మరే షోకూ దక్కని రేటింగ్‌ను రాబడుతూ సత్తా చాటుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ఆసక్తికరంగా నేటితో పూర్తయింది. సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ డిసెంబర్ 18 ఆదివారం నాడు ముగిసింది. ఈ ఆరో సీజన్ కు ముందు నుంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు.

2017లో మొదటగా..
బిగ్
బ్రదర్
అనే
పేరుతో
అమెరికాలో
ప్రారంభమైన
రియాలిటీ
షో
ఎల్లలు
దాటి
ఇండియాలోకి
బిగ్
బాస్
గా
వచ్చింది.
రావడమే
కాకుండా
అశేషమైన
ప్రేక్షకాదరణ
పొందింది.
దీంతో
ముందుగా
హిందీలో
ప్రారంభమైన
ఈ
రియాలిటీ
షోను
క్రమేణా
మిగతా
భాషల్లోకి
సైతం
తీసుకొచ్చారు.
ఇక
తెలుగులో
2017లో
అనేక
అనుమానాల
నడుమ
ప్రారంభమైన
ఈ
రియాలిటీ
షో
వరుస
సీజన్లతో
దూసుకుపోతూ
ప్రస్తుతం
ఆరో
సీజన్
నడుస్తోంది.
ఇంకొక్క
రోజులో
పూర్తి
కానుంది.

21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ..
ఇదిలా
ఉంటే
సెప్టెంబర్
4న
ప్రారంభమైన
బిగ్
బాస్
తెలుగు
ఆరో
సీజన్
లోకి
మొత్తంగా
21
మంది
సెలబ్రిటీలు
ఎంట్రీ
ఇచ్చారు.
వీరిలో
కీర్తి
భట్,
సుదీప
పింకీ,
శ్రీహాన్,
నేహా
చౌదరి,
చలాకీ
చంటి,
శ్రీ
సత్య,
అర్జున్
కల్యాణ్,
గీతూ
రాయల్,
అభినయ
శ్రీ,
రోహిత్
సాహ్నీ,
మెరీనా
అబ్రహం,
బాలాదిత్య,
వాసంతి
కృష్ణన్,
షానీ
సాల్మన్,
ఆర్జే
సూర్య,
ఫైమా,
ఆదిరెడ్డి,
రాజశేఖర్,
ఇనయా
సుల్తానా,
అరోహీ
రావు,
రేవంత్
ఉన్నారు.

16 మంది బయటకు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, ఫైమా, ఇనయా సుల్తానాతోపాటు మిడ్ వీక్ ఎవిక్షన్ ప్రకియలో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ అయింది. ఇలా హౌజ్ నుంచి 16 మంది వెళ్లిపోయారు.

ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ టాప్ 5లోకి రేవంత్, రోహిత్, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి వెళ్లారు. డిసెంబర్ 18 ఆదివారం నిర్వహించి గ్రాండ్ ఫినాలేలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ చివరిగా టైటిల్ విజేతగా సింగర్ రేవంత్ కు ట్రోఫి అందజేశారు. ముందుగా బిగ్ బాస్ హౌజ్ లోకి హీరో నిఖిల్ వెళ్లి.. రోహిత్ ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చాడు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయి ఇంటి బయటకు వచ్చాడు.

బ్రీఫ్ కేస్ తీసుకోని ముగ్గురు..
రోహిత్, ఆదిరెడ్డి ఎలిమినేషన్ తర్వాత బ్రీఫ్ కేస్ తో మాస్ మహారాజా రవితేజ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ బ్రీఫ్ కేస్ ను తీసుకునేందుకు ఎవరు ఒప్పుకోలేదు. దీంతో కీర్తి భట్ ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇక చివరిగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రేవంత్, శ్రీహాన్ నిలిచారు. వీరిద్దరిలో టైటిల్ విన్నర్ గా సింగర్ రేవంత్ ను ప్రకటించారు. దీంతో రేవంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రేక్షకులు భావించినట్లే..
ఇదిలా
ఉంటే
సీజన్
ప్రారంభం
నుంచి
టైటిల్
ఫేవరెట్
గా
సింగర్
రేవంత్
బరిలోకి
దిగాడు.
హౌజ్
లోకి
అడుగుపెట్టడానికి
ముందే
ఎన్ని
అడ్డుంకులు
ఎదురైనా
పోరాడి
కప్పు
గెలుచుకుని
వస్తా
అని
ఎమోషనల్
గా
పోస్ట్
పెట్టాడు.
హౌజ్
లో
కూడా
చాలాసార్లు
కప్పు
కొట్టాక
అది
మా
పాపకు
గిఫ్ట్
ఇవ్వాలి
అంటూ
మాట్లాడేవాడు.
రేవంత్
మాటలు
చూసి
ముందే
టైటిల్
విన్నర్
ఫిక్స్
అయ్యారా
అనే
అనుమానాలు
తలెత్తాయి.
కానీ,
తర్వాత
అలా
ప్రతీసారి
అంటే
గెలుస్తానన్న
నమ్మకంతో
అలా
అంటానని
రేవంత్
అన్నాడు.
ఇక
హౌజ్
లో,
బయట
ప్రేక్షకులు
భావించినట్లుగానే
రేవంతే
టైటిల్
ట్రోఫీని
ఎత్తుకున్నాడు.