For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show 160000 ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన కంటెస్టెంట్.. ఎన్టీఆర్ చెబుతున్నా వినకుండా..

  |

  నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తాజా వారంలో మొదటి రోజు ఇద్దరు గేమ్ నుంచి బయటకు వెళ్లారు. మొదటి వ్యక్తిగా నర్సరావుపేటకు చెందిన షేక్ ఖాజా వలీ, మార్కాపురంకు చెందిన దుర్గా ప్రసాద్ హాట్ సీటుపైకి వచ్చారు. అయితే వారు ఎంత గెలుచుకొన్నారు. ఎలాంటి ప్రశ్నలకు తడబడ్డారు. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా?

  ఫస్టాస్టె ఫింగర్ ఫస్ట్

  ఫస్టాస్టె ఫింగర్ ఫస్ట్

  ఇవి తయారుచేయడానికి అవసరమయ్యే వస్త్రం పొడువు ఆధారంగా, వీటిని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి
  A) హ్యండ్ కర్చీఫ్
  B) కుర్తా
  C) బ్లౌజ్
  D) చీర

  పై ప్రశ్నకు అత్యంత వేగంగా సమాధానాలు లాక్ చేసి హాట్ సీట్‌పైకి షేక్ ఖాజా వలీ వచ్చారు. నర్సారావు పేటకు చెందిన ఖాజా వళీ గీతం కాలేజ్‌లో ఎంబీఏ చేశారు. ఫెడరల్ బ్యాంక్, కర్నాటక బ్యాంకులో ఉద్యోగం చేసి.. ప్రస్తుతం సొంతంగా టైల్స్ వ్యాపారం చేస్తున్నారు.

  Answer: A, C, B, D

   రూ.1000 కోసం క్వశ్చన్

  రూ.1000 కోసం క్వశ్చన్

  వీటిలో ఏ శరీర భాగాలు హెడ్ ఫోన్స్‌ను ఉపయోగిస్తాయి?
  a) కళ్లు
  b) చెవులు
  c) నాలుక
  d) పళ్లు

  Answer: చెవులు

  రూ.2000 కోసం క్వశ్చన్

  రూ.2000 కోసం క్వశ్చన్

  ఒక 2004 చిత్రంలో, శంకర్ ప్రసాద్ అనే దాదా ఏమి చదవాలనుకుంటాడు?
  a) ఎంబీబీఎస్
  b) ఎంబీఏ
  c) ఎంఏ
  d) బీటెక్

  Answer: ఎంబీబీఎస్

  రూ.3000 కోసం క్వశ్చన్

  రూ.3000 కోసం క్వశ్చన్

  వీటిలో జింక, గుర్రం మరియు ఏనుగు ఏ రకమైన జంతువులకి ఉదాహరణలు?
  a) స్కావెంజర్
  b) సర్వభక్షకి
  c) మాంసాహరి
  d) శాకాహారి

  Answer: శాకాహారి

  రూ.5000 కోసం క్వశ్చన్

  రూ.5000 కోసం క్వశ్చన్

  ఎల్‌పీజి మరియు ధ్రవీకృత ఆక్సిజన్‌ను నిల్వచేసే కంటైనర్లను, సాధారణంగా వీటిలో ఏ పేరుతో పిలుస్తారు?
  a) సిలిండర్
  b) కోన్
  c) క్యూబ్
  d) సర్కిల్

  Answer: సిలిండర్

  రూ.10000 కోసం క్వశ్చన్

  రూ.10000 కోసం క్వశ్చన్

  వీటిలో 2021 ఐపీఎల్ సీజన్ ఆడుతున్న జట్టు ఏది?
  a) కొచ్చి టస్కర్స్
  b) గుజరాత్ లయన్స్
  c) పూణే వారియన్స్ ఇండియా
  d) చెన్నై సూపర్ కింగ్స్

  Answer: చెన్నై సూపర్ కింగ్స్

   రూ.20000 కోసం క్వశ్చన్

  రూ.20000 కోసం క్వశ్చన్

  ఒక 20 ఏళ్ల వ్యక్తి ఎన్నేళ్లు టీనేజ్‌లో గడిపి ఉంటారు?
  a) మూడు
  b) ఐదు
  c) ఏడు
  d) తొమ్మిది

  Answer: ఏడు

  రూ.40000 కోసం క్వశ్చన్

  రూ.40000 కోసం క్వశ్చన్

  ఈ చిత్రంలో కనిపిస్తున్న చారిత్రాత్మక కట్టడం ఏది?
  A) సాంచి స్థూపం
  B) హంపీ విఠల దేవాలయం
  C) పద్మనాభస్వామి దేవాలయం
  D) రాణి కీ వావ్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మొదటి లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఉపయోగించుకోవడంతో రాణి కీ వావ్ అని ఆడియెన్స్ ఎక్కువ మంది ఓటు వేశారు. దాంతో అదే సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: రాణి కీ వావ్

