For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show: ఇద్దరు కంటెస్టెంట్లను ప్రశ్నలతో కంగతినిపించిన ఎన్టీఆర్.. మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

  |

  కర్టన్ రైజర్ ఎపిసోడ్ రాంచరణ్‌తో ఆడిన హై ఓల్టేజ్ గేమ్ తర్వాత సాధారణ ప్రేక్షకులను ఎవరు మీలో కోటీశ్వరుల షోలో పరిచయం చేశారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌ తర్వాత హైదరాబాద్‌కు చెందిన శ్వేత లక్కరాజు తొలి కంటెస్టెంట్‌గా గేమ్‌లోకి ప్రవేశించారు. అంగవైకల్యంతో బాధపడుతున్న మహిళ కావడం గమనార్హం. అయితే 9వ ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. ఆ తర్వాత కోమురం భీమ్ జిల్లాకు చెందిన దుగ్గెపోగు సన్నీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌లో గెలువడంతో రెండో కంటెస్టెంట్‌గా షోలోకి వచ్చారు. ఈ గేమ్‌లో అడిగిన ప్రశ్నలు ఏమిటంటే...

  1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

  1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

  1. హిందూ మతంలో ఏ దేవుడిని విఘ్న నివారకుడని పిలుస్తారు?

  a) కార్తీకేయుడు
  b) గణేషుడు
  c) శివుడు
  d) బ్రహ్మ

  Answer: గణేషుడు

  ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఎలాంటి విఘ్నాలు చోటు చేసుకోకుండా ఈ ప్రశ్నను సంధించాడని ఎన్టీఆర్ అన్నారు. దానికి కంటెస్టెంట్ ఈ షో సవ్యంగా సాగాలని గణేషుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.

  2000 రూపాయల కోసం రెండో ప్రశ్న ఇలా..

  2000 రూపాయల కోసం రెండో ప్రశ్న ఇలా..

  2. సాధారణంగా వీటిలో టిక్ టాక్ అనే శబ్దం చేసేది ఏదీ?

  a) పుస్తకం
  b) పెన్ను
  c) గడియారం
  d) బల్బు

  Answer: గడియారం

  3000 రూపాయల కోసం మూడో ప్రశ్న ఏమిటంటే..

  3000 రూపాయల కోసం మూడో ప్రశ్న ఏమిటంటే..

  3. ఈ సామెతను పూర్తి చేయండి: తాను చెడ్డ కోతి---- అంతా చెరిచినట్టు
  a) వనం
  b) ఇల్లు
  c) వీధి
  d) వాకిలి

  Answer: వనం

  ఈ ప్రశ్నకు సమాధానంపై డౌట్ ఉండటంతో కంటెస్టెంట్ ఆడియెన్స్ పోల్ లైఫ్ లైన్‌ను ఉపయోగించుకొన్నారు. దాంతో సామెతల మీద పట్టు ఉందా అని ఎన్టీఆర్ అడిగితే.. నాకు కొంత సందేహం ఉండే.. వనం అని తెలుసు. కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నాను అని కంటెస్టెంట్ చెప్పింది.

  5 వేల రూపాయల ప్రశ్న ఇదే

  5 వేల రూపాయల ప్రశ్న ఇదే

  4. వీటీలో ఏ జంతువు వెనుక వైపు కొవ్వు నిల్వలలు కలిగిన మూపులు ఉంటాయి?
  a) మొసలి
  b) పందికొక్కు
  c) ఒంటె
  d) కుక్క

  Answer:

  10 వేల రూపాయల 5 ప్రశ్న మీ కోసం

  10 వేల రూపాయల 5 ప్రశ్న మీ కోసం

  ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్లు వేటితో తయారు చేయబడుతాయి?

  a) లోహం
  b) ప్లాస్టిక్
  c) చెక్క
  d) సెరామిక్

  Answer: చెక్క

  20 వేల కోసం ప్రశ్న ఇదే...

