For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రదీప్‌తో పెళ్లి చూపులు.. యువ సింగర్‌తో ప్రేమ: షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసిన బ్యూటీ.!

  By Manoj Kumar P
  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో సరికొత్త ప్రోగ్రామ్‌లు వస్తున్నాయి. అలాంటి వాటి ద్వారా చాలా మంది తమలోని టాలెంట్‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఒకే ఒక్క పాటతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు యువ సింగర్ యశస్వీ కొండెపూడి. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఓ షోలో అతడు పాడిన పాట కొన్ని కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడీ సింగర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. యాంకర్ ప్రదీప్‌తో పెళ్లి చూపులు చేసుకున్న ఓ అమ్మాయి.. షో జరుగుతుండగానే యశస్వీకి నేరుగా ప్రపోజ్ చేసేసింది. ఆ వివరాలు మీకోసం.!

  ‘లైఫ్ ఆఫ్ రామ్'.. యశ్ లైఫ్ మార్చింది

  ‘లైఫ్ ఆఫ్ రామ్'.. యశ్ లైఫ్ మార్చింది

  జీ తెలుగులో ‘సరిగమప ద నెక్ట్స్ సింగింగ్ ఐకాన్' అనే షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. టాలెంట్ ఉండి అవకాశం రాని వాళ్లను వెలుగులోకి తెచ్చేందుకు దీన్ని రూపొందించారు. దీని ద్వారా వెలుగులోకి వచ్చాడు యశస్వీ కొండెపూడి. మొదటి ఎపిసోడ్‌లో ‘జాను' మూవీలోని ‘లైఫ్ ఆఫ్ రామ్' అనే థీమ్ సాంగ్‌ను పాడాడు. దీనికి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.

  ఎక్కడ చూసినా అదే పాట.. రికార్డులు

  ఎక్కడ చూసినా అదే పాట.. రికార్డులు

  యశస్వీ పాడక ముందు వరకు ఆ పాట పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, అతడు ‘సరిగమప' షోలో దీన్ని ఆలపించిన తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. గుక్క తిప్పుకోకుండా పాడడం ఈ పాటలోని స్పెషాలిటీ. అందుకే ఆ సింగర్ అంతగా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, బుల్లితెరపై యశస్వీ పాడిన పాట ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. దీంతో ఇది వైరల్ అయిపోయింది.

  ఆ ఈవెంట్‌లో పాట.... అదే రెస్పాన్స్

  ఆ ఈవెంట్‌లో పాట.... అదే రెస్పాన్స్

  ఒకే ఒక్క పాట తర్వాత యశస్వీ కెరీర్ మారిపోయింది. అతడు బిగ్ సెలెబ్రిటీ అయిపోయాడు. దీంతో జీ తెలుగులో ఆదివారం ప్రసారం కానున్న ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్ 2020'లోనూ అతడు దీన్ని మళ్లీ ఆలపించాడు. రేణు దేశాయ్, జానీ మాస్టర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ షోలోనూ యశస్వీ పాటకు మంచి స్పందన వచ్చింది. అందరూ అతడికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

  24 గంటలూ అదే చూసుకుంటూ ఉన్నా

  24 గంటలూ అదే చూసుకుంటూ ఉన్నా

  ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌లో ఎవరూ ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది. యశస్వీ పాటను విన్న వెంటనే రీతు శేఖర్ అనే నటి అతడిని హగ్ చేసుకుని ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ‘యశస్వీ ప్రోమో చూసినప్పుడు ఆ వాయిస్ విని నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయాను. ఆరోజు అతను పాడిన పాటను మా ఇంట్లో డే మొత్తం చూస్తూనే ఉన్నా' అని చెప్పుకొచ్చింది.

  షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసేసింది

  షో జరుగుతుండగానే ప్రపోజ్ చేసేసింది

  ఆమె మాట్లాడుతుండగా అందరూ ఆశ్చర్యంతో చూస్తూ కనిపించారు. ఆ సమయంలోనే రీతు.. యశస్వీతో మాట్లాడుతూ ‘నేను నీ వాయిస్‌కు ప్రేమలో పడిపోయాను. వేరే ఉద్దేశ్యం లేకుండా నీ ఫ్యాన్‌గా మాట్లాడుతున్నా. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే ఏమన్నా ఉన్నా నాకు ఓకే' అంటూ షో మధ్యలోనే ప్రపోజ్ చేసింది. దీంతో రేణు సహా అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు.

  Bigg Boss Telugu 4 : జోర్దార్ సుజాత ఎలిమినేటెడ్!
  ప్రదీప్‌తో పెళ్లిచూపులు.. సింగర్‌తో లవ్

  ప్రదీప్‌తో పెళ్లిచూపులు.. సింగర్‌తో లవ్

  రీతు శేఖర్.. గతంలో యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ‘పెళ్లి చూపులు' అనే షోలో ఒక కంటెస్టెంట్‌గా వచ్చింది. ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతడి కళ్లలో కళ్లు పెట్టి చూసి నీ ప్రేమలో పడిపోయా అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత ప్రదీప్‌ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేసింది. కానీ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత జబర్ధస్త్ సహా పలు షోలలో కూడా కనిపించిందీ బ్యూటీ.

  English summary
  Rithu Sekhar is one of the contestant who got selected in the reality show “PelliChoopulu“. She is one of the contestant out of 14 contestants. Pradeep Machiraju is the Groom of the contest. He will select one Bride out of 14 contestant by the end of the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X