»   » ఈటీవీ న్యూస్‌ కొత్త ఛానల్‌ ప్రారంభం

ఈటీవీ న్యూస్‌ కొత్త ఛానల్‌ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కటక్‌ : ఈటీవీ న్యూస్‌ ఒడియా ఛానల్‌ సోమవారం భువనేశ్వర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై ఛానల్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఈటీవీ న్యూస్‌ ఒడియా ఛానల్‌ సహకరించాలని కోరారు. కార్యక్రమానికి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌, ఒడిశా ఎంపీ ప్రసన్నపాట్సానిలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈటీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌ హెడ్‌ జగదీశ్‌ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ...ఈటీవీ న్యూస్‌ పలు ప్రాంతీయ భాషల్లో వార్తలు వెలువరిస్తూ ప్రజలకు చేరువయిందన్నారు. దేశంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతినిధులను నియమించడంలో ఈటీవీ తొలిఛానల్‌గా నిలిచిందన్నారు.

Odisha CM Naveen Patnaik launches 24x7 'ETV News Odia' Channel

అలాగే...సమాచారంలో పక్షపాతం లేకుండా ప్రజాసమస్యలు వెలుగులోకి తీసుకొస్తూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు చేర్చడంలో ఈటీవీ న్యూస్‌ వారధిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలు అతి తక్కువ సమయంలో ప్రజల వద్దకు చేర్చడంలో ఈటీవీ న్యూస్‌ ముందుందని తెలిపారు.

కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఒడిశాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను జగదీశ్‌ చంద్ర శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఈటీపీఎల్‌ సీఈవో బాపినీడు, పనోరమా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.సుబ్బనాయడు తదితరులు పాల్గొన్నారు.

English summary
One of the largest networks of satellite television channels in India, running nine news channels in different regional languages ETV News Network today launched its 24x7 Odia News Channel at Bhubaneswar. ETV News Odia 24x7 news channel was formally launched by Hon’ble Chief Minister of Odisha Sri Naveen Patnaik.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu