Bigg Boss Telugu: క్యారెక్టర్ వదులుకోవద్దు.. రీతూ చౌదరీపై ప్రియా శెట్టి షాకింగ్ కామెంట్స్
Priya Shetty: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. ఎన్నాడు చూడని ట్విస్టులు, టర్న్స్, కాంట్రవర్సీలతో గేమ్ ఇంట్రెస్టింగ్ గా సాగిపోతుంది. ఇప్పటి వరకూ మూడు వారాలు విజయవంతంగా సాగిన ఈ షో నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. అయితే.. ఇటీవల బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియశెట్టి, ఈ అమ్మడు షోలో తన ఇమేజ్, లవ్ ట్రాక్‌లపై వచ్చిన విమర్శలపై తన మనసులోని మాటను బయటపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తాను పాటించిన సెల్ఫ్ బౌండరీలు, కళ్యాణ్ పడాలతో వచ్చిన "లవ్ ట్రాక్" గాసిప్‌పై వివరంగా స్పందించింది.
తాజాగా ప్రియశెట్టి ఇంటర్య్వూలో పాల్గొంది. ఇందులో ప్రియశెట్టి మాట్లాడుతూ "బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాతే లవ్ చేయాలా? బయట చేసుకోవచ్చు కదా. నాకు ఆ ఉద్దేశం లేదు. షోలో జనం నన్ను ఆ దృష్టితో చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే నాకు నేను బౌండరీస్ పెట్టుకున్నా. మా అమ్మ నాన్న కూడా ఆ షో చూస్తుంటారు. వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపొద్దున వాళ్లు మీ అమ్మాయి ఇలా ఉందంట కదా అని అడిగితే వాళ్లేం చెప్తారు? అందుకే లవ్ ట్రాక్‌లను పూర్తిగా దూరం పెట్టాను" అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని, ఆమె చెప్పిన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈసారి రీతూ, వయసులో తనకంటే చిన్నవాళ్లైన డీమాన్ పవన్, కళ్యాణ్ పడాలతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మొదలుపెట్టింది. ముగ్గురి మధ్య రొమాంటిక్ క్షణాలు, హగ్‌లు, ముద్దులు, కౌగిలింతలు, చిన్న చిన్న తగవులు ఇవన్నీ బిగ్ బాస్ హౌస్‌లో ప్రధాన ఆకర్షణగా మారాయి. ఈ విషయంపై ప్రియశెట్టి పరోక్షంగా స్పందించింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత చాలామంది కంటెస్టెంట్లు కంటెంట్ కోసం లవ్ ట్రాక్‌లు, సెన్సేషన్ సృష్టించే వేషాలు వేస్తారని ప్రియశెట్టి చెప్పింది. "పాత సీజన్‌ల లవ్ ట్రాక్‌లతో నన్ను కలుపుతూ రిఫరెన్స్‌లు ఇచ్చేస్తున్నారు. నాకు అలాంటి ట్రాక్‌లు వద్దు. అగ్నిపరీక్ష నుంచే నేను కంఫర్టబుల్ కాదని చెప్పేశాను. ఆ విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నా" అని పేర్కొంది.
కళ్యాణ్ పడాలతో తనకు లవ్ ట్రాక్ నడుస్తోందనే ప్రచారంపై ఆమె ఇలా చెప్పింది. "అతను నాకంటే చిన్నోడు. నన్ను 'పెద్దక్కా', 'సుపరక్కా' అని పిలిచేవాడు. నేను సూర్పనక అని జోక్ చేశానంటే నవ్వేవాడు. మేమిద్దరం ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నాం. ఎప్పుడూ చెడు ఉద్దేశం లేదు. నేను ఏడుస్తుంటే ఓదార్చడానికి వచ్చేవాడు కానీ నేను తోసేసేదాన్ని. నాకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించేట్టుగా కళ్యాణ్ ఏమీ చేయలేదు. నా జోన్‌లోనే నేను ఉన్నాను" అని క్లారిటీ ఇచ్చింది. ఆమెకూ కళ్యాణ్‌కీ బిగ్ బాస్ హౌస్‌లో ఎటువంటి రొమాంటిక్ అజెండా లేదని ప్రియశెట్టి మాటలతో తెలుస్తోంది.
ప్రియశెట్టి షో ఫార్మాట్‌పై మాట్లాడుతూ 'బురదలో దిగి కాళ్లకి మట్టి అంటకుండా బయటకు రావడం ఎంత కష్టమో, బిగ్ బాస్ హౌస్‌లో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా రావడం కూడా అంతే కష్టం. ముఖ్యంగా ఆడపిల్లలకు మరకమంచిదే అంటించేస్తారు. కానీ నేను ఆ విషయంలో క్లియర్‌గా ఉన్నా. నా సెల్ఫ్ బౌండరీస్ పెట్టుకున్నా. ఇమేజ్ డ్యామేజ్ కాకుండా బయటకు రావడం కష్టపడ్డాను' అని చెప్పింది. ప్రియశెట్టి బిగ్ బాస్ హౌస్‌లో కొన్నిసార్లు నెగిటివ్‌గా కనిపించినా, లవ్ ట్రాక్‌లకు దూరంగా ఉండటం, తన ఇమేజ్‌ని కాపాడుకోవడం వల్ల ఆడియన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుందనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రవర్తనపై వచ్చిన పుకార్లకు గట్టి కౌంటర్ ఇస్తూ, "నాకు లవ్ ట్రాక్‌లు వద్దు. కళ్యాణ్ పడాలను బ్రదర్‌లా చూసాను. నా బౌండరీలు నాకు నాకు స్పష్టంగా తెలుసు" అని ప్రియశెట్టి పేర్కొనడం చర్చనీయంగా మారింది.


Click it and Unblock the Notifications











