For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth: హీరో అయ్యాక కూడా సుధీర్ పరువు తీస్తున్నారు.. రష్మితో మళ్ళీ బూతు పంచ్ లు!

  |

  జబర్దస్త్ ద్వారా మంచి హీరోగా గుర్తింపు అందుకున్న సుదీర్ ఇప్పుడు సినిమా హీరోగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన సుధీర్ ఇప్పుడు తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అతని స్థాయి మాత్రం కొంత పెరిగింది అనే చెప్పాలి. ఈ తరుణంలో జబర్దస్త్ సుధీర్ పై మళ్ళీ ఎప్పటిలానే బూతు పంచులు వేస్తూ ఉండడం అతని అభిమానులను కాస్త చిరాకు తెప్పిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  జబర్దస్త్ లో హార్డ్ వర్క్

  జబర్దస్త్ లో హార్డ్ వర్క్

  జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ గా చాలా కాలం పాటు కొనసాగిన సుధీర్ ఒక రైటర్ నుంచి టీం లీడర్ వరకు ఎదిగాడు. అతన్ని మొదట్లో కేవలం రైటర్ గానే ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ గ్రూప్లో ఒక చిన్న కమెడియన్ తరహాలో పాత్రలు చేస్తూ మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇక మొత్తానికి టీం లీడర్ గా సుదీర్ మరో రేంజ్ కి వెళ్ళాడు.

   మరో రేంజ్ కు వెళ్లిన సుధీర్

  మరో రేంజ్ కు వెళ్లిన సుధీర్

  జబర్దస్త్ లో ఒక తరం వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ సుధీర్ గ్యాంగ్ జబర్దస్త్ స్థాయిని మరొక రేంజ్ కు తీసుకువెళ్లింది అని చెప్పవచ్చు. ఊహించిన విధంగా ఎక్కువ స్థాయిలో అయితే సుడిగాలి సుదీర్ టీంకు అత్యధిక స్థాయిలో క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా సుధీర్ జబర్దస్త్ లో అందరి కంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న టీం లీడర్లలో ఒకరిగా కొనసాగాడు.

  బాక్సాఫీస్ హిట్

  బాక్సాఫీస్ హిట్

  ఇక ఇప్పుడు సుధీర్ హీరోగా కూడా తన ప్రయత్నాలను కంటిన్యూ చేస్తున్నాడు. మొదట్లో కొంత ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ గత ఏడాది ఏడది గాలోడు సినిమాతో మాత్రం మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 6 నుంచి 7 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక సుధీర్ ఇప్పుడు మరింత మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

  సుధీర్ సక్సెస్

  సుధీర్ సక్సెస్

  అయితే సుధీర్ స్థాయి ఇప్పుడు పెరగడంతో అతనికంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో కూడా అతనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. గాలోడు సినిమా కేవలం కమర్షియల్ గా తెరపైకి వచ్చినప్పటికీ అతని ఫ్యాన్ ఫాలోవర్స్ తోనే ఆ సినిమా ఎంతో కొంత మాస్ ఏరియాలలో మంచి గుర్తింపును అందుకుంది. దాన్ని బట్టి సుదీర్ క్రేజ్ ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

   మళ్ళీ అదే తరహాలో

  మళ్ళీ అదే తరహాలో

  అయితే ఇప్పుడు సుదీర్ రేంజ్ పెరిగిన తర్వాత కూడా రష్మీతో మళ్ళీ ఎప్పటిలానే అదే తరహా బూతు అర్ధలు వచ్చేలా షోలలో కామెడీ పంచులు వేయడం ఓ వర్గానికి అంతగా నచ్చడం లేదు. రీసెంట్ గా జబర్దస్త్ షోలో కొత్త కమెడియన్స్ ఒక స్కిట్ అయితే మరింత డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చేలా సుదీర్ పై సెటైర్లు వేశారు. ఇక ఎదురుగా రష్మీ కూడా ఉండడంతో మరింత ఘాటుగా రియాక్ట్ అయినట్లు అనిపించింది.

  ఇవే తగ్గించుకోండి..

  ఇవే తగ్గించుకోండి..

  రీసెంట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో రష్మీకి యువరాజు ఉండేవాడు అని చెబుతూ కామెంట్స్ చేశారు. మన రాజ్యంలో ఉండేవాడు కానీ ఇప్పుడు పక్క రాజ్యంలో దండయాత్రకు వెళ్ళాడు అని మళ్ళీ వస్తే మన వాళ్ళు దండయాత్ర చేస్తామన్నారు.. అని అతనిపై జోకులు వేశారు. ఈ తరహా జోకులపై సుధీర్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. షో నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా అతనిపై మళ్ళీ ఈ తరహా పంచులు వేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అలాగే సుధీర్ రష్మీ ఫ్రెండ్స్ అని చాలాసార్లు క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అలా దండయాత్రలు అని వారి మధ్యలో ఏదో ఉంది అని ఎందుకు అంటారు అని అంటున్నారు. ఇక విని విని విసుగు వచ్చేసింది అని.. ఇకనైనా ఇవి తగ్గించుకోండి అంటూ జబర్దస్త్ ఫాలోవర్స్ సైతం కౌంటర్ ఇస్తున్నారు.

  English summary
  Once again shocking jokes on Rashmi and sudigali sudheer in Jabardasth show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X