»   » ‘గబ్బర్ సింగ్’ సంచలనం... మగధీర రికార్డ్ బద్దలు

‘గబ్బర్ సింగ్’ సంచలనం... మగధీర రికార్డ్ బద్దలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్‌పైనే కాదు... స్మాల్ స్క్రీన్‌పై కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈచిత్రం బుల్లితెరపై మగధీర రికార్డును బద్దలు కొట్టింది. నెం.1 హిట్ సినిమాగా రుజువు చేసుకుంది. పవన్ కళ్యాణ్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు.

మగధీర చిత్రం జులై 31, 2009లో విడుదలయింది. వెండితెరపై అప్పట్లో నెం.1 హిట్‌గా నిలిచిచిన ఈచిత్రం..... బుల్లితెరపై ప్రదర్శించగా అత్యధికంగా 22 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు టీవీల్లో ప్రదర్శించ బడ్డాయి. అయితే ఏ సినిమా కూడా ఆ మార్కును అందుకోలేక పోయాయి.

చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చిత్రం ఆమార్కును క్రాస్ చేసి 'మగధీర' రికార్డను బద్దలు కొట్టింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది.

పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్‌పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు.

English summary
Power Star Pawan Kalyan is considered as the No. 1 actor in the Telugu film industry. The actor is not only popular on big screens, but also on small screens. Yes! His Blockbuster movie Gabbar Singh has proved it. The Harish Shankar directed flick has garner the highest amount of TRP ratings, beating the previous record of super-hit film Magadheera starring Ram Charan Teja and Kajal Aggarwal in leads.
Please Wait while comments are loading...