»   » 'లం...కొడుకా..ఒరేయ్ నీ యమ్మ' అంటూ టీవి లైవ్ లో కోపంతో పోసాని, పెద్ద గొడవ

'లం...కొడుకా..ఒరేయ్ నీ యమ్మ' అంటూ టీవి లైవ్ లో కోపంతో పోసాని, పెద్ద గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిని ఆవేశమొస్తే తట్టుకోలేమని తెలుసున్న వాళ్లు చెప్తారు. ఆయన తను నమ్మింది బలంగా చెప్పటానికి వెనకాడరు. ఈ నేపధ్యంలో ఆయన కామెంట్స్ ఎప్పటికప్పుడు సంచలనం రేపుతూంటాయి. తాజాగా ఆయన తెలుగులోని ప్రముఖ టీవి ఛానెల్ టీవి 5 లైవ్ పోగ్రామ్ కు వచ్చారు. ఆక్కడ ఆయన కోపం హద్దులు దాటింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే నీయమ్మ అంటూ కోపంతో ఊగోపోయేదాకా. ప్రముఖ కాంగ్రేస్ నేత విహెచ్ హనుమంతరావు మీద ఆయన మండిపడ్డారు.

లైవ్ డిస్కషన్ ఏమిటీ అంటే..సరిహద్దుల్లో సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ విషయం. సర్జికల్ స్ట్రెక్స్ గురించి చర్చా కార్యక్రమానికి పోసాని ని కూడా పిలిచారు. ఆయనతో పాటు కాంగ్రేస్ నేత విహెచ్, సిపీఐ నారాయణ కూడా వచ్చారు. ఈ డిబేట్ లో భాగంగా పోసాని..తాను మోడీని అభిమానిస్తానని, ఇండియాలో మోస్ట్ హానెస్ట్ పర్శన్ మోడి అని, తాను బీజెపీ పార్టీ కాదని అన్నారు.

Video Credits : TV5 News

అలాగే మోడీని తాను చిన్ననాటి నుంచీ చూస్తున్నానని, ఆయనపై ఒక అవినీతి మచ్చకూడా లేదని తేల్చి చెప్పారు. అలాంటి వ్యక్తి స్వయంగా పాకిస్దాన్ వెళ్లి ..ప్రధాని నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్లకు దండం పెట్టి, ఒఖ చీర ఇచ్చి, అన్నం తిని, హిందూ, ముస్లిం భాయ్ భాయి అని చెప్పినా , కలిసి ఉందామన్నా పాకిస్దాన్ వినలేదని, అలాంటివారితో ఎన్ని సార్లు వెన్నుపోటు పొడిపించుకోవాలని, వాళ్లకి మోడి సరైన సమాధానం చెప్పారని అన్నారు.

 చదువుకున్నవాడిని, పిచ్చి కుక్కలా

చదువుకున్నవాడిని, పిచ్చి కుక్కలా

దాంతో విహెచ్ హనుమంతరావు...మోడీ గురించి మాకెందుకు , చర్చను ప్రక్కదారి పట్టిస్తున్నావంటూ కోపం గా అన్నారు. దానికి పోసాని మాట్లాడుతూ..తాను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరూ కల్పించుకోవద్దని, ఎవరైనా మాట్లాడుతుంటే తాను మాట్లాడనని, తాను చదువుకున్నవాడినని, పిచ్చి కుక్కని కాదని, వాగితే వాగటానికి, కుక్కలాగ మాట్లాడనని, తనకు ఓ పాలసీ ఉందని, తనకు మోడీ అంటే ఇష్టమని, పొడుగుతానని, నువ్వు ఎవరిడవి మాట్లాడవద్దని అనటానికి అంటూ ఓ రేంజిలో ఫైర్ అయ్యారు.

ఎక్కువ మాట్లాడుతున్నావ్

ఎక్కువ మాట్లాడుతున్నావ్

దాంతో వీహెచ్ మళ్లీ...ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మోడీ అంటే అంత ఇష్టమైతే బయిట మాట్లాడుకో..అని గట్టిగా ఒరేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని తెలంగాణా స్లాంగ్ లో అరిచారు.

 బూతులతో ..

బూతులతో ..

అప్పుడు పోసాని కూడా సహనం కోల్పోయారు. ఆయన ఒరేయ్ అంటే తీవ్ర స్వరంతో గొంతు పెంచి.. 'లం...కొడుకా..ఒరేయ్ నీ యమ్మ' అంటూ బూతులు తో వీహెచ్ మీదకు వెళ్లారు. వీహెచ్ కూడా అంతే కోపంగా మీదుకు వచ్చారు.

