»   » కేబీసీ నుంచి అమితాబ్ అవుట్.. హోస్ట్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్లు.. కంపు లేపుతారా?

కేబీసీ నుంచి అమితాబ్ అవుట్.. హోస్ట్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్లు.. కంపు లేపుతారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమారు 50 ఏళ్ల బాలీవుడ్ కెరీర్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఎదురే లేదు. 70, 80 దశకాల్లో ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. 90 దశకం చివర్లో కౌన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ గేమ్‌ షోతో ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లకుండా టీవీలకు అత్తుకుపోయేలా చేశాడు. అది బిగ్ బీ కెపాసిటీ.. అప్పటి నుంచి కేబీసీ ప్రొగ్రాంను అమితాబ్‌ నిరాటకంగా నిర్వహించారు. 2014 నుంచి కేబీసీ హిందీ వెర్షన్ ఆగిపోయింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా మహిళను ఎంపిక చేయాలని సోని టెలివిజన్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

అమితాబ్ స్థానంలో..

అమితాబ్ స్థానంలో..

ప్రస్తుతం ఈ ప్రొగ్రాంకు సంబంధించిన కాంట్రాక్టు ముగిసిపోవడంతో టెలివిజన్ సంస్థ ఆయన స్థానంలో మరో ఇద్దరు హీరోయిన్ల ఒకరిని హోస్ట్‌గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. కేబీసీని అమితాబ్ ఎవరికీ అందనంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్‌ను తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో హీరో రణ్‌బీర్ కపూర్‌ను హోస్ట్‌గా తీసుకోవాలనే ప్రయత్నం కొలిక్కి రాలేదు.

బాలీవుడ్ హీరోయిన్లు..

బాలీవుడ్ హీరోయిన్లు..

కేబీసీ గేమ్ షోను పూర్తిగా మార్చివేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఫార్మాట్ అలాగే ఉంటుంది. ఈ సారి మేల్ హోస్ట్‌గా కాకుండా బాలీవుడ్ యాక్టర్లను తీసుకోవాలని అనుకొంటున్నాం. అయితే అమితాబ్ స్థాయికి తగినట్టుగా ఉండే బాలీవుడ్ హీరోయన్ల కోసం వేట ప్రారంభించాం. ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ అయితే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నాం. వారితో సంప్రదింపులు జరుపుతున్నాం అని టీవీ యాజమాన్యం తెలిపారు.

మాధురీ దీక్షిత్ అయితే..

మాధురీ దీక్షిత్ అయితే..

మాధురీ దీక్షిత్ అయితే ఆమె నవ్వు వీక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది. హోస్ట్‌గా మాస్‌ జనాలకు చేరుకొనే అవకాశం ఉంటుంది. ఐశ్వర్యరాయ్‌కి అందం ఆమెకు పాజిటివ్‌ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యకు ఆదరణ ఉంది. కాబట్టి వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం అని నిర్వాహకులు తెలిపారు.

టీవీ తెరపై మాధురీ అదుర్స్

టీవీ తెరపై మాధురీ అదుర్స్

మాధురీ దీక్షిత్ ఈ మధ్యకాలంలో టెలివిజన్ తెరపై బాగానే రాణిస్తున్నది. కహీ నా కహీ కోయి హై, ఝలక్ దిక్లా జా కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. అంతేకాకుండా డ్యాన్స్ ఇండియాకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించి ఆకట్టుకొన్నది. ఐశ్వర్యరాయ్‌కి టెలివిజన్ కార్యక్రమాలకు హోస్ట్‌గా నటించిన అనుభవం లేదు. ఒకవేళ కేబీసీ కార్యక్రమానికి హోస్ట్‌గా అంగీకరిస్తే ఇదే తొలిసారి అవుతుంది.

English summary
Amitabh Bachchan’s contract with Kaun Banega Crorepati the show is going to over soon. The channel planning to bring back the show. Reports suggests that they are planning to have a female host, who is a Bollywood actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu