For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుడిగాలి సుధీర్‌‌కు ఘోర అవమానం: బూతులు తిడుతూ అందరి ముందే.. ప్రముఖ షోలో ఊహించని సంఘటన

  |

  సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ యంగ్ కమెడియన్ దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు. తద్వారా వరుస అవకాశాలను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగా పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ప్రముఖ షోలో ఫేమస్ కమెడియన్ చేసిన పనికి సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  మ్యాజిక్‌లు చేసుకుంటూ తన కెరీర్‌ను ప్రారంభించాడు సుధీర్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ షోలో చేస్తోన్న సమయంలోనే అసాధారణమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీలతో కలిసి అద్భుతమైన స్కిట్లతో అలరిస్తున్నాడు.

  లైవ్‌‌లో అతడికి ముద్దు పెట్టిన శ్రీముఖి: మళ్లీ అదే తప్పు చేస్తూ.. వీడియో వైరల్ అవడంతో ఇంట్లో రచ్చ

  రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో పాపులారిటీ

  రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో పాపులారిటీ

  తనలోని టాలెంట్లను ఒక్కొక్కటిగా బయట పెట్టిన సుడిగాలి సుధీర్ మంచి ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. అయితే, అతడి పేరు మారుమ్రోగిపోడానికి మాత్రం యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వచ్చిన వార్తలే కారణం. అంతేకాదు, ఆమెను పెళ్లాడబోతున్నాడని జరిగిన ప్రచారంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఫలితంగా ఒంటరిగా కంటే జంటగా ఫేమస్ అయ్యాడు.

  యాంకర్‌గా మారిన జబర్ధస్త్ సుధీర్

  యాంకర్‌గా మారిన జబర్ధస్త్ సుధీర్

  ఎన్నో ఏళ్లుగా జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య ‘పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇలా హోస్టింగ్ కూడా చేస్తూ వచ్చాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు.

  ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌ ఎపిసోడ్‌ రెడీగా

  ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌ ఎపిసోడ్‌ రెడీగా

  శ్రీదేవి డ్రామా కంపెనీ షో వచ్చే ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్‌గా ప్రసారం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దీనికి జబర్ధస్త్ కమెడియన్ల స్నేహితులతో పాటు సీరియల్ నటీనటులు రవికృష్ణ, నవ్య స్వామీ కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ప్రముఖ సినీ నటులు ప్రియదర్శి, అభినవ్ గోమటం స్పెషల్ గెస్టులుగా వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ సందడిగా సాగబోతుంది.

  జబర్ధస్త్ టీమ్ లీడర్లపై రాంప్రసాద్ షాకింగ్ కామెంట్స్: షోలోకి వచ్చిన అమ్మాయిలతో అలా చేస్తారంటూ!

  సుడిగాలి సుధీర్‌‌కు ఘోర అవమానం

  సుడిగాలి సుధీర్‌‌కు ఘోర అవమానం


  వచ్చే వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఇది ఎంతో ఫన్నీగా సాగడమే. మరీ ముఖ్యంగా పంచ్ ప్రసాద్ ఇందులో వేసిన సెటైర్లకు గెస్టులే బిత్తరపోయారు. అలాగే, ఇమాన్యూయేల్ - నూకరాజు ఎమోషనల్ సాంగ్ కన్నీరు పెట్టించింది. ఇక, ఈ షోలో ప్రియదర్శి చేసిన పనికి సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం జరిగింది.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  బే.. హౌలేగా అంటూ అందరి ముందే

  బే.. హౌలేగా అంటూ అందరి ముందే


  ప్రోమో ఆరంభంలో హోస్ట్ సుడిగాలి సుధీర్.. ప్రియదర్శిని ‘మీరేదో బుక్ రాశారు కదా. నా సావు నేను సస్తా నీకెందుకు అని.. దాని పరిస్థితి ఏంటి సార్' అని ప్రశ్నించాడు. దీనికి ఆ కమెడియన్ ‘నీకెందుకు బే హౌలే.. అనే వాళ్లు పబ్లిష్ చేస్తున్నారు' అంటూ బదులిచ్చాడు. ప్రియదర్శి చెప్పిన ఈ డైలాగ్‌కు సుధీర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో అతడు తెల్లముఖం ఏసేశాడు.

  English summary
  Telugu Actor and a Stand-up comedian Sudigali Sudheer Now Doing Sridevi Drama Company Show. In This Show Priyadarshi Did Shocking Comments on Sudigali Sudheer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X