For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిజీత్ అసలు క్యారెక్టర్ బయట పెట్టిన నోయల్: టైమ్ కాకపోయినా తప్పట్లేదంటూ కామెంట్

  |

  తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పుడు ప్రసారం అయినా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ ముందుకెళ్తోంది. అదే సమయంలో ఎవరో ఒక కంటెస్టెంట్‌ను దేశ వ్యాప్తంగా హైలైట్ చేస్తోందీ రియాలిటీ షో. ఇప్పటికే ఎంతో మంది భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకోగా.. ప్రస్తుత సీజన్‌లో అభిజీత్ బాగా ఫేమస్ అయ్యాడు. ఫలితంగా ప్రేక్షకుల మద్దతుతో టైటిల్ రేసులో ముందున్నాడు. ఈ నేపథ్యంలో అభిజీత్ అసలు క్యారెక్టర్‌ గురించి మాజీ కంటెస్టెంట్ నోయల్ సీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  మైండ్‌ గేమ్‌తో మంచి పేరు తెచ్చుకుని

  మైండ్‌ గేమ్‌తో మంచి పేరు తెచ్చుకుని

  హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు అభిజీత్. అయితే, బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం అతడు ఊహించని విధంగా ప్రేక్షకాదరణను పొందాడు. టాస్కుల్లో శ్రమించకుండా మైండ్ గేమ్‌తో ఆడిన అతడు తన జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా మంచి పేరు తెచ్చుకుని ఎలిమినేషన్లు తప్పించుకున్నాడు.

  టాప్-5లో చోటు.. టైటిల్ రేసులో టాప్

  టాప్-5లో చోటు.. టైటిల్ రేసులో టాప్

  షో ఆరంభంలో అభిజీత్‌ను చాలా మంది టార్గెట్ చేశారు. అతడిపై మాటలతో దాడి చేయడంతో పాటు పలుమార్లు నామినేట్ చేశారు. దీంతో అతడికి ప్రేక్షకుల నుంచి సానుభూతి వచ్చింది. ఈ కారణంగానే ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. అంతేకాదు, టాప్ -5లో చోటు దక్కించుకుని.. ఫినాలేలో అడుగు పెట్టాడు. ఇప్పుడు టైటిల్ రేసులో అందరి కంటే ముందున్నాడు.

  అభిజీత్‌కు కలిసొచ్చిన నోయల్ మద్దతు

  అభిజీత్‌కు కలిసొచ్చిన నోయల్ మద్దతు

  నోయల్ ఎలిమినేట్ అయిన తర్వాత అభిజీత్‌కు మద్దతు తెలుపుతానని చెప్పాడు. అంతేకాదు, ‘నీకెప్పుడు భుజం నొప్పి వచ్చినా.. బయటి నుంచే నీ భుజంలా ఉంటాన'ని హామీ ఇచ్చాడు. అందుకు అనుగుణంగానే బయటకు వచ్చినప్పటి నుంచి అతడిని సపోర్ట్ చేస్తున్నాడు. ఎలిమినేషన్‌లో ఉన్న ప్రతిసారీ ఓట్లు వేస్తూ తన ఫ్యాన్స్‌తో వేయిస్తూ బాగా సహకరించాడు.

   నోయల్ కోసం నోట్ రాసిన మిస్టర్ కూల్

  నోయల్ కోసం నోట్ రాసిన మిస్టర్ కూల్

  రెండు రోజుల క్రితం నోయల్‌ గురించి బాధ పడుతూ ‘My Journey Feel less With Out You Star Boy' అని వాటర్ బాటిల్‌పై నెయిల్ పాలీస్‌తో రాశాడు అభిజీత్. ఆ సమయంలో తొలిసారి భారమైన హృదయంతో కనిపించాడను. అప్పుడు హారిక వచ్చి అతడిని ఓదార్చింది. ఈ విషయాన్ని నోయల్ సోషల్ మీడియా ద్వారా స్పందించి.. అతడి స్నేహానికి సలామ్ కొట్టాడు.

  అభిజీత్ అసలు క్యారెక్టర్ బయట పెట్టాడు

  అభిజీత్ అసలు క్యారెక్టర్ బయట పెట్టాడు

  బిగ్ బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీయూనియన్ పార్టీ కోసం వాళ్లంతా ఇంట్లో ఏర్పాటు చేసిన గాజు గదిలోకి వచ్చారు. ఈ క్రమంలోనే నోయల్ సీన్ కూడా శనివారం ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే ర్యాప్ సాంగ్‌తో అదరగొట్టిన అతడు.. హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో అభిజీత్‌ అసలు క్యారెక్టర్ రివీల్ చేశాడు.

  టైమ్ కాకపోయినా తప్పట్లేదంటూ కామెంట్

  టైమ్ కాకపోయినా తప్పట్లేదంటూ కామెంట్

  లోపలికి వచ్చిన నోయటల్‌కు అభిజీత్ నోట్ రాసిన బాటిల్ గిఫ్టుగా ఇచ్చాడు. ఆ తర్వాత మిస్టర్ కూల్ గురించి మాట్లాడుతూ.. ‘నువ్వు నాకోసం జుట్టు కత్తిరించుకోలేదు. కింగ్ టాస్కులో నా బట్టల కోసం వాళ్లను రిక్వెస్ట్ చేశావ్. ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇచ్చే అత్యుత్తమ వ్యక్తివి నువ్వు. ఈ విషయం తర్వాతైనా చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు చెప్పాలనిపించింది' అంటూ ఎమోషనల్ అయ్యాడు నోయల్.

  English summary
  Noel Sean is an Indian rapper, composer and film actor, currently working in the Telugu film industry. Well known as the first rapper of Tollywood as well as a versatile actor, he has also garnered recognition and appreciation as an independent music producer, television host, Radio Jockey, lyricist and composer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X