  20 వేల కోసం ప్రశ్న ఇదే...

  6. భారతదేశంలో జన్మించి, జూన్ 2021లో మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా నియమించబడిన ఇంజనీరు ఎవరు?
  a) సుందర్ పిచాయ్
  b) సత్య నాదెళ్ల
  c) వినోద్ ఖోస్లా
  d) అజయ్ భట్

  Answer: సత్య నాదెళ్ల

  40 వేల కోసం 7వ ప్రశ్న

  40 వేల కోసం 7వ ప్రశ్న

  7. బ్యాంక్ పాస్‌బుక్‌లో కనిపించే IFSC code లో F అంటే ఏమిటి?

  a) ఫైనల్
  b) ఫోరం
  c) ఫైనాన్షియల్
  d) ఫ్లేర్
  Answer: ఫైనాన్షియల్

  ఎంబీఏ ఫైనాన్స్ చేసిన మీకు బ్యాంకింగ్ రంగంపై పట్టుందా అని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొంత మేరకు అని సమాధానం ఇచ్చారు. అయితే మహిళలందరూ అన్ని విషయాలను తెలుసుకోవాలి.. అదే మా ఇంటిలో కూడా చెబుతు ఉంటాను అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు.

  80000 కోసం 8 ప్రశ్న ఇదే...

  80000 కోసం 8 ప్రశ్న ఇదే...

  8. హుబే ప్రావిన్స్ యొక్క రాజధాని వూహాన్ ఏ దేశంలో ఉంది?
  a) రష్యా
  b) జపాన్
  c) చైనా
  d) దక్షిణ కోరియా

  Answer: చైనా

  కరోనావైరస్ కారణంగా వుహాన్ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది. అక్కడే వైరస్ పుట్టించారనే విషయం అన్ని దేశాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి అని కంటెస్టెంట్, ఎన్టీఆర్ చర్చించుకొన్నారు. కోవిడ్ 19 వల్ల వంటలే కాకుండా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ గురించిన విలువలు తెలిసాయి. జీవితంపై ఈ వైరస్ మొట్టికాయ వేసింది. జీవితం చిన్నది. బతికి ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలియజెప్పింది అంటూ ఎన్టీఆర్ అన్నారు. దాంతో కంటెస్టెంట్ 80 వేలు గెలుచుకొన్నారు.

  160000 రూపాయల కోసం 9వ ప్రశ్న ఇదే...

  160000 రూపాయల కోసం 9వ ప్రశ్న ఇదే...

  9. మహాభారతంలో అభిమన్యుడు ఏ యుద్ధవ్యూహంలోకి ప్రవేశించడం వలన మరణించాడు?
  a) పద్మవ్యూహం
  b) భీష్మవ్యూహం
  c) మకరవ్యూహం
  d) వ్యాసవ్యూహం

  Answer: పద్మవ్యూహం

  320000 రూపాయల కోసం 9వ ప్రశ్న ఇదే...

  320000 రూపాయల కోసం 9వ ప్రశ్న ఇదే...

  10 షేక్ హసీనా ఏ దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు?

  a) పాకిస్థాన్
  b) అఫ్ఘనిస్థాన్
  c) మయన్మార్
  d) బంగ్లాదేశ్

  Answer: బంగ్లాదేశ్

  అయితే ఈ ప్రశ్నకు కంటెస్టెంట్ తడబడింది. అఫ్ఘనిస్థాన్‌ అని చెప్పడంతో ప్రశ్నను మరోసారి చూసుకోమని చెప్పారు. దాంతో 50:50 లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. అయితే రెండు తప్పుడు సమాధానాలు తీసి వేసిన తర్వాత మయన్నార్, బంగ్లాదేశ్ మిగిలాయి. అయితే కంటెస్టెంట్ సరైన సమాధానం మయన్నార్ అంటూ చెప్పింది. అయితే మీ వద్ద మరో లైఫ్ లైన్ ఉందంటూ హెచ్చరించినా.. ఆ జవాబును లాక్ చేయమని చెప్పారు. దాంతో ఈ సమాధానం తప్పు కావడంతో కంటెస్టెంట్ శ్వేత హాట్ సీట్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1,60,000 సంపాదించిన కంటెస్టెంట్ కేవలం 10 వేలతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  ఆగస్టు 24వ తేదీ ఎపిసోడ్‌లో రెండో కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీ ముందు ఉన్న ప్రశ్నలు ఇవే..

