For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొలిటీషియన్, క్రికెటర్‌తో పెద్దబాసు ఇంట్లో ప్రియమణి?

  By Bojja Kumar
  |

  బెంగుళూరు : హాట్ హీరోయిన్ ప్రియమణి పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద బాసు ఇంట్లో...అనే అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన ప్రియమణి అదనపు సంపాదన కోసం రూటు మార్చిందా? అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. అలా అని కొంపతీసి ప్రియమణి చేయకూడని పనేదో చేస్తుందని మాత్రం అనుకోవదు సుమీ...!

  అసలు వివరాల్లోకి వెళితే...

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం ఇన్ఫ్సిరేషన్‌గా....కన్నడ వెర్షన్లో 'బిగ్ బాస్' రియాల్టీ షోను ప్రారంభించబోతున్నాడు కన్నడ స్టార్, ఈగ మూవీ విలన్ సుదీప్.

  త్వరలో ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షోలో 'బిగ్ బాస్' హౌస్ లోకి పేరు మోసిన రాజకీయ నాయకులు, పాపులర్ సినీ స్టార్స్, స్టోర్ట్స్ పర్సనాలిటీలను ప్రవేశ పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఇంటిలో కలిసిమెలిసి జీవించాల్సి ఉంటుంది. వీళ్లు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, నిరంతరం టెలివిజన్ కెమెరాల ద్వారా పరిశీలించబడుతుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి సిరీస్ దాదాపు మూడు నెలల పాటు కొనసాగుతుంది. బిగ్ బాస్ ఇంటినుంచి క్రమం తప్పకుండా జరిగే తొలగింపుల నుంచి తప్పించుకోవడం ద్వారా హౌస్‌మేట్స్ (పోటీలో భాగంగా బిగ్ బాస్ ఇంటిలో కలిసి నివశించే పోటీదారులు) నగదు బహుమతిని గెల్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

  సిద్ధరామయ్య కర్నాటకకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు.

  తెలుగు, తమిళం, కన్నడ, మళయాల చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి సౌతిండియా ప్రేక్షకులకు సుపరిచితం

  రాబిన్ ఊతప్ప ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా మ్యాచ్‌లకు ఎంపిక కానప్పటికీ రంజీ మ్యాచులు ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు.

  శ్రీ మురళి కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు

  రాధిక పండిత్ కర్నాటకకు చెందిన బుల్లితెర నటి, మరి ప్రియమణితో పాటు పెద్ద బాసు ఇంట్లో ఈమె చోటు దక్కించుకుంటుందో? లేదో?

  ఈ కార్యక్రమానికి పాపులారిటీ తేవడంలో భాగంగా....కర్నాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య, క్రికెటర్ రాబిన్ ఉతప్ప, గ్లామరస్ హీరోయిన్ ప్రియమణి, యాక్టర్ శ్రీ మురళి, రాధిక పండిత్ తదితరులు ఈ రియాల్టీ షోలో పాల్గొన బోతున్నట్లు ఓ ప్రముఖ కన్నడ దిన పత్రిక పేర్కొంది. త్వరలో ఈ షోలో పాల్గొనే వారి లిస్ట్ ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం కన్నడతో పాటు, తెలుగులోనూ ప్రసారం చేయడానికి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న నటుడు సుదీప్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

  English summary
  Sudeeep's Bigg Boss Kannada will be no less than the Salman Khan hosted Hindi version, as the show seems to be getting bigger and better in Sandalwood. The organisers are leaving no stone unturned to make it a hit show by roping in top names from political class, cinema and sports personalities. Leading Kannada daily, Udayavani has published an article on the probable names of the show participants. It has reported that Opposition leader in the legislative assembly, Siddaramaiah, cricketer Robin Uthappa, glamorous actress Priyamani, actors Sri Murali and Radhika Pandit are being approached for the reality show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X