For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏడిపించిన బిగ్ బాస్ కంటెస్టెంట్: ఆ అలవాటు లేదు.. కానీ ఆమె కోసం చేస్తున్నానంటూ నోయల్ ఎమోషనల్

  |

  రియల్ ఎమోషన్స్.. నిజమైన కంటెంట్‌తో రూపొందే షోలలో బిగ్ బాస్ ఒకటి. వేరు వేరు విభాగాలకు చెందిన కొందరిని ఒకే చోట చేర్చి.. వారికి టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని విజేతగా నిలవడమే దీని సారాంశం. ఈ మొత్తం ప్రాసెస్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్లు శత్రువులుగా మారతారు.. అదే సమయంలో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అవుతుంటారు. ఇలా ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌లోనూ పలువురు స్నేహితులుగా మారిపోయారు. వాళ్లలో నోయల్, లాస్య మంజునాథ్ గురించి ప్రత్యేకంగా నిలిచారు. తాజాగా వీళ్లిద్దరూ ఓ విషయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలు మీకోసం!

  నోయల్ అలా.. లాస్య మంజునాథ్ ఇలా

  నోయల్ అలా.. లాస్య మంజునాథ్ ఇలా

  తెలుగులో మొట్టమొదటి ర్యాపర్‌గా ఎదగాలన్న పట్టుదలతో తన కెరీర్‌ను ప్రారంభించాడు నోయల్ సీన్. అందుకు అనుగుణంగానే తన టాలెంట్‌ను నిరూపించుకుని బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతున్నాడు. మరోవైపు, యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను అందుకుంది లాస్య. వివాహం తర్వాత ఈమె బుల్లితెరపై అంతగా కనిపించలేదు.

  టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారిద్దరూ

  టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారిద్దరూ

  లాక్‌డౌన్ సమయంలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు నోయల్ సీన్, లాస్య మంజునాథ్. మిగిలిన వాళ్లతో పోలిస్తే ఎక్కువ ఫేమ్ ఉన్నది వీళ్లే కాబట్టి.. ఆరంభంలో ఈ ఇద్దరినీ టైటిల్ ఫేవరెట్లుగా భావించారు. అందుకు అనుగుణంగానే ఆరంభంలో తమ మార్క్ చూపిస్తూ సత్తా చాటారు. దీంతో వీళ్లలోనే ఒకరు గెలుస్తారనుకున్నారు.

  ముందే పరిచయం.. హౌస్‌లో గొడవలు

  ముందే పరిచయం.. హౌస్‌లో గొడవలు

  బిగ్ బాస్ షోలోకి రావడానికి ముందే నోయల్ - లాస్య మంజునాథ్ ఒకరికి ఒకరు పరిచయం. చాలా షోలు, ఈవెంట్లలో కలిసి పని చేశారు. దీంతో హౌస్‌లో వీళ్లు ఎంతో స్నేహంగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా తరచూ గొడవలకు దిగేవారీ ఇద్దరు. ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ వచ్చేవారు. అదే సమయంలో కొన్నిసార్లు విమర్శలు కూడా చేసుకున్నారు.

  మధ్యలోనే ఎలిమినేట్.. ఇద్దరికి సపోర్ట్

  మధ్యలోనే ఎలిమినేట్.. ఇద్దరికి సపోర్ట్

  ఇక, హౌస్‌లో నోయల్, లాస్య.. అభిజీత్, హారికతో కలిసి చాలా క్లోజ్‌గా ఉండేవారు. దీంతో వీళ్లను 'నోభికాస్య' అని అంతా సంబోధించేవారు. నాలుగో సీజన్ రసవత్తరంగా సాగుతోన్న సమయంలో నోయల్ సీన్ అనారోగ్య కారణాలతో బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది వారాలకు లాస్య కూడా ఎలిమినేట్ అయిపోయింది. దీంతో వీళ్లిద్దరూ అభిజీత్, హారికకు సపోర్ట్ చేశారు.

  ఏడిపించిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య

  ఏడిపించిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య

  బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. నాలుగో సీజన్ అత్యధిక రేటింగ్‌తో నేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఉత్సవం పేరిట స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి కంటెస్టెంట్లు అందరూ హాజరయ్యారు. ఈ వేడుకలో లాస్య.. నోయల్‌కు రిస్ట్ వాచ్ బహుమతిగా ఇచ్చి.. అతడిపై ప్రేమను చాటుకుంది.

  ఆ అలవాటు లేదు.. కానీ ఆమె కోసం

  ఆ అలవాటు లేదు.. కానీ ఆమె కోసం

  వాచ్ ఇచ్చిన సమయంలో లాస్య.. నోయల్‌ను ఉద్దేశిస్తూ 'ఇందులో టైమ్ ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటుంది. అలాగే, నువ్వు కూడా పైపైకి ఎదగాలని కోరుకుంటున్నా' అంటూ ఏడ్చేసింది. అప్పుడు ఆమెనే తన చేతికి పెట్టమన్న నోయల్.. 'లాస్య నాకు వాచ్ పెట్టుకోవడం నచ్చదు. కానీ, నీ కోసం ఇది అలవాటు చేసుకుంటున్నా' అంటూ ఎమోషనల్ అయిపోయాడు.

  English summary
  Noel Sean is an Indian rapper, composer and film actor, currently working in the Telugu film industry. Well known as the first rapper of Tollywood as well as a versatile actor, he has also garnered recognition and appreciation as an independent music producer, television host, Radio Jockey, lyricist and composer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X