twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Show.. రాజా రవీంద్ర చెప్పిన కోటి రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

    |

    నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకొన్న తొలి కంటెస్టెంట్‌గా సుజాత నగర్‌కు చెందిన భాస్కర రాజా రవీంద్ర అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. బీటెక్, ఎంఏ, ఎల్ఎల్‌బీ
    చదివిన రవీంద్ర 2012లో పోలీస్ శాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని సర్కిల్ ముత్తారం పీఎస్‌లో సబ్ ఇన్స్పెక్టర్‌గా డ్యూటీలో జాయిన్ అయ్యారు. 2015 నుంచి హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. కోటి రూపాయలు గెలుచుకొన్న రాజా రవీంద్ర ప్రస్థానం ఇలా సాగింది.. ఆయన చెప్పిన 25 లక్షలు, 50 లక్షల రూపాయల, కోటి రూపాయల ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పగలరా?

    2500000 రూపాయల ప్రశ్న కోసం

    2500000 రూపాయల ప్రశ్న కోసం

    2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో 40 రోజులు అని అర్దం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది?
    a) లాక్‌డౌన్
    b) ఐసోలేషన్
    c) క్వారంటైన్
    d) పాండమిక్

    Answer: క్వారంటైన్

    పై ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. మార్చి 2020లో లాక్‌డౌన్ విధించడానికి ముందు గాంధీ హాస్పిటల్‌లోని 8వ అంతస్థులో ఏర్పాటు చేసిన కరోనావైరస్ ఐసోలేషన్ సెంటర్‌ వద్ద పనిచేశారు. ఫ్రంట్ లైన్ వారియర్‌గా నేను నా విధులను నిర్వహించాను. ఆ సమయం నా జీవితంలో కీలకమైనది. ఆ సమయంలో వచ్చిన అనుభవం ఇప్పుడు ఉపయోగపడింది. పై ప్రశ్నకు నా సమాధానం క్వారంటైన్ అని చెప్పి 25 లక్షల రూపాయలు గెలుచుకొన్నారు.

    జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైద్యుడు అయిన ఒక వ్యక్తి జాపకార్తం జరుపుతారు?

    జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైద్యుడు అయిన ఒక వ్యక్తి జాపకార్తం జరుపుతారు?

    a) మిజోరాం
    b) పశ్చిమ బెంగాల్
    c) ఉత్తర ప్రదేశ్
    d) కేరళ

    Answer: పశ్చిమ బెంగాల్

    పై ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు పశ్చిమ బెంగాల్ అని అనుకొంటున్నాను అని అన్నారు. అయితే డౌట్ ఉండటంతో 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. తెర మీద మిజోరాం, పశ్చిమ బెంగాల్ మిగిలాయి. దాంతో డాక్టర్ జ్యోతిబసు పేరిట వైద్యుల దినం పాటిస్తున్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్ అంటూ సమాధానం చెప్పారు. అయితే పశ్చిమ బెంగాల్ కరెక్ట్ సమాధానం అయింది. కానీ ఆ దినోత్సవం జ్యోతి బసు కాదు.. బీసీ రాయ్ అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు. దాంతో రాజా రవీంద్ర 50 లక్షలు గెలిచారు.

    1656 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమీషన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?

    1656 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమీషన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?

    a) రంగనాథ్ మిశ్రా
    b) రంజిత్ సింగ్ సర్కారియా
    c) బీపీ మండల్
    d) ఎస్ ఫజల్ ఆలీ

    పై ప్రశ్నకు సమాధానం డౌట్‌గా ఉండటంతో తికమక పడ్డారు. ఫజల్ ఆలీ, మండల్ మధ్య డౌట్ ఉందని చెప్పారు. దాంతో రాజా రవీంద్ర తన మూడో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకొని సమాధానం అడిగారు. అయితే 90 శాతం ఫజల్ ఆలీ అంటూ సమాధానం చెప్పారు. చివరకు ఫజల్ ఆలీ అంటూ సమాధానం చెప్పడంతో రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకొన్న తొలి కంటెస్టెంట్‌ మారారు.

    Answer: ఎస్ ఫజల్ ఆలీ

    కోటి రూపాయల చెక్‌పై ఎన్టీఆర్ సంతకం

    కోటి రూపాయల చెక్‌పై ఎన్టీఆర్ సంతకం


    ఎవరు మీలో కోటీశ్వరులులో కోటి రూపాయలు గెలుచుకొన్న రాజా రవీంద్రను నందమూరి తారకరామారావు ప్రశంసలతో ముంచెత్తారు. కోటి రూపాయల గెలుచుకొన్న కంటెస్టెంట్‌కు ఇచ్చే చెక్‌పై సంతకం చేసే అదృష్టం కలిగింది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. చెక్‌పై సంతకం చేశారు. చెక్ ఇచ్చే ముందు రాజా రవీంద్ర భార్య సింధూజను వేదికపైకి పిలిచారు.

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    రాజా రవీంద్రను బావా ఐ లవ్ యూ అంటూ

    రాజా రవీంద్రను బావా ఐ లవ్ యూ అంటూ

    రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకోవడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. మీ భర్తకు ఏం చెప్పాలనుకొంటున్నారు అని అడిగితే.. బావ ఐ లవ్ యూ అంటూ సింధూజ తన ప్రేమను, ఆనందాన్ని వ్యక్తంచేసింది. దాంతో ఎన్టీఆర్ అదే మాటను మళ్లీ చెప్పించారు. మీకు చెక్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఉంది అంటే.. మీ చేతుల మీదుగా ఈ చెక్‌ను అందుకోవడం గర్వంగా ఉంది అని రాజా రవీంద్ర దంపతులు అన్నారు.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show November 15th Episode: Raja Ravindra of Sujatha Nagar is participant in the EMK Show. He has won 1 crore in the Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X