For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Sept 27nd Show: ఎన్టీఆర్‌నే ఆటపట్టించిన కంపెనీ సెక్రెటరీ.. ఎంత గెలిచాడంటే?

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆసక్తికరంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం వారం కూడా క్రేజీగా మొదలైంది. సోమవారం అంటే సెప్టెంబర్ 27వ తేదిన హైదరాబాద్‌‌కు చెందిన కంపెనీ సెక్రెటరీ రవీంద్రనాథ్ టాగోర్ హాట్ సీట్‌పైకి వచ్చారు. చాలా ఉత్సాహంగా, చురుకు ఆడుతూ 1200000 లక్షలు గెలుచుకొన్నారు? ఆయన ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఎలాంటి ప్రశ్నలకు తడబడ్డారు.. ఆ వివరాల్లోకి వెళితే..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే...

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే...

  ఈ నాయకులను వారు మొట్ట మొదటి సారి ముఖ్యమంత్రి అయిన కాలక్రమంలో అమర్చండి

  A) K చంద్రశేఖర్ రావు
  B) N చంద్రబాబు నాయుడు
  C) YS రాజశేఖరరెడ్డి
  D) మర్రి చెన్నారెడ్డి

  Answer: D, B, C, A

   Rs.1000 కోసం

  Rs.1000 కోసం

  ఈ సామెతను పూర్తి చేయండి.. పేరు గొప్ప --------- దిబ్బ
  A) ఊరు
  B) ఇల్లు
  C) పట్టణం
  D) దేశం

  Answer: ఊరు

  Rs.2000 కోసం

  Rs.2000 కోసం

  నట్లు, బోల్డులని పట్టుకోవడానికి మరియు తిప్పడానికి సాధారణంగా వీటిలో ఏ పరికరం వాడతారు
  a) సుత్తి
  b) స్పానర్
  c) కత్తెర
  d) స్టేప్లర్

  Answer: స్పానర్

  Rs.3000 కోసం

  Rs.3000 కోసం

  భూమిని చుట్టే యంత్రాలను ఏమంటారు?
  a) డైనమైట్లు
  b) గిగాబైట్లు
  c) శాటిలైట్లు
  d) మీడియరైట్లు

  Answer: శాటిలైట్లు

  Rs.5000 కోసం

  Rs.5000 కోసం

  న్యాయస్థానంలో, సాధారణంగా మై లార్డ్ లేదా మై లేడి అని వీరిలో ఎవరిని సంబోధిస్తారు?
  a) సాక్షి
  b) పబ్లిక్ ప్రాసిక్యూటర్
  c) న్యాయమూర్తి
  d) ప్రతివాది

  Answer: న్యాయమూర్తి

  Rs.10000 కోసం

  Rs.10000 కోసం

  ఈ చిత్రంలోని వంటకాన్ని గుర్తించండి
  a) కాజా
  b) సున్నండలు
  c) లడ్డు
  d) బర్ఫీ

  Answer: కాజా

  Rs.20000 కోసం

  Rs.20000 కోసం

  హైదరాబాద్‌లో ఉన్న రింగ్ రోడ్డును ఏ పేరుతో పిలుస్తారు?

  a) గాంధీ
  b) నెహ్రూ
  c) ఠాగోర్
  d) బోస్

  Answer: నెహ్రూ

  Rs.40000 కోసం

  Rs.40000 కోసం

  వీటిలో ప్రధానంగా మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఏది?
  a) యూట్యూబ్
  b) క్రోమ్
  c) వికీపీడియా
  d) వాట్సాప్

  Answer: వాట్సాప్

  Rs.80000 కోసం

  Rs.80000 కోసం

  ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌కు ఏ రంగు క్యాప్‌ను ఇస్తారు?
  a) పర్పుల్
  b) ఆరెంజ్
  c) గ్రీన్
  d) వైట్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్ పోల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నాడు. అందరూ పర్పుల్ సమాధానం చెప్పడంతో అదే జవాబు చెప్పి.. 80వేలు గెలుచుకొన్నారు.

  Answer: పర్పుల్

  Rs.160000 కోసం

  Rs.160000 కోసం

  హిందూ పురాణాల్లో నాగ, బ్రహ్మ, మరియు పాశుపత అనేవి వీటిలో వేటి పేర్లు?
  a) శంఖాలు
  b) అస్త్రాలు
  c) రథాలు
  d) ఏనుగులు

  Answer: అస్త్రాలు

  Rs.320000 కోసం

  Rs.320000 కోసం

  భారతదేశంలో పాస్‌పోర్టులను జారీ చేసే అధికారం కలిగి ఉన్న మంత్రిత్వశాఖ ఏది?
  a) రక్షణ శాఖ
  b) హోంశాఖ
  c) విదేశాంగ శాఖ
  d) పౌర విమానయాన మంత్రిత్వం శాఖ

  Answer: విదేశాంగ శాఖ

  Rs.640000 కోసం

  Rs.640000 కోసం

  వీరిలో ఎవరి వర్ధంతిని ఫిబ్రవరి 11న సమర్పణ్ దివస్‌గా జరుపుతారు?
  a) మౌలానా అబుల్ కలాం ఆజాద్
  b) సర్దార్ వల్లభాయ్ పటేల్
  c) దీనదయాల్ ఉపాధ్యాయ్
  d) మహత్మ గాంధీ

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. తన స్నేహితుడిక కాల్ చేయడంతో దీనదయాల్ ఉపాధ్యాయ్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. తన స్నేహితుడు చెప్పిన సమాధానంతో 640000 గెలుచుకొన్నారు.

  Answer: దీనదయాల్ ఉపాధ్యాయ్

  Rs.1250000 కోసం

  Rs.1250000 కోసం

  వీటిలో ఒకదానికొకటి ఎక్కువ దూరంలో ఉన్న రాష్ట్ర జోడి ఏది?
  a) తమిళనాడు -కర్ణాటక
  b) ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర
  c) గుజరాత్- రాజస్థాన్
  d) హిమచల్ ప్రదేశ్ - కేరళ

  Answer: హిమచల్ ప్రదేశ్ - కేరళ

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show September 27nd Episode: Hyderabad Company Sectretary Ravindranath Tagore has participated in EMK. He won the 1200000 in the game and Still he is on hot seat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X