 ఎలర్టైన స్టూడియోవారు

ఎలర్టైన స్టూడియోవారు

ఈ లోగా స్టూడియోవాళ్లు ఎలర్టై, కెమెరాని ఆపి, వెళ్లి ఇద్దరినీ పట్టుకున్నారు. లైవ్ ఆపి పోసానికి నచ్చ చెప్పి పంపించారు. తర్వాత యధాతధంగా లైవ్ ని కొనసాగించారు. అయితే పోసాని మాట్లాడిన మాటలు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

 ఒక్క పైసా తీసుకోలేదంటూ...

ఒక్క పైసా తీసుకోలేదంటూ...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పోసాని తన దైన శైలిలో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'చిరంజీవి చాలా నిజాయితీ పరుడు. ఎందుకంటే, గతంలో తనకు ప్రజా రాజ్యం పార్టీ సీటు ఇచ్చినపుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు అని పోసాని చెప్పుకొచ్చారు.

మాట్లాడేందుకు పవన్ గురించి

మాట్లాడేందుకు పవన్ గురించి

ఇక ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్నించగా.. ఒక వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే, ఆ వ్యక్తి నిజాయితీ పరుడైనా అయి ఉండాలి, లేదా చెడ్డ వ్యక్తిత్వం గలవాడైనా అయి ఉండాలి అని అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు దాట వేసే ప్రయత్నం చేసారు పోసాని.

పవన్ పార్టీ అర్దం కాలేదు

పవన్ పార్టీ అర్దం కాలేదు

జనసేన పార్టీ గురించి ప్రశ్నించగా.. ఆ పార్టీ గురించి ఇంతవరకూ తనకేమీ అర్థం కాలేదని, అర్థమయ్యాక దీనికి సమాధానం చెబుతానని పోసాని చెప్పుకొచ్చారు. పవన్, పోసాని చాలా సినిమాల్లో కలిసి నటించారు. రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్టైన అత్తారింటికి దారేదిలో పోసాని, పవన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఎమ్మల్యేగా ఓడిపోవటానికి కారణం

ఎమ్మల్యేగా ఓడిపోవటానికి కారణం

2009 ఎన్నికల సమయంలో జరిగిన తన ఓటమిని గుర్తు చేసారు. ఆ ఎన్నికల్లో ఆయన చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.నేను డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే నాడు ఓడిపోయాను' అని పోసాని చెప్పారు

 స్టార్ హీరో అయినా..

స్టార్ హీరో అయినా..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని సల్మాన్ ను తీవ్రవాది విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచిన సల్మాన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని పోసాని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటులను దేశం విడిచి వెళ్ళాలని ఎంఎన్ఎస్ పార్టీ బెదిరించిన సంగతి తెలిసిందే.

 ఎందుకు పారిపోయాడు

ఎందుకు పారిపోయాడు

సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడేం కాదని, అతడు ఉత్తముడైతే, ఆరోజు తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు పోసాని. ఆయన అన్న మాటలకు మంచి రెస్పాన్స్ స్పందన అంతటా లభించింది.

కాస్ట్ పేరు చెప్పి అడిగా

కాస్ట్ పేరు చెప్పి అడిగా

నేను పోసాని కృష్ణమురళి, నేను కమ్మోడిని, తనను చిరంజీవి పంపించాడు గెలిపించండి' అని ప్రజలను అడిగానని అన్నాడు. గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా, అంతే కానీ డబ్బులు ఖర్చుపెట్టను అని ప్రజలకు చెప్పాను అది నచ్చలేదు. అందుకే ఓడించారని పోసాని తెలిపాడు.

 సిగ్గుపడకుండా మొండి మొలతో..

సిగ్గుపడకుండా మొండి మొలతో..

ఏ విషయాన్ని అయినా తాను మొహమాటం లేకుండా చెబతాను. నిజాయితీగా మాట్లాడతాను. సిగ్గుపడటం నాకు తెలియదు. మొడిమొలతో పరిగెత్తమన్నా సిగ్గులేకుండా పరుగెడతానని చెప్పాడు. నటుడిగా మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తన కలాన్ని పక్కన పెట్టినట్లు తెలిపారు.

English summary
At an INDIA v/s PAKISTAN debate in TV5 News Channel about Surgical Strikes, Posani was instigated by Congress Leader V Hanumantha Rao and ended up in getting a tight slap .
Please Wait while comments are loading...