Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా బిగ్‌బాస్.. నూతన్ తిరుగుబాటు.. ఇంట్లోకి డుమ్మా.. కారణం అదేనా?
Recommended Video

బిగ్‌బాస్ రియాలిటీ షో మరో రెండు రోజుల్లో ముగియనున్నది. ఇంట్లో 111వ రోజు సందడి సందడిగా కనిపించింది. ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు మళ్లీ ఇంట్లోకి వచ్చారు. ఒకరికొకరు అప్యాయంగా పలకరించుకొన్నారు. కానీ ఇంట్లోకి నాలుగోసారి అడుగుపెడుతాడని అనుకొన్న నూతన్ నాయుడు ఇంట్లోకి రాకుండా డుమ్మా కొట్టాడు. నూతన గైర్హాజర్ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్ట్ పెట్టి సందేహాలకు తెర తీశాడు. అసలేం జరిగిందంటే..
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

ఎమోషనల్‌గా గీతా ప్రయాణం
బిగ్‌బాస్ ఇంట్లో 111వ రోజు గీతా మాధురి ప్రయాణాన్ని గురించి ఎమోషనల్‌గా చూపించారు. ఆమె ఆడిన తీరును, అనుసరించిన పంథాను, ఫైనల్‌కు చేరుకొన్న విధానాన్ని ప్రతిబింబించేలా వీడియోను ప్రదర్శించారు. అది చూసిన గీతా మాధురి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకొన్నారు.

కంటతడి పెట్టిన కౌశల్
గీతా మాధురి తర్వాత కౌశల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. తన ఒంటరి పోరాటాన్ని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయని మనస్థత్వాన్ని గురించి వివరంగా చూపించారు. గత 112 రోజుల ప్రయాణాన్ని ఉద్వేగభరితంగా చూపించారు. పలుమార్లు ఆ వీడియోను చూస్తూ కౌశల్ కంటతడి పెట్టుకొన్నాడు.

నూతన్ నాయుడు డుమ్మా
ఇంటి సభ్యులు రోజువారీ కార్యక్రమాల్లో మునిగి ఉండగా, ఇంట్లోకి ఎలిమినేట్ అయిన సభ్యులు వచ్చారు. ఆప్యాయంగా పలకరించుకొన్నారు. దాదాపు అందరూ వచ్చారు కానీ నూతన్ నాయుడు గైర్హాజరు అయ్యారు. అయితే నూతన్ నాయుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది.

అర్ధాంతరంగా బిగ్‌బాస్ నుంచి
నూతన్ పెట్టిన పోస్టులో బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి చాలా సందేశాలు వచ్చాయి. ఎంతో ఆదరణ, అభిమానాన్ని చూపించిన వారికి థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. నేను అర్ధాంతరంగా బిగ్‌బాస్ నుంచి బయటకు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతూ సందేశాలు పంపారు.

పక్షపాతంగా బిగ్‌బాస్
కోట్లలో ఓట్లు వచ్చిన బిగ్‌బాస్ పరిగణనలోకి తీసుకోలేదు. బిగ్‌బాస్ కావాలనే ఇదంతా చేశాడు. పక్షపాతంతో వ్యవహరించాడు. ఇంటిలో నా పెర్ఫార్మెన్స్‌ను తప్పుగా చూపించారు అని అందరూ అంటున్నారు. కానీ దానిపై నేను మాట్లాడదలచుకోను. ఎపిసోడ్స్ చూశాక నాకు అలానే అనిపించింది.

ప్రజల తీర్పే శిరోధార్యం
రాజకీయాల్లోనైనా, బిగ్‌బాస్‌లోనైనా ప్రజా తీర్పే నాకు శిరోధార్యం. నేను ఇంటిలో నుంచి ఎలిమినేట్ అయినందుకు చెప్పడం లేదు. ప్రజాతీర్పుకు అనుగుణంగానే ఎలిమినేషన్ జరుగాలి. చూసే జనానికి కూడా అనిపించాలి. ఒక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా విషయం ఉండాలనే విషయాన్ని బిగ్‌బాస్ మరిచిపోకూడదు.
వెన్నుతట్టి ప్రోత్సాహం
బిగ్‌బాస్ షోలోనే కాదు బయటకూడా ప్రతీక్షణం నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ తలవచ్చి నమస్కరిస్తున్నాను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ, బిగ్‌బాస్, స్టార్ మా యాజమాన్యానికి, ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అందరికీ రుణపడి ఉంటాను అని నూతన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు.