NTR's EMK Sept 27nd Show: కోటి రూపాయల ప్రశ్నకు చేరువగా కంటెస్టెంట్.. ఎన్టీఆర్ ఏం చేశాడంటే?
బుల్లితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ గేమ్ షోలో హైదరాబాద్‌కు చెందిన కంపెనీ సెక్రెటరీ రవీంద్రనాథ్ టాగోర్ హాట్ సీట్‌పై తన సత్తా చాటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ షోలో సోమవారం 1250000 రూపాయలు గెలుచుకొన్న ఆయన రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మంగళవారం హాట్ సీట్‌పైకి వచ్చారు. రూ.25 లక్షల ప్రశ్నకు ఎదుర్కొన్నారు. అయితే ఈ గేమ్‌లో రవీంద్రనాథ్ టాగోర్ ఎంత గెలుచుకొన్నారు.. టాగోర్ తర్వాత ఎవరు హాట్ సీట్‌పైకి వచ్చారు అనే విషయంలోకి వెళితే...

25 లక్షల రూపాయల ప్రశ్నగా
రోల్ ఓవర్ కంటెస్టెట్‌గా వచ్చిన రవీంద్రనాథ్ టాగోర్ ముందు.. 25 లక్షల రూపాయల ప్రశ్నగా
ఏ యుద్ధంలో పాల్గొన్న భారత సైనిక సిబ్బందికి పశ్చిమి స్టార్ మరియు పూర్వీ స్టార్ అనే సేవా పతకాలు ప్రధానం చేశారు?
a) రెండవ ప్రపంచ యుద్ధం
b) బంగ్లాదేశ్ విమోచన యుద్ధం
c) భారత-చైనా యుద్ధం
d) కార్గిల్ యుద్ధం
పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. దాంతో తెరపైన బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, భారత-చైనా యుద్ధం ఆప్షన్లు మిగిలాయి. అయితే సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యారు.
Answer: బంగ్లాదేశ్ విమోచన యుద్ధం

ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ క్వశ్చన్ ఇలా
గేమ్ నుంచి రవీంద్రనాథ్ టాగోర్ నిష్క్రమించడంతో మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నను వేశారు.
ఒక తెలుగు నానుడి వచ్చేలా ఈ పదాలను సరైన క్రమంలో అమర్చండి
A) రాదా
B) అమావాస్య
C) పూర్ణిమ
D) తరవాత
Answer: B, D, C, A
పై ప్రశ్నకు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన.. కొండారెడ్డిపల్లిలో పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న షేక్ ఖాజా నయాబ్ రసూల్ 2.1 సెకన్లలో సమాధానం ఇచ్చి హాట్ సీట్‌పైకి వచ్చారు. ఆయనకు వేసిన ప్రశ్నలు ఇవే..

1000 రూపాయల ప్రశ్న EMK Show
1000 రూపాయల ప్రశ్న EMK Show
వీటిలో సాధారణంగా పొడవైనది ఏది?
a) జామకాయ
b) కొబ్బరికాయ
c) మామిడికాయ
d) మునగకాయ
Answer: మునగకాయ

2000 రూపాయల ప్రశ్న EMK Show
నాగచైతన్య, వెంకటేష్ దగ్గుబాటి కలిసి నటించిన 2019 చిత్రంలో వెంకటరత్నం కార్తీక్‌కి ఏమవుతారు?
a) నాన్న
b) మామ
c) తమ్ముడు
d) అన్నయ్య
Answer: మామ

3000 రూపాయల ప్రశ్న EMK Show
వీరిలో ఇస్తాం ప్రార్థనలను ముందుండి నడిపించే వ్యక్తిని సూచించేది ఏది?
a) ఇమామ్
b) ఖ్వాజా
c) ఎమిర్
d) సుల్తాన్
Answer: ఇమామ్

5000 రూపాయల ప్రశ్న EMK Show
వీటిలో కోట కానిది ఏది?
a) భువనగిరి
b) గోల్కోండ
c) కొండారెడ్డి
d) చార్మినార్
Answer: చార్మినార్

10000 రూపాయల ప్రశ్న EMK Show
వీటిలో దేనిలో USB, VGA, మరియు HDMI అనే పోర్టులు ఉంటాయి?
a) మొబైల్ ఫోన్లు
b) ల్యాప్‌టాప్స్
c) హెడ్ ఫోన్స్
d) పవర్ బ్యాంక్స్
Answer: ల్యాప్‌టాప్స్

20000 రూపాయల ప్రశ్న EMK Show
సాధారణంగా వీటిలో ఏ ఆటలో ఆటగాళ్లు ఎవరూ హెల్మెట్ ధరించరు?
a) క్రికెట్
b) మోటార్ రేసింగ్
c) హాకీ
d) కబడ్డీ
Answer: కబడ్డీ

40000 రూపాయల ప్రశ్న EMK Show
మే 2021లో పినరయ్ విజయన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు?
a) కేరళ
b) తమిళనాడు
c) కర్ణాటక
d) మహారాష్ట్ర
Answer: కేరళ

80000 రూపాయల ప్రశ్న EMK Show
ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటను సాధారణంగా అమెరికాలోని ఏ ప్రదేశంతో పోలుస్తారు?
a) మౌంట్ రష్‌మోర్
b) గ్రాండ్ కాన్యన్
c) మొహాని ఎడారి
d) నయాగారా జలపాతం
పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఉపయోగించుకోవడంతో గ్రాండ్ క్యాన్యన్, నయాగారా జలపాతం ఆప్షన్లు మిగిలియి. అయితే గ్రాండ్ కాన్యన్ అని షేక్ ఖాజా నయాబ్ రసూల్ సమాధానం చెప్పడంతో గేమ్‌లో ముందుకు వెళ్లాడు.
Answer: గ్రాండ్ కాన్యన్

160000 రూపాయల ప్రశ్న EMK Show
ఈ ప్రదేశాలలో ఇత్తడి కళారూపాలకి ప్రసిద్ధి చెందినది ఏది?
a) పోచంపల్లి
b) పెంబర్తి
c) చేర్యాల
d) నిర్మల్
Answer: పెంబర్తి
Recommended Video

320000 రూపాయల ప్రశ్న EMK Show
2016 ప్రకటించిన నోట్లరద్దు సమయంలో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు?
a) శక్తికాంత్ దాస్
b) రఘురాం రాజన్
c) ఉర్జిత్ పటేల్
d) దువ్వూరి సుబ్బారావు
Answer: ఉర్జిత్ పటేల్


Click it and Unblock the Notifications











