Power Astra Elimination: రీతూ చౌదరీకి వరంగా.. శ్రీజ దమ్ముకు శాపంగా పవర్ అస్త్ర.. ఎలిమినేషన్‌లో ట్విస్టు ఏమిటంట

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోలో తొలిసారి ఈ సండే బిగ్‌గా మారడమే కాకుండా అనేక ట్విస్టులను చూపించబోతున్నది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తోపాటు ఫైర్ స్ట్రామ్‌ పేరుతో ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇవ్బబోతున్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో పవర్ అస్ర కీలకం కాబోతున్నది. అయితే పవర్ అస్త్ర ఏమిటి? దానికి ఉన్న పవర్ ఎంటి? ఆ పవర్ ఓ కంటెస్టెంట్‌కు వరంగా ఎలా మారింది? మరో కంటెస్టెంట్‌కు ఎలా శాపంగా మారింది అనే వివరాల్లోకి వెళితే..

ఇంటిలో జరిగిన టాస్క్‌లో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ చూపించిన కంటెస్టెంట్లకు గోల్డెన్ స్టార్స్ ఇచ్చారు. గోల్డెన్ స్టార్స్ పొందిన కంటెస్టెంట్లను యాక్టివిటీ రూమ్‌లో పిలిచి.. ఇతర కంటెస్టెంట్లకు సంబంధించిన తాళం చెవిని విరగగొట్టమని చెప్పాడు. దాంతో తమకు నచ్చని కంటెస్టెంట్ల పేరుతో ఉన్న తాళం చెవిని విరగొట్టారు. ఆ తర్వాత ఆరుగురు గోల్డెన్ స్టార్ పొందిన ఆటగాళ్లను యాక్టివిటి రూమ్‌లోకి పిలిచి.. ఈ గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ పొందిన పవర్ అస్త్రను ఇమ్మాన్యుయేల్ పొందాడని హోస్ట్ నాగార్జున చెప్పాడు. అలా ఇమ్మాన్యుయేల్‌కు పవర్ అస్త్ర లభించింది. తనకు పవర్ అస్త్ర ఇస్తూ.. ఇది ఓ కంటెస్టెంట్‌ను కాపాడటానికి, లేదా ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది అని హింట్ ఇచ్చాడు.

Power Astra Dramatic Eliminatation of Srija Dammu

అయితే శనివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున వెల్లడించారు. అయితే ఈ ఎలిమినేషన్‌లో చివరకు ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ మిగిలారు. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఫ్లోరా సైనీ తొలి కంటెస్టెంట్‌గా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. దాంతో ఈ సీజన్‌లో సైనీ చాప్టర్ ముగిసింది. ఇక డబుల్ ఎలిమినేషన్‌లో రీతూ చౌదరీకి తప్పని ఎలిమినేషన్. అక్కడే భారీ ట్విస్ట్‌ను బిగ్‌బాస్ ప్లేస్ చేశాడు.

అయితే అప్పటికే ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న పవర్ అస్త్రను ఉపయోగించి రీతూ చౌదరీని కాపాడుతావా? ఇంటిలో అర్హత లేని మరో కంటెస్టెంట్‌ను బయటకు పంపే అధికారాన్ని ఆయనకు బిగ్‌బాస్ ఇచ్చాడు. దాంతో తన చేతిలో ఉన్న పవర్ అస్ట్రను ఉపయోగించి రీతూ చౌదరీని కాపాడాడు. ఈ పవర్ అస్ట్ర ఆమెకు వరంగా మారింది. దాంతో ఎలిమినేషన్ నుంచి హ్యాపీగా బయటపడింది. అయితే ఈ సేఫ్ తర్వాత రీతూను సీక్రెట్ రూమ్‌కు పంపారనే విషయం తెలిసింది. అయితే ఈ విషయం క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, పవర్ అస్ట్రను ఉపయోగించి.. ఇంటిలో ఉండటానికి అర్హత లేని కంటెస్టెంట్‌ ఎవరని అడిగితే.. శ్రీజ దమ్ము పేరును ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. దాంతో అప్పటి వరకు సేఫ్ జోన్‌లో ఉన్న శ్రీజ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. అలా పవర్ అస్ట్ర ఆమెకు శాపంగా మారింది. అయితే శ్రీజ దమ్ము ఎలిమినేషన్ విషయంలో వైల్డ్ కార్డు ఎంట్రీల ఓటింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని ఆమెను ఎలిమినేట్ చేసినట్టు తెలిసింది. ఇలాంటి ట్విస్టులు, షాక్‌లతో సాగిన ఎపిసోడ్ ఆడియెన్స్‌కు మంచి థ్రిల్ పంచుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X