  ఆగస్టు 24వ తేదీ ఎపిసోడ్‌లో రెండో కంటెస్టెంట్‌గా వచ్చిన సన్నీ ముందు ఉన్న ప్రశ్నలు ఇవే..

  సన్నీ ముందున్న రూ.1 వేల రూపాయల ప్రశ్న

  1. OMG అనే టెక్ట్సింగ్ వ్యక్తీకరణలో G దేనిని సూచిస్తుంది?
  a) గైడ్
  b) గాడ్
  c) గోట్
  d) గార్డ్

  Answer:గాడ్

  కంటెస్టెంట్ సన్నీ కోసం 2 వేల రూపాయల ప్రశ్న

  కంటెస్టెంట్ సన్నీ కోసం 2 వేల రూపాయల ప్రశ్న

  2. హిందూ పురాణాల్లో వీటిలో విష్ణువు పేర్లలో ఒకటి ఏది?
  a) హరి
  b) శంకర
  c) భైరవ
  d) నీలకంఠ

  Answer: హరి

  ఈ ప్రశ్నకు సన్నీ వద్ద సమాధానం లేకపోవడంతో వీడియో కాల్ ఫోన్ అనే లైఫ్‌లైన్‌ను ఉపయోగించారు. ఓ పూజారికి కాల్ చేయడంతో విష్ణు అనే సమాధానం చెప్పడంతో ఆ జవాబును సన్నీ లాక్ చేసి రెండు వేల రూపాయలు గెలుచుకొన్నారు.

  రూ.3 వేల ప్రశ్నకు సమాధానం ఇదే...

  రూ.3 వేల ప్రశ్నకు సమాధానం ఇదే...

  3. విద్యుత్ సరఫరా నిలిచిపోవడాన్ని ఏమని అంటారు
  a) అప్పర్ కట్
  b) పవర్ కట్
  c) షార్ట్ కట్
  d) క్లియర్ కట్

  Answer: పవర్ కట్

  రూ. 5 వేల కోసం సన్నీ ముందు ఉన్న ప్రశ్న

  రూ. 5 వేల కోసం సన్నీ ముందు ఉన్న ప్రశ్న

  4. గూగ్లీ అనే పదం సాధారణంగా ఏ ఆటలో వాడుతారు?
  a) క్రికెట్
  b) బాడ్మింటన్
  c) కబడ్డీ
  d) హాకీ

  Answer: క్రికెట్

  రూ. 10 వేల కోసం 5వ ప్రశ్న ఇదే..

  రూ. 10 వేల కోసం 5వ ప్రశ్న ఇదే..

  5. జూన్ 2020లో, వీటిలో భారతదేశంలో నిషేధించబడినది ఏది?
  a) ఇన్స్‌టాగ్రామ్
  b) ట్విట్టర్
  c) టిక్ టాక్
  d) స్నాప్ చాట్

  Answer: టిక్ టాక్

  ఆగస్టు 24వ తేదీన 5 ప్రశ్నలకు రెండు లైఫ్ లైన్లు ఉపయోగించుకొని సన్నీ సమాధానాలు చెప్పిన తర్వాత హ్యూటర్ మోగడంతో తొలి రోజు గేమ్ ముగిసింది. సన్నీ ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్‌లో కూడా ఆట ఆడటానికి సిద్దంగా ఉన్నారు.

  English summary
  NTR's EMK Show August 24th Episode: Shweta Lakkaraju and D Sunny participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X