Don't Miss!
- Lifestyle
ఆయుర్వేదం ప్రకారం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా..కిడ్నీలో రాళ్లను కరిగించే ఆహారాలు!
- News
Hyderabad: హానీమూన్ కోసం వెళ్లి.. గుండె పోటుతో మృతి చెందిన సాఫ్ట్ వేరు ఉద్యోగి..
- Finance
Spicejet: రిపబ్లిక్ డే సేల్.. విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు.. నాలుగు రోజులే ఛాన్స్..
- Sports
IND vs NZ:టామ్ లాథమ్ వికెట్ కోహ్లీ ఐడియానే.. ఉచ్చు బిగించి ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్!
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Bigg Boss Winner: ఆరో సీజన్ విజేత ఆ కంటెస్టెంటే.. పేరు లీక్ చేసిన మెగాస్టార్.. నాగార్జున అసంతృప్తి
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలో పరిచయం అయింది బిగ్ బాస్. చాలా కాలం క్రితమే హిందీలోకి వచ్చిన ఈ రియాలిటీ షో.. ఆరేళ్ల క్రితమే తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఎన్నో అనుమానాలతో వచ్చినా.. మన దగ్గర ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుని సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌ను ఎంతో ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సీజన్ విన్నర్ గురించి ఓ సెలెబ్రిటీ హింట్ ఇవ్వడం కలకలం రేపింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

చివరి దశలో మరింత ఎక్కువగా
బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇది ఎప్పుడు వచ్చినా మరింత ఎక్కువ రేటింగ్‌నే సంపాదించుకుంటోంది. అయితే, ఆరో సీజన్ మాత్రం నిరాశజనకంగా సాగుతోంది. అయితే, ఇప్పుడిది చివరి దశకు చేరడంతో ఇందులో ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ సీజన్‌కు రేటింగ్ మరింత ఎక్కువగానే వస్తోంది.
Bigg Boss: శ్రీహాన్ బండారం బట్టబయలు.. సిరి ఉన్నా ఆ అమ్మాయితో.. ఒకేసారి ఇద్దరితో అంటూ ట్విస్ట్
|
ఫ్యామిలీ వీక్.. హౌస్‌లో సందడి
బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్‌లో చివరి వారాల్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారు. ఇందులో మంగళవారం ఆది రెడ్డి, రాజశేఖర్ ఫ్యామిలీలు.. బుధవారం ఫైమా, శ్రీ సత్య, రోహిత్ కుటుంబాలు.. గురువారం శ్రీహాన్, ఇనాయా, కీర్తి భట్ ఫ్యామిలీలు.. శుక్రవారం రేవంత్ మదర్ వచ్చారు. వీళ్ల రాకతో నాలుగు రోజులూ షోలో రకరకాల ఎమోషన్స్ కనిపించాయి.
|
మరికొందరితో నాగార్జున రచ్చ
బిగ్ బాస్ ఆరో సీజన్ 12వ వారం మొత్తం కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలోనే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మరోసారి వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేజ్ మీదకు వచ్చారు. అలా ఎంటరైన గెస్టులు అంతా హోస్ట్ నాగార్జునతో కలిసి రచ్చ రచ్చ చేశారు. దీంతో వీకెండ్ ఎపిసోడ్ ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగిపోయింది.
బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్

రోహిత్ కోసం మెగాస్టార్ ఎంట్రీ
ఆరో సీజన్‌లోకి జంటగా వచ్చి.. ఎంతో మంచి పేరును సంపాదించుకున్న ఆటగాడు రోహిత్ సాహ్నీ. మెరీనాతో కలిసి వచ్చిన అతడు.. ఆమె వెళ్లిపోయినా ప్రేక్షకుల మనసులు దోచుకుని హౌస్‌లో కొనసాగుతోన్నాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వీక్‌లో రోహిత్ కోసం వాళ్ల అమ్మగారు వచ్చారు. అలాగే, శనివారం వాళ్ల తమ్ముడు డింపూతో పాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చాడు.

రోహిత్ అలా ఒప్పుకుంటాడని
రోహిత్ సాహ్నీ కోసం వచ్చిన ప్రభాకర్, డింపూ అతడిలో మరింత ఉత్సాహాన్ని పెంచేలా మాట్లాడారు. ఆ సమయంలో 'రోహిత్ ప్రతీది తాను చేయకపోయినా ఎదుటి వాళ్లతో వాదించడం ఇష్టం లేక ఒప్పేసుకుంటాడు. అంత మంచోడు అతడు. అది అతడికి ఇబ్బందులు కూడా తెచ్చింది' అని ప్రభాకర్ అన్నాడు. అలాగే, డింపూ కూడా తన అన్న ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.
పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!

విజేత పేరుపై హింట్ ఇచ్చాడు
స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వగానే ప్రభాకర్‌ను రేవంత్ పలకరించాడు. దీంతో అతడు 'హేయ్ రేవంత్.. నీకేంటి నువ్వంటే ఇక్కడ పడి చస్తున్నారు. రేవంతే మొత్తం టాప్‌లో ఉంటున్నాడు. అతడికే ఎక్కువ వస్తున్నాయి' అంటూ విజేత అతడే అంటూ హిట్ ఇచ్చేశాడు. దీంతో నాగార్జున అతడిని ఆపి.. నువ్వు ఎవరి కోసం వచ్చావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అని ప్రశ్నించాడు.

వాళ్లపై నాగార్జున అసంతృప్తి
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ విజేతగా నిలిచే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. దీనిపై హోస్ట్ అక్కినేని నాగార్జున సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, 'స్టేజ్ మీదకు తీసుకొచ్చే ముందు వాళ్లకు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పాలి కదా' అంటూ ఆయన షో నిర్వహకులపై ఫైర్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.