   రూ.80000 కోసం క్వశ్చన్

  రూ.80000 కోసం క్వశ్చన్

  భారతదేశంలో వీటిలో ఏ ప్రాణులకి అతిపెద్ద సంరక్షిత ప్రాంతంగా నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వ్ ఉన్నది?
  A) పులులు
  B) ఏనుగులు
  C) ఖడ్గమృగాలు
  D) సింహాలు

  Answer: పులులు

  160000 కోసం క్వశ్చన్

  160000 కోసం క్వశ్చన్

  వీటిలో ఏ వంటకం పేరు అరబిక్‌లో ఉదయం అనే పదం నుంచి వచ్చింది?
  a) బిర్యానీ
  b) నిహారి
  c) కీమా
  d) హలీమ్

  పై ప్రశ్నకు ఖాజా వలీ లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆయన 50:50 ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. అయితే స్క్రీన్ మీద నిహారి, హలీమ్ ఉండటంతో నిహారి సమాధానాన్ని లాక్ చేశారు. ఆ సమాధానం తప్పు కావడంతో గేమ్ నుంచి అవుట్ అయ్యారు. కేవలం పది వేల రూపాయలతో గేమ్ నుంచి బయటకు వెళ్లారు.

  Answer: నిహారి

  రెండవ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

  రెండవ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్


  అతి చిన్నదానితో మొదలుపెట్టి, ఈ ఆహార పదార్థాలను వాటి సగటు పరిమాణం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి
  A) కమలాపండు
  B) పుచ్చకాయ
  C) వేరుశనగపప్పు
  D) ఆవగింజ

  Answer: D, C, A, B

  దుర్గ ప్రసాద్ అత్యంత వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన దుర్గా ప్రసాద్ పోలియో వ్యాధి కారణంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. బ్యాంక్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది.

  1000 రూపాయల కోసం ప్రశ్న

  1000 రూపాయల కోసం ప్రశ్న

  క్యాండీ, కోన్, గడ్బడ్ మరియు సాఫ్టీ మొదలైన పదాలు, వీటిలో దేనికి సంబంధించినది?
  a) ఐస్ క్రీమ్
  b) సంబార్
  c) కర్రీ
  d) రసం

  Answer: ఐస్ క్రీమ్

   2000 రూపాయల కోసం ప్రశ్న

  2000 రూపాయల కోసం ప్రశ్న

  వీరిలో హిందూ పురాణాల ప్రకారం కైలాసంలో నివసించే దేవత ఎవరు?
  a) లక్ష్మి
  b) పార్వతి
  c) సరస్వతి
  d) పద్మావతి

  Answer: పార్వతి

  3000 రూపాయల కోసం ప్రశ్న

  3000 రూపాయల కోసం ప్రశ్న

  ఈ చిత్రంలోని సంగీత వాయిద్యాన్ని గుర్తించండి?
  a) తంబురా
  b) సితారా
  c) మృదంగం
  d) తబలా
  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే ఆడియెన్స్ ఎక్కువ మంది మృదంగం అని సమాధానం చెప్పడంతో అదే జవాబు చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: మృదంగం

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న

  వీటిలో ఏ ఆటలో స్ట్రైకర్ వాడతారు?

  a) చెస్
  b) క్యారం
  c) లూడో
  d) రమ్మీ

  Answer: క్యారం

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  10000 రూపాయల కోసం ప్రశ్న

  10000 రూపాయల కోసం ప్రశ్న

  వృత్తాలను గీయడానికి పెన్సిల్‌తోపాటు వీటిలో ఏ పరికరాన్ని వాడుతారు?
  a) డివైడర్
  b) రూలర్
  c) సెట్ స్వ్కేర్
  d) కంపాస్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. దుర్గప్రసాద్ 50:50 ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. అయితే స్క్రీన్ పై రూలర్, కంపాస్ మిగిలి ఉండటంతో రూలర్ అని జవాబు చెప్పారు. అయితే మరో లైఫ్ లైన్ ఉందని చెబుతున్నా రూలర్ ప్రశ్నను లాక్ చేశాడు. ఆ సమాధానం తప్పు కావడంతో గేమ్ నుంచి ఏమీ గెలుచుకొకుండానే వెళ్లిపోయారు.

  Answer: కంపాస్

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show November 29th Episode: Shaik Kaja Vali of Narsapuram, Durga prasad of Markapuram come to Hot